ప్రపంచంలోనే ఖరీదైన పురుగు.. !

పెంపుడు జంతువులు మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు. అందువల్ల, ప్రజలు తమ పెంపుడు జంతువులను చూసుకోవడానికి తమ సమయాన్ని మాత్రమే కాకుండా అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తారు. కానీ మీరు ఎప్పుడైనా కీటకాలను ఉంచడం మరియు పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించారా? ఓ పురుగు మిమ్మల్ని సంపన్నులను చెయ్యగలదంటే నమ్మగలరా… కానీ అది నిజం. ఎందుకంటే అది ప్రపంచంలోనే ఖరీదైన పురుగు. మరి దానికి ఎందుకు అంత రేటు ఉందో తెలుసుకుందాం.   పురుగుల్లో పాకేవి ఒక […]

Share:

పెంపుడు జంతువులు మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు. అందువల్ల, ప్రజలు తమ పెంపుడు జంతువులను చూసుకోవడానికి తమ సమయాన్ని మాత్రమే కాకుండా అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తారు. కానీ మీరు ఎప్పుడైనా కీటకాలను ఉంచడం మరియు పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించారా? ఓ పురుగు మిమ్మల్ని సంపన్నులను చెయ్యగలదంటే నమ్మగలరా… కానీ అది నిజం. ఎందుకంటే అది ప్రపంచంలోనే ఖరీదైన పురుగు. మరి దానికి ఎందుకు అంత రేటు ఉందో తెలుసుకుందాం.  

పురుగుల్లో పాకేవి ఒక రకమైతే… నడిచేవి మరో రకం. బొద్దింకలు, పేడ పురుగులు, బద్దె పురుగులు ఇవన్నీ ఒకలాంటివి. వీటిలో స్టాగ్ బీటిల్ ప్రత్యేకమైనది. ఈ పురుగు ధరతో ఓ లగ్జరీ కారు కొనుక్కోవచ్చు లేదా ఓ ఇల్లే వచ్చేస్తుంది. చాలా మంది ఇలాంటి పురుగుల్ని చూస్తేనే భయపడతారు. కొంత మంది ఇవి కనిపిస్తే పారిపోతారు. కానీ రాత్రికి రాత్రి లక్షాధికారులు అయిపోయే ఛాన్స్ ఓ పురుగు వల్ల వస్తుందని తెలిస్తే ఆ పురుగును ఎవరు వదిలేస్తారు? స్టాగ్ బీటిల్ 2 నుంచి 3 అంగుళాల పొడవు ఉంటుంది. దీన్ని భూమిపై చిన్నదైన, ఆశ్చర్యకరమైన, అరుదైన జీవిగా చెబుతారు. ఇవి మనకు ఎక్కడో గానీ కనిపించవు. స్టాగ్ బీటిల్స్ లో 1200 రకాల జాతులవి ఉన్నాయి. వీటి ఫ్యామిలీని Lucanidae అంటారు. వీటిని నాలుగు భాగాలుగా విభజించారు.

ఈ పురుగులకు ఇంత ధర ఎందుకు అంటే… ఇవి ఆశ్చర్యకరమైనవి కావడమే. వీటికి ముందు ఉండే 2 కొమ్ములను చూడటం ద్వారా వీటిని గుర్తించవచ్చు. వీటి కొమ్ములు నల్లటి తల నుంచి వచ్చి ఉంటాయి. వీటి సగటు సైజు 2 అంగుళాల నుంచి 4.8 అంగుళాలు ఉంటుంది. కొన్నాళ్ల కిందట జపాన్ లో ఈ పురుగుల్ని పెంచుతున్న ఒకాయన… ఓ స్టాగ్ బీటిల్‌ను $89,000 (సుమారుగా రూ.65 లక్షలు)కి అమ్మేశాడు. దీన్ని కొనేందుకు ప్రజలు కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. 

నేషనల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం మగ పెద్ద పురుగులు ఆహారాన్ని తినవు. అవి తియ్యటి ద్రవాలను తాగుతాయి. మొక్కల్లో నీరు, పాడైన పండ్లలో రసాలు తాగుతాయి. పాడైన కలపపై లార్వాను ఉంచి… సంతానాన్ని వృద్ధి చేస్తాయి. వీటికి ఉండే పదునైన కొమ్ములతో ఇవి మొక్కల బెరళ్లను తొలగించగలవు. పార్కులు, గార్డెన్లలో బతికే ఈ పురుగులు… పాడైపోయిన కలప ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి. కొంతమంది వీటిని పెంచుకుంటారు. కారణం అధిక ధరే. జపాన్ లో వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు.

ఈ పురుగు జాతిలో అతి పెద్దది 8.5 సెంటీమీటర్లు (3.34 అంగుళాలు) ఉండేది. ఈ పురుగుతో రకరకాల మందుల్ని తయారుచేస్తారు. బ్రిటన్ పురాణాల ప్రకారం… ఈ చెక్క పురుగులు… ఉరుములు, మెరుపుల్ని తెప్పిస్తాయి. అలాగే తమ కొమ్ములతో భవనాలకు నిప్పు పెట్టగలవు. వర్షం పడుతున్నప్పుడు ఈ పురుగును తలపై పెట్టుకుంటే… తలపై పిడుగు పడదనే కథ ప్రచారంలో ఉంది. అందుకు గ్యారెంటీ మాత్రం లేదు. అలా చెయ్యకపోవడమే మంచిది. ఈ పురుగులు పెద్దవి అయ్యాక వీటి జీవిత కాలం కొన్ని వారాలే ఉంటుంది. 

గోరు వెచ్చటి ప్రదేశాల్లో ఇవి ఉంటాయి. చలికాలం రాగానే ఇవి చచ్చిపోతాయి. చలి ప్రదేశాల్లో కూడా ఇవి బతకలేవు. సాధారణంగా ఇవి ఏడేళ్లు బతుకుతాయి. ఈ పురుగులు మనుషుల జోలికి రావు. కానీ వీటి జోలికి వెళ్తే… ముందున్న కొమ్ములు గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. వీటికి దూకుడు ఉండదు. ప్రశాంతంగా ఉంటాయి. వీటిని గ్రామాల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తే… పేదరికాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.