African Man Isolation: ఆడవాళ్లంటే భయం..55 ఏళ్లుగా ఇంట్లోనే జీవిస్తున్న వ్యక్తి

71 ఏళ్ల వ్యక్తికి ఆడవాళ్లంటే విపరీతమైన భయం(Fear of women). ఆ భయంతో 55 ఏళ్లుగా ఇంటిలోనే జీవిస్తున్నాడు. ఆడవాళ్లు కనిపించకుండా 15 అడుగుల ఎత్తు కంచె(Fence) కట్టుకున్నాడు. అతని వయస్సు 71 ఏళ్లు. ఆడవాళ్లంటే మహా భయం(Fear of women). ఎక్కడ ఆడవాళ్లు కనిపిస్తారోని.. వారితో మాట్లాడాల్సి వస్తుందనే భయంతో ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టడు. ఆ భయంతోనే 55 ఏళ్లుగా ఇంటిలోనే జీవిస్తున్నాడు. ఆడవాళ్లు ఎవరు కనిపించకుండా తన ఇంటి చుట్టు 15 […]

Share:

71 ఏళ్ల వ్యక్తికి ఆడవాళ్లంటే విపరీతమైన భయం(Fear of women). ఆ భయంతో 55 ఏళ్లుగా ఇంటిలోనే జీవిస్తున్నాడు. ఆడవాళ్లు కనిపించకుండా 15 అడుగుల ఎత్తు కంచె(Fence) కట్టుకున్నాడు.

అతని వయస్సు 71 ఏళ్లు. ఆడవాళ్లంటే మహా భయం(Fear of women). ఎక్కడ ఆడవాళ్లు కనిపిస్తారోని.. వారితో మాట్లాడాల్సి వస్తుందనే భయంతో ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టడు. ఆ భయంతోనే 55 ఏళ్లుగా ఇంటిలోనే జీవిస్తున్నాడు. ఆడవాళ్లు ఎవరు కనిపించకుండా తన ఇంటి చుట్టు 15 అడుగుల ఎత్తు కంచె(High fence) కట్టేసుకున్నాడు. ఎంతో అత్యవసరమైతే ఇంటినుంచి బయటకు రాడు. ఓకవేళ వచ్చినా తన ఇంటి ముందు కంచె(Fence) దాటి మాత్రం బయటకు రాడు. ఆ దారి వెంట ఎవరైనా మహిళలు కనిపిస్తే పరుగు పరుగున ఇంట్లోకి దూరిపోయి తాళం వేసేకుంటాడు. అతనికి 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పనుంచి అలాగే జీవిస్తున్నాడు. ఆడవాళ్లంటే అతనికి ఉన్న భయం(Fear of women) వల్ల వివాహం(Marriage) కూడా చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నాడు.

ఆ వింత వ్యక్తి పేరు ‘కాలిటెక్స్ నజాంవిటా'(Callitxe Nzamwita). ఆఫ్రికా(Africa) దేశాల్లోని ఉగాండా(Uganda)కు చెందినవాడు. ఇతను 55 ఏళ్లుగా ఇంటిలోనే జీవిస్తున్నాడు. ఎంతో అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాడు. వచ్చిన ఇంటి చుట్టు కట్టుకున్న 15 అడుగుల కంచె(Fence) దాటి బయటకు అడుగు పెట్టడు. దీనికి కారణం ఆడవాళ్లంటే విపరీతమైన భయం. అతను ఇంటి బయటకు రావటం ఆ చుట్టు పక్కల వారు కూడా ఎప్పుడు చూసిందే లేదట. తనకున్న ఈ వింత భయంతో ఆడవాళ్లకే కాదు మగవారి కూడా దూరంగా జీవిస్తున్నాడు ఒంటరిగా..

మరి 55 ఏళ్ల నుంచి ఇంట్లోనే ఉంటే అతను జీవించటానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు(Necessary goods) ఎలా వస్తాయి..అతని మంచి చెడులు ఎలా అనే అనుమానం వచ్చే తీరుతుంది. కానీ ఆడవాళ్లంటే ఇంత విపరీతమైన భయం ఉన్న కాలిటెక్స్(Callitxe) కు కావాల్సిన సరుకులు, వస్తువులు ఆ చుట్టుపక్కల ఆడవారే అందిస్తారట. ఇరుగు పొరుగు ఆడవారు అతనికి కావాల్సిన నిత్యావసర వస్తువులు తెచ్చి అతను ఇంటి కంచె లోపలికి విసిరేసిపోతారు. వాళ్లు వెళ్లిపోయారని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా బయటకొచ్చి ఆ సరుకుల సంచి తీసుకుని పరుగు పరుగు ఇంట్లోకి వెళ్లి తాళం వేసేసుకుంటాడట..

అతని గురించి తెలిసి ఓ మీడియా ఇంటర్వ్యూ(Interview) చేయగా అతను మాట్లాడుతూ..‘‘నేను ఆడవాళ్లు నా ఇంటి పరిసరాలకు రాకుండా ఉండేందుకు ఎత్తుగా కంచె నిర్మించుకున్నానని దానికి కారణం ఆడవాళ్లు ఎవ్వరు నా ఇంటి లోపలికి రాకుండా ఉండే జాగ్రత్తల కోసమే’’నని చెప్పాడట.

ఆడవాళ్లంటే అతనికి అంత విపరీతమైన భయపడటానికి కారణం అతనికి ఉన్న ‘గైనోఫోబియా’(Gynophobia) అనే వ్యాధినని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఫోబియా(Phobia) అనేది ఫొబోస్‌ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫొబోస్‌ అంటే భయం. వాస్తవానికి దాన్నించి మనకి ఎలాంటి ప్రమాదం, హాని లేకపోయినా కూడా తీవ్రంగా భయపడిపోతుంటారు. గైనోఫోబియా(Gynophobia)  సమస్య ఉన్నవారికి ఆడవాళ్లంటే భయాందోళనలు ఎక్కువ స్థాయిలో ఉంటాయట. వారితో మాట్లాడటమే కాదు కనీసం చూడటానికి కూడా భయపడతారట. ఈ పరిస్థితి వారికి ఒకవేళ ఆడవారి కనిపిస్తే ఊపిరి తీసుకోవటం కష్టమైపోతుందట. శరీరం చెమటలు పట్టేసి..హార్ట్ బీట్ లో ఎక్కువగా కొట్టుకుంటుందట.  కాలిటెక్స్ నజాంవిటా అదే వ్యాధితో బాధపడటం వల్లే అతను ఇంటిలోనే జీవిస్తున్నాడట.

 కొంతమందికి నీళ్లంటే భయం, మరికొంతమందికి మంటలంటే భయం, ఇంకొందరికి చీకటి అంటే భయం. అలా వారి వారి మానసిక స్థితి(state of mind)ని బట్టి వారిలో ఆ భయాలు ఉంటుంటాయి. కానీ ఆడవాళ్లంటే మరీ ఇంత విపరీతమైన భయం అనే వింత వ్యక్తి బహుశా ఇతనే అయి ఉంటాడేమో.