ప్రపంచంలోనే అతి చిన్న రెస్టారెంట్

‘సోలో ఫర్ డ్యూ’ అనే రెస్టారెంట్ ఈ ప్రపంచంలోనే చాలా చిన్న రెస్టారెంట్. కానీ ఈ చిన్న రెస్టారెంట్లో భోజనం చేయాలంటే 4000.రూ ఖర్చు పెట్టాల్సిందే. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క రెస్టారెంట్ కి ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ ఇటలీలో ఉండే రైటు అనే ప్రదేశంలో ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. కానీ నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఈ రెస్టారెంట్ లోపల కేవలం ఇద్దరు భోజనం చేయడానికి […]

Share:

‘సోలో ఫర్ డ్యూ’ అనే రెస్టారెంట్ ఈ ప్రపంచంలోనే చాలా చిన్న రెస్టారెంట్. కానీ ఈ చిన్న రెస్టారెంట్లో భోజనం చేయాలంటే 4000.రూ ఖర్చు పెట్టాల్సిందే. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క రెస్టారెంట్ కి ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ ఇటలీలో ఉండే రైటు అనే ప్రదేశంలో ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. కానీ నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఈ రెస్టారెంట్ లోపల కేవలం ఇద్దరు భోజనం చేయడానికి మాత్రమే అవుతుంది. 500 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం లో ఉండే ఈ రాతి కట్టడం లాంటి రెస్టారెంట్ చూడడానికి చాలా బాగుంటుంది. 

రెస్టారెంట్ ప్రత్యేకతలు: 

రెస్టారెంట్ గేట్ ఓపెన్ చేయగానే ఒక పచ్చని అందమైన వనం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తరువాత మనకు పామ్ ట్రీస్ ఇక్కడ దర్శనమిస్తాయి. పొలాలు, ఎత్తైన కొండలు, ఆలివ్ మొక్కలతో ఈ ప్రదేశం చూడటానికి ఒక నందనవనంల కనిపిస్తుంది. 20వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడం, ప్రకృతి ప్రేమికులకు చూపు తిట్టుకోనివ్వకుండా చేస్తుంది. అంతేకాకుండా ఈ రెస్టారెంట్ లోపల మొత్తం రెడ్ కలర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ మనకు కనిపిస్తాయి. అప్పట్లో కట్టడాలకు వాడే రాయలను వాడడం వల్ల, ఈ రెస్టారెంట్ మరింత ఆకర్షణీయంగా మనకు కనిపిస్తుంది.

ఈ రెస్టారెంట్ కి ‘ సోలో ఫర్ డ్యూ’ అనే పేరు ఎలా వచ్చింది: 

నిజానికి చెప్పుకోవాలంటే సోలో ఫర్ డ్యూ అనే పదం ఇటాలియన్ పదం. ఇది ఇంగ్లీష్ లో జస్ట్ ఫర్ 2, అంటే ఇద్దరి కోసం మాత్రమే అని అర్థం వస్తుంది. జంటగా మాత్రమే డిన్నర్ చేసే వాళ్ళకి ఈ అద్భుతమైన రెస్టారెంట్ ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఈ రెస్టారెంట్ కట్టడానికి గల కారణం, ఏంటో తెలిస్తే మీరు నవ్వక తప్పదు. ఈ రెస్టారెంట్ ఓనర్ ఇతర రెస్టారెంట్లు మాదిరిగా విశాలంగా ఉండాలని, అందులో జనాలతో ఉక్కిరిబిక్కిరిగా ఉండాలని కోరుకోలేదు. అందుకే తమ రెస్టారెంట్ కు వచ్చిన ఇద్దరు అతిథులు ప్రశాంతంగా భోంచేయాలనేది ఆ రెస్టారెంట్ ఓనర్ యొక్క ముఖ్య ఉద్దేశం. 

బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి: 

ఈ అందమైన జస్ట్ ఫర్ టు రెస్టారెంట్ చూడటానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ ఇందులో విశేషాలు అన్నీ చాలా పెద్దవి. ఈ రెస్టారెంట్ కి వెళ్ళాలి అనుకునేవారు తప్పకుండా ఏడు రోజులు ముందే ఏదో ఒక రోజు బుక్ చేసుకోవాలి. అది కూడా కేవలం ఫోన్ ద్వారా మధ్యాహ్నం పూటే బుకింగ్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా కేవలం 44,000 రూపాయలకే, డైనింగ్ అరేంజ్ చేయబడుతుంది. మీరు డిన్నర్ చేస్తూనే మంచి రొమాంటిక్ సాంగ్స్ కూడా ఇక్కడ వినొచ్చు. ప్రపంచంలోనే అతి చిన్న రెస్టారెంట్, కానీ గొప్ప ప్రత్యేకతలు.

ముఖ్యంగా పెళ్లి అయిన కొత్తలో చాలామంది ప్రశాంతంగా ఏకాంతంగా గడపడానికి ఎన్నో ప్రదేశాలను సందర్శించడానికి ఎవరైతే ఎక్కువ మక్కువ చెపుతారో, అలాంటి వారి కోసం ఈ ప్రదేశం నిజంగా చక్కని ఎంపిక. అంతే కాకుండా ఇక్కడ ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఒక రోజైనా గడపడానికి ఎంతో బాగుంటుంది. అంతే కాకుండా ప్రపంచ యాత్రికులకు, రిలాక్స్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఒక్కరోజు గడిపిన సరే, ఎన్నో ఏళ్ల నాటి ప్రశాంతత మీకు తప్పకుండా కలుగుతుంది.