గిన్నిస్ రికార్డ్ సాధించిన శునకం జ్యూస్ ఇక లేదు

పెంపుడు జంతువులు ప్రతి ఒక్కరు కుటుంబంలో కుటుంబ సభ్యులలో ఒకరిగా నిలిచిపోతాయి. చాలామంది తమ ఇళ్లల్లో సరదాకి తెచ్చుకున్న చిన్న చిన్న కుక్క పిల్లలు, కోడి పిల్లలు అనుకోకుండానే తమ కుటుంబ సభ్యులుగా మారిపోతుంటాయి.  కానీ ఆ పెంపుడు జంతువులు మనల్ని వదిలి వెళ్ళే క్షణాలు, ప్రతి ఒక్కరి మనసులను కలిచి వేస్తాయి. టెక్సాస్ లో ఇటువంటి సంఘటన ఒకటి ఎదురయింది.  గిన్నిస్ రికార్డ్స్ సాధించిన శునకం ఇక లేదు: జ్యూస్ అనే సునకం ఇటీవల కన్ను […]

Share:

పెంపుడు జంతువులు ప్రతి ఒక్కరు కుటుంబంలో కుటుంబ సభ్యులలో ఒకరిగా నిలిచిపోతాయి. చాలామంది తమ ఇళ్లల్లో సరదాకి తెచ్చుకున్న చిన్న చిన్న కుక్క పిల్లలు, కోడి పిల్లలు అనుకోకుండానే తమ కుటుంబ సభ్యులుగా మారిపోతుంటాయి.  కానీ ఆ పెంపుడు జంతువులు మనల్ని వదిలి వెళ్ళే క్షణాలు, ప్రతి ఒక్కరి మనసులను కలిచి వేస్తాయి. టెక్సాస్ లో ఇటువంటి సంఘటన ఒకటి ఎదురయింది. 

గిన్నిస్ రికార్డ్స్ సాధించిన శునకం ఇక లేదు:

జ్యూస్ అనే సునకం ఇటీవల కన్ను మూసింది. తను ఎప్పటినుంచో బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ తన మూడవ ఏట మరణించింది. ప్రస్తుతం వార్త సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మనసును కలిచివేస్తోంది.

ఎన్నో సందర్భాలలో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన జ్యూస్ ఇక లేదు అని తెలిసిన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. జ్యూస్ తన ఎత్తుకు సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే ఎత్తుగా ఉన్న కుక్కగా రికార్డ్ కొల్లగొట్టింది. జ్యూస్ హైట్ సుమారు  1.046 మీటర్లు.. ఇంచుమించు మూడు అడుగుల 3.18 ఇంచులు.

అయితే జ్యూస్ ముందర కుడికాలు క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించి తీసేయాల్సి వచ్చింది కూడా. కానీ అనుకోని విధంగా జ్యూస్ సెప్టెంబర్ 12న తన తుది శ్వాస విడిచింది. అయితే దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరినీ బాధలోకి నెట్టింది. క్యాన్సర్ కారణంగా, తను ఎంతగానో ప్రేమగా చూసుకున్న తన ప్రియమైన.. సునకం జ్యూస్ ఇక లేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ బాధలో మునిగిపోయారు జ్యూస్ యజమాని బ్రిటని డేవిస్. తన ప్రియమైన జ్యూస్ చివరిగా తన ఊళ్లోనే తల పెట్టుకుని.. తుది శ్వాస విడిచిందనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

జ్యూస్ తో గడిపిన ప్రతి క్షణం కూడా తనకి ఎంతో ఆహ్లాదకరాన్ని.. ఆనందాన్ని అందించిందని. తాను ఎప్పుడూ కూడా తనకి రక్షణగా ఉండేది అని.. జ్యూస్ తమ కుటుంబంలో ఒకరిగా ఉంటూ నవ్విస్తూ.. సరదాగా ఆడుకునేదని.. అయితే జ్యూస్ ఆరోగ్య విషమించినప్పుడు తమతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి తను ఎంతగానో కృతజ్ఞతలుగా ఉన్నాదని డేవిస్ మరొకసారి బాధపడ్డారు. అంతేకాకుండా జ్యూస్ ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా ఇప్పటివరకు కాపాడిన డాక్టర్లకు నర్సులకు.. నిరంతరం తమ జ్యూస్ ని కాపాడేందుకు సమయాన్ని కూడా లెక్కచేయకుండా ట్రీట్మెంట్ అందించినందుకు.. డాక్టర్లకు నర్సులకు తన వైపు నుంచి కృతజ్ఞతలు తెలియచేసారు డేవిస్.

జ్యూస్ ఇప్పుడు మనకి అందనంత ఎత్తులో ఉన్నప్పటికీ తను అక్కడ కూడా ఫ్రీగా.. ఆనందంగా ఆహ్లాదకరంగా స్వర్గంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంటుందని మరొకసారి ఆశ భవాని వ్యక్తం చేశారు.. జ్యూస్ యజమాని. నిజానికి జ్యూస్ తమ కుటుంబానికి దొరికిన వరం అంటూ మాట్లాడారు.

అయితే జ్యూస్ గిన్నిస్ రికార్డ్ సాధించిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో డేవిస్ మాట్లాడుతూ.. తనకి ఎప్పుడు కూడా ఒక  చిన్నక కుక్క పిల్లని పెంచుకోవాలని ఆలోచన ఉండేదని.. ఈ సందర్భంలోనే తన తమ్ముడికి తెలిసిన వ్యక్తి ద్వారా జ్యూస్ 8 వారాల చిన్నపిల్లగా ఉన్నప్పుడు తమ ఇంటికి తెచ్చుకున్నామని.. మిస్ డేవిస్ చెప్పారు. తాము ఒక పెద్ద కుక్కని పెంచుకోవాలని కోరిక ఉన్నప్పటికీ.. మరి ఇంత పెద్ద సునకం తన ఇంటి ముందు ఉండడాన్ని మొదట్లో భయం అనిపించినప్పటికీ.. తను తమ పప్పీ ని మొదటిసారి చూసినప్పుడే బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది డేవిస్. అయితే జ్యూస్ చిన్నతనం నుంచి కూడా.. తనకి నచ్చిన పని అసలు చేసేది కాదని.. నిజంగా చాలా మొండిగా ఉండేదని.. కానీ తమ కుటుంబ సభ్యులను ఎంతో ఆహ్లాదకరంగా మార్చేందుకు తను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేదని.. నిజంగా తనకి చాలా మంది స్నేహితులు ఏర్పడ్డారని.. తాను చూడటానికి గంభీరంగా ఉన్నప్పటికీ నలుగురితో.. చాలా మంచిగా నడుచుకునేదని చెప్పుకొచ్చింది జ్యూస్ ఓనర్ డేవిస్.

అయితే ఇంకో రెండు నెలలు పోతే జ్యూస్ కి నాలుగు సంవత్సరాలు వచ్చేవని డేవిస్ చెప్పింది. ఇంతలోనే జ్యూస్ తమ కళ్ళ ముందు నుంచి మాయం అయిపోవడం నిజంగా ఒక కలలా అనిపిస్తోందని.. తను ఎప్పటికీ తమ మనసులో పదిలంగా ఉంటుందని.. మరొకసారి గుర్తు చేసుకుంది డెవిస్