రాఫ్లేసియా ఆర్నాల్డి..

మన భూమిపై అత్యద్భుతాల్లో రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం ఒకటి. ఇది అరుదైనది. ఒక్క పువ్వు రావాలన్నా కొన్నేళ్లు పడుతుంది. అలాంటి పువ్పు ఓ సాధారణ వ్యక్తికి అనుకోకుండా అడవిలో కనిపించింది. ఆశ్చర్యపోయాడు. ఆ పువ్వుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దాన్ని చూసి.. ఎంత బాగుందో అంటున్నారు. మరి అది ఎలాంటిది? దాని ప్రత్యేకతలేంటి? ఎక్కడ పూసింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.. పెద్ద, చిన్న అనే తారతమ్యాలను మనం చిన్నప్పటి […]

Share:

మన భూమిపై అత్యద్భుతాల్లో రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం ఒకటి. ఇది అరుదైనది. ఒక్క పువ్వు రావాలన్నా కొన్నేళ్లు పడుతుంది. అలాంటి పువ్పు ఓ సాధారణ వ్యక్తికి అనుకోకుండా అడవిలో కనిపించింది. ఆశ్చర్యపోయాడు. ఆ పువ్వుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దాన్ని చూసి.. ఎంత బాగుందో అంటున్నారు. మరి అది ఎలాంటిది? దాని ప్రత్యేకతలేంటి? ఎక్కడ పూసింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

పెద్ద, చిన్న అనే తారతమ్యాలను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. చూస్తూనే ఉన్నాం. పెద్ద, చిన్నా మాత్రమే కాకుండా ఇంకా అనేక విధాల బేధాలు చూపిస్తారు మానవులు. మనుషులతోపాటూ జంతువులు, పశు పక్ష్యాదుల్లో కూడా ఈ తేడాలు ఉంటాయేమో. మనకు తెలియకపోయినా ఉండే ఉంటాయి. పెద్ద వాటికి ఉండే విలువ వేరేలా ఉంటుంది. కేవలం పెద్ద వాటికి మాత్రమే కాకుండా చిన్నగా ఉన్న వస్తువులకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకోసమే చాలా చోట్ల వాటి పేర్లు రాసి ఉంటాయి.

ట్రెక్కింగ్ చేసే వ్యక్తికి కనిపించిన పుష్పం

ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పంగా రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం ప్రసిద్ధిగాంచింది. ఈ పువ్వును బీట్ చేసే పువ్వును ఇప్పటివరకూ ఎవరూ కనుక్కోలేకపోయారు. అందుకోసమే ఇది పెద్ద పుష్పంగా రికార్డుల్లో ఉంది. ఇండోనేషియా అడవిలో పర్యటిస్తున్న ఓ వ్యక్తికి ఇది కనిపించింది. కానీ ఈ పుష్పం వికసించే సమయంలో ఘోరమైన దుర్వాసన వస్తుంది. ఇది 3 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. అంతేకాకుండా 15 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. నౌ దిస్ అనే ట్విటర్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న పువ్వు పూర్తిగా వికసించి ఉంది. ఇది ప్రపంచంలో ఉండే అరుదైన పుష్పాలలో ఒకటిగా పేరు గాంచింది.

అరుదైన జాతి పుష్పం..

రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం ప్రపంచంలోనే అతి అరుదైన జాతికి చెందిన పుష్పంగా పేరు గాంచింది. ఇది కేవలం 4 రోజుల పాటు మాత్రమే వికసించి ఉంటుంది. అందుకోసమే ఈ పుష్పాన్ని చూసేందుకు అనేక మంది ఆరాటపడుతుంటారు.  

దీనిని మొదట జావాలో 1791 మరియు 1794 మధ్యకాలంలో లూయిస్ డెస్చాంప్స్ కనుగొన్నారు. తర్వాత దీనిని ఇండోనేషియాలోని బెంగ్‌కులు, సుమత్రాలోని ఇండోనేషియా రెయిన్‌ఫారెస్ట్‌లో 1818లో డాక్టర్ జోసెఫ్ ఆర్నాల్డ్ కోసం పని చేస్తున్న ఇండోనేషియా గైడ్ ద్వారా కనుగొనబడింది. మరియు సర్ థామస్ స్టాంఫోర్డ్ రాఫెల్స్ పేరు దీనికి పెట్టారు. రాఫ్లేసియా 106 సెంటీమీటర్ల వరకు వ్యాసం మరియు 10 కిలోల వరకు బరువు కలిగి, 3 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. రాఫ్లేసియా పువ్వు 5-7 రోజుల చిన్న జీవితాన్ని కలిగి ఉంటుంది. రాఫ్లేసియాస్ వాటి కేసరాలు మరియు పిస్టిల్‌లను ఒక మధ్య స్తంభంలో కలిసిపోయి, ఉంగరం ఆకారంలో కరోనా లేదా కిరీటాన్ని ఉత్పత్తి చేస్తాయి. రేకుల యొక్క రంగు ఎర్రటి గోధుమ రంగులో తెల్లటి మచ్చలతో ఉంటుంది. ఈ పువ్వు వాసన క్యారియన్ ఈగలను ఆకర్షిస్తుంది. మరియు తరువాత పరాగసంపర్కం జరుగుతుంది. 9 నెలల పరిపక్వత తర్వాత, రాఫ్లేసియా మొక్క క్యాబేజీ పరిమాణంలో మొగ్గగా తెరుచుకుంటుంది.

భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు..

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత.. ప్రపంచంలోని చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన అనేక మంది నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వారు చేసే కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పుష్పం గ్రహంతర వాసుల నుంచి వచ్చిందా? అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.