Hamas: హమాస్ టెర్రరిస్టులకు మైండ్ బ్లాంక్

ఇజ్రాయెల్-పాలస్తీనా (Israel-Palestine war) యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా (Gaja) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గాజా (Gaja)లో ఉన్న హమాస్ ఉగ్రవాదులే తమ టార్గెట్  అని ఇజ్రాయెల్ (Israel) ఇప్పటికే ప్రకటించింది. అంతే కాకుండా గాజా (Gaja)లో ఉంటున్న పౌరులను దక్షిణ దిక్కుగా వెళ్లమని ఇజ్రాయెల్ (Israel) ఇప్పటికే సూచించింది. ఇజ్రాయెల్ (Israel) సూచనతో చాలా మంది పౌరులు ఇప్పటికే గాజా (Gaja)ను వదిలి వెళ్లారు. ఇజ్రాయెల్ దాడి చేయకముందు హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ (Israel) […]

Share:

ఇజ్రాయెల్-పాలస్తీనా (Israel-Palestine war) యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా (Gaja) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గాజా (Gaja)లో ఉన్న హమాస్ ఉగ్రవాదులే తమ టార్గెట్  అని ఇజ్రాయెల్ (Israel) ఇప్పటికే ప్రకటించింది. అంతే కాకుండా గాజా (Gaja)లో ఉంటున్న పౌరులను దక్షిణ దిక్కుగా వెళ్లమని ఇజ్రాయెల్ (Israel) ఇప్పటికే సూచించింది. ఇజ్రాయెల్ (Israel) సూచనతో చాలా మంది పౌరులు ఇప్పటికే గాజా (Gaja)ను వదిలి వెళ్లారు. ఇజ్రాయెల్ దాడి చేయకముందు హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ (Israel) మీద దాడి చేసి అనేక మంది చంపేశారు. నరమేధం చేయడమే కాకుండా అనేక మందిని బంధీలుగా కూడా పట్టుకున్నారు. ఇలా బంధీలుగా పట్టుకున్న వారిలో కొంత మందిని హమాస్ (Hamas) టెర్రరిస్టులు విడుదల చేస్తున్నారు. ఇంకా కొంత మందిని తమ వద్దే బంధీలుగా ఉంచుకుంటున్నారు. 

గర్ల్ ఫ్రెండ్ కోసం.. 

ఇలా అనేక మందిని బంధీలుగా పట్టుకున్న హమాస్ (Hamas) చెర నుంచి తన స్నేహితురాలిని విడిపించేందుకు 24 సంవత్సరాల  ఓ యువకుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇజ్రాయెల్ (Israel) లోని హైఫాకు చెందిన ఆర్ట్ విద్యార్థి ఇన్బర్ హైమాన్ సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లో (Music Festival) స్వచ్ఛందంగా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ కార్యకర్తలు ఇజ్రాయెల్ (Israel) మీద దాడి చేసి.. అనేక మందిని బంధీలుగా పట్టుకున్నారు. స్థానికంగా నిర్వహిస్తున్న మ్యూజిక్ ఫెస్టివల్ మీద దాడి చేసి అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. అంతే కాకుండా బంధీలుగా కూడా పట్టుకున్నారు. ఆ తుపాకుల (Guns) శబ్దానికి అనేక మంది భయపడి పరుగులు తీశారు. ఇలా పరుగులు తీసిన వారిలో 24 సంవత్సరాల ఆర్ట్ స్టూడెంట్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. 24 సంవత్సరాల యువకుడు తప్పించుకున్నా కానీ అతడి స్నేహితురాలు మాత్రం తప్పించుకోలేకపోయింది. ఆమెను హమాస్ కార్యకర్తలు బందీలుగా పట్టుకున్నారు. దీంతో ఆమెను విడిపించేందుకు ఆమె స్నేహితుడు సిద్దం అయ్యాడు.  తర్వాత వైరల్ (Viral) అయిన వీడియోను చూస్తే ఆమెను హమాస్ (Hamas) కార్యకర్తలు మోటార్ బైక్ ల మీద లాక్కుంటూ వెళ్లినట్లు అర్థం అయింది. దీంతో ఆమె ప్రియుడు కంగారు పడి ఆమెను క్షేమంగా తీసుకురావాలని అధికారులను వేడుకున్నాడు. కానీ ఆమెను హమాస్ (Hamas) ఉగ్రవాదులు గాజా (Gaja)కు తీసుకెళ్లినట్లు అధికారులు అతడితో చెప్పారు. 

ప్లీజ్ ఆమెను బతికించండి.. 

ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను బతికించమని అధికారులను అభ్యర్థిస్తున్నాడు. ఆమె మీద కాసింత శ్రద్ధ వహించమని అతడు అధికారులను కోరాడు. ఇజ్రాయెల్ (Israel) ప్రభుత్వం మరియు బ్రిటన్ ప్రభుత్వం బంధీలు సురక్షితంగా మరియు సజీవంగా తిరిగి వచ్చేలా చేయాలని అతడు అభ్యర్థించాడు. ఇది ఇజ్రాయెల్ (Israel) సైన్యానికి మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన విషయం అని అతడు పేర్కొన్నాడు.  24 ఏళ్ల అలోన్ తన కథనాన్ని మీడియా (Media)లో ఉంచాలని నిశ్చయించుకున్నట్లు మీడియా (Media) తో చెప్పారు. ఆమె మా వద్దకు తిరిగి వస్తుందని నేను నిజంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. కానీ ఆమె అలా చేస్తుందని నిర్ధారించుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయాలని పేర్కొన్నాడు. 

తమ స్నేహితులైన గ్రాఫిటీ (Graffiti) కళాకారులు ఆమె కథను వ్యాప్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని అతను పేర్కొన్నాడు. అతడు మాట్లాడుతూ.. ఆమె కథను వ్యాప్తి చేయడానికి మరియు మరింత దృష్టిని ఆకర్షించడానికి మేము వీధిలో చాలా కళలను తయారు చేస్తున్నామని అలోన్ చెప్పారు. మ్యూజిక్ ఫెస్ట్‌లో కనీసం 260 మంది మరణించారని మరియు ఇన్‌బార్‌ తో సహా అనేక మందిని బంధీలుగా పట్టుకున్నారని తెలిపారు. పండుగకు వెళ్లేవారు మోటార్‌బైక్‌ లు మరియు పికప్ ట్రక్కుల వెనుక నుంచి సహాయం కోసం వేడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆనందంగా అందరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో హమాస్ ఉగ్రవాదులు చేసిన భయంకర రూపాలు అందర్నీ షాక్ (Shock) కు గురి చేశాయి. అక్కడి భయానక దృశ్యాలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలను చూసి అనేక మంది విలవిల్లాడారు. దీంతో పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో మనకు ఇట్టే అర్థం అయింది.