తన భర్తను కిడ్నాప్ చేశారంటున్నా పాకిస్తాన్ టిక్ టాకర్

పాకిస్తాన్ టిక్ టాక్ సెన్సేషన్ అయిన హరింషాహ్. తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించింది. ఎవరో ఎందుకు కిడ్నాప్ చేశారో తనకి తెలియదు అంటూ వాపోతోంది టిక్ టాక్ స్టార్. ఎలాగైనా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తన భర్తను కనిపెట్టి తనకి అప్పచెప్పాలని కోరుతోంది. కరాచీలో కిడ్నాప్: పాకిస్తాన్ దేశ టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన హరింషాహ్, తన భర్త బిలైను ఎవరో కిడ్నాప్ చేశారంటూ తన గోడును సోషల్ […]

Share:

పాకిస్తాన్ టిక్ టాక్ సెన్సేషన్ అయిన హరింషాహ్. తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించింది. ఎవరో ఎందుకు కిడ్నాప్ చేశారో తనకి తెలియదు అంటూ వాపోతోంది టిక్ టాక్ స్టార్. ఎలాగైనా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తన భర్తను కనిపెట్టి తనకి అప్పచెప్పాలని కోరుతోంది.

కరాచీలో కిడ్నాప్:

పాకిస్తాన్ దేశ టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన హరింషాహ్, తన భర్త బిలైను ఎవరో కిడ్నాప్ చేశారంటూ తన గోడును సోషల్ మీడియాలో పెట్టింది. అయితే తన భర్త ఇటీవల లండన్ నుంచి కరాచీ కు వచ్చాడని, వచ్చిన అనంతరం తన భర్తను కిడ్నాప్ చేశారంటూ వాపోతోంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, తనకు న్యాయం చేకూర్చేలా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతోంది టిక్ టాక్ స్టార్.

నిజానికి తాము లండన్ లో నివసిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే అర్జెంటు పని మీద తన భర్త పాకిస్తాన్ వెళ్ళాడని, అయితే, ఒక రోజు, తను నివాసం ఉంటున్న కరాచీ ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను కిడ్నాప్ చేశారని. ఆగస్టు 27న కిడ్నాప్ జరిగిందని, కిడ్నాప్ చేసిన వ్యక్తులు సాధారణ బట్టలు ధరించి ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది.

తన భర్త కిడ్నాప్ అయిన దగ్గరనుంచి తన భర్త గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదని.. తన భర్తను ఆమానుషంగా ఎవరో కిడ్నాప్ చేశారని, తన భర్తను వెతికేందుకు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతోందామె. అంతేకాకుండా ఈ విషయం మీద లోకల్ పోలీస్ వారికి కిడ్నాప్ సంగతి వివరించినప్పటికీ, అసలు తనని ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా అర్థం కావట్లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ విషయం గురించి కోర్టులో కూడా పిటిషన్ వేసినట్లు తెలిపింది టిక్ టాక్ స్టార్ హరీం.

దోపిడీలు..దొంగతనాలు.. కిడ్నాప్లు: 

ఈ మధ్యకాలంలో దొంగతనాలు, దోపిడీలు ఎక్కువగా మారిపోతున్నాయి. పనిచేయకుండా ఈజీగా సంపాదించేందుకు తప్పుడు మార్గాలు ఎంచుకోవడం పనిగా పెట్టుకుంటున్నారు. బ్యాంకు దోపిడీలు,  దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు.

అంతేకాకుండా అడ్డు వచ్చిన వారిని కూడా చంపి మరీ దుండగులు తమకి కావలసిన నగదునుతో పరారవుతున్నారు. ఇక కిడ్నాప్ విషయానికే వస్తే, కొంతమందిని లక్ష్యంగా పెట్టుకొని కిడ్నాప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు ఫోను చేసి.. తమకు కావలసినంత డబ్బుని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో, అమానుషంగా నిండు ప్రాణాన్ని బలికొంటున్నారు దుండగులు.

ఎటువైపు చూసినా హింస, కక్షలు, కుట్రలు ఎక్కువగా అయిపోతున్నాయి. నిజానికి ఒకరికి డబ్బు అవసరం లేనప్పటికీ, మరొకరి కుటుంబంలో బాధని చూసేందుకు, కక్ష పెట్టుకుని కిడ్నాప్ చేసి చంపేందుకు కూడా వెనకాడట్లేదు మరి కొంతమంది. ఇలా చెప్పుకుంటూపోతే, కేవలం ఒక దేశం లోనే కాదు, అనేక దేశాలలో కూడా ఇటువంటి హింస ఎక్కువైపోయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటువంటివి ఒకరి నుంచి మరొకరు చూసి నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. 

సినిమాలో చూపించే దొంగతనాలు, దోపిడీ, కిడ్నాప్, ఇటువంటివి నటన అని తెలిసినప్పటికీ, అలాంటి వాటికి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ అయ్యు, అటువంటివి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఒకరిని బాధ పెట్టడం, హింసకి గురి చేయడం నిజంగా పాపం, నేరం. హంసించే ముందు, ఒకరిని బాధ పెట్టే ముందు, కుటుంబ సభ్యులని ఒక్కసారి గుర్తు చేసుకోగలిగితే వారికి కూడా అటువంటి కష్టం వస్తే, ఆ బాధ  ఊహించి, తప్పు చేయాలనే ఆలోచనపోతుంది.