ప్ర‌పంచంలోనే అత్యంత స్వ‌చ్ఛ‌మైన గాలి వీచే ప్ర‌దేశం ఇదే

స్వచ్ఛమైన గాలి పీల్చుకుని చాలామంది చాలా సంవత్సరాలయింది. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్య వాతావరణం కారణంగా మనుషులకు స్వచ్ఛమైన గాలి అందడమే కరువైంది. అయితే ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలి లభించే ఒక ప్రదేశమైతే కనిపిస్తోంది. చాలామంది అడ్వెంచర్స్ చేయాలి అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్లి చక్కని స్వచ్ఛమైన గాలి పీల్చుకుని ఆస్వాదిస్తున్నారు. ఆ ప్రదేశం గురించి మారింత:  భూమిపై స్వచ్ఛమైన గాలి కోసం అన్వేషణ ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న అత్యవసర ప్రయత్నంగా మారింది. వాయు కాలుష్యం, వాతావరణ మార్పుల […]

Share:

స్వచ్ఛమైన గాలి పీల్చుకుని చాలామంది చాలా సంవత్సరాలయింది. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్య వాతావరణం కారణంగా మనుషులకు స్వచ్ఛమైన గాలి అందడమే కరువైంది. అయితే ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలి లభించే ఒక ప్రదేశమైతే కనిపిస్తోంది. చాలామంది అడ్వెంచర్స్ చేయాలి అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్లి చక్కని స్వచ్ఛమైన గాలి పీల్చుకుని ఆస్వాదిస్తున్నారు.

ఆ ప్రదేశం గురించి మారింత: 

భూమిపై స్వచ్ఛమైన గాలి కోసం అన్వేషణ ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న అత్యవసర ప్రయత్నంగా మారింది. వాయు కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా మారుతున్న ప్రతికూల ప్రభావాలతో ప్రపంచం బలైపోతుందని చెప్పుకోవచ్చు. అన్ని జీవుల ఆరోగ్య శ్రేయస్సు కోసం స్వచ్ఛమైన, ప్రాణవాయువు అందించే స్వచ్ఛమైన గాలి అవసరం పెరిగిందని చెప్పుకోవాలి. ఈ విషయంలో ఒక ప్రదేశం ప్రత్యేకంగా నిలుస్తుంది, సందర్శకులకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన గాలిని అందిస్తుంది. కేప్ గ్రిమ్ అని పిలువబడే ఈ ఐలాండ్, ఆస్ట్రేలియాకు సమీపంలోని టాస్మానియాకు అతి దగ్గరలో ఉన్నట్లు సమాచారం. 

ఈ ప్రత్యేక అనుభవానికి ప్రధాన కారణం ల్యాండ్ ప్యాచ్ రిమోట్‌నెస్. “ఎడ్జ్ ఆఫ్ ది వరల్డ్”గా ప్రసిద్ధి చెందిన కేప్ గ్రిమ్‌కు కొంతమంది ప్రయాణికులు ప్రతిఏటా ప్రయాణిస్తూ ఉంటారు. గాలి నాణ్యత విషయానికి వస్తే, అక్కడ స్వచ్ఛమైన గాలి అందుతుంది. ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా అక్కడికే వెళ్లి సేదతీరుతూ ఉంటారు.

వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే స్వచ్ఛమైన గాలి: 

కేప్ గ్రిమ్ ఎయిర్ మానిటరింగ్ స్టేషన్‌ను తాకిన బలమైన పశ్చిమ గాలులు మంచుతో నిండిన దక్షిణ మహాసముద్రం మీదుగా వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వస్తాయని, ఇక్కడ గాలిని ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన అత్యంత స్వచ్ఛమైన గాలిగా పరిగణలోకి తీసుకోవడం జరిగిందని, కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CSIRO) సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ ఆన్ స్టావర్ట్ చెప్పారు. 

ఈ ప్రాంతం నిజానికి చెప్పాలంటే, భయంకరమైన గాలులకు ప్రసిద్ధి చెందింది, ఇక్కడ వీచే గాలి వేగం అనేది నిజానికి 180kmph చేరుకున్న ఆశ్చర్యం పడక్కర్లేదు. ఈ క్రమంలోనే, అంటార్కిటికా నుండి చెడుగాలిని బయటకి పంపించేస్తుంది ఈ ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర రిమోట్ క్లీన్ ఎయిర్ సైట్‌లలో, హవాయిలోని మౌనా లోవా స్టేషన్, మాక్వేరీ ద్వీపం, అంటార్కిటికాలోని కేసీ స్టేషన్ మరియు నై-అలెసుండ్ యొక్క స్వాల్‌బార్డ్ పట్టణం చోటు దక్కించుకున్నాయి. అయితే ఇక్కడ వింతైన విషయం ఏమిటంటే, విక్రయదారులకు కూడా అవకాశం కల్పించింది ఈ దేవి. ప్రపంచవ్యాప్తంగా కలుషిత ప్రదేశాలలో ఉన్న ప్రజలకు కాలుష్య రహితమైన గాలిని అందించడానికి వారు బాటిల్ టాస్మానియన్ గాలిని అమ్ముతూ ఉండడం విశేషం. 

కాలుష్యం కారణంగా ఎక్కువ అవుతున్న వరదలు: 

ఏది ఏమైనప్పటికీ అకాల వర్షాలు, అధిక వర్షాలు ప్రస్తుత కాలంలో ఎక్కువ అయ్యాయని చెప్పుకోవాలి. దీనంతటికీ కారణం కేవలం పెరుగుతున్న కాలుష్యమే కారణం. అధిక వర్షాలు వచ్చినప్పుడు, వరదలు ముప్పు పొంచి ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు వర్షాలు పడక ముందు కాలుష్యం తగ్గించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా, అధిక మొత్తంలో మంచు కరగడం వల్ల నీటిమట్టం అమాంతం పెరగడం వల్ల వర్షాలు వచ్చే సమయానికి చాలా ప్రాంతాలలో వరదలు వచ్చి ముంచెత్తుతున్నాయి. 

ఇదిలా కొనసాగితే, భూమిమీద నీటిమట్టం అధికం అవ్వడమే కాకుండా, త్వరలోనే మానవాళి నిర్మూల పరిస్థితి ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటినుంచే పలు జాగ్రత్తలు తీసుకుంటూ, కాలుష్య రహిత పదార్థాలను వాడడం వల్ల, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం ఇలా పలు రకాల కాలుష్యాలు తగ్గించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.