అమెరికాలో తీవ్రమైన తుఫాను ప్రభావం

ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో హఠాత్తుగా వచ్చిన వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రయత్నంలో ఉన్నాయి. అమెరికా కూడా ఇందులో భాగమైంది. సడన్గా వచ్చిన మార్పులు కారణంగా గట్టిగ వేస్తున్న ఈదురు గాలుల కారణంగా టోర్నడోస్ ఏర్పడే అవకాశం ఉందని అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. వాషింగ్టన్, DCలోని US ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా హెచ్చరిక కారణంగా ముందస్తు జాగ్రత్తగా మూసేయడం జరిగింది.  టోర్నడోలు వచ్చే అవకాశం: టోర్నడోలు, పెద్దగా వేస్తున్న ఈదురు గాలులు మరియు పెద్ద వడగళ్ళు […]

Share:

ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో హఠాత్తుగా వచ్చిన వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రయత్నంలో ఉన్నాయి. అమెరికా కూడా ఇందులో భాగమైంది. సడన్గా వచ్చిన మార్పులు కారణంగా గట్టిగ వేస్తున్న ఈదురు గాలుల కారణంగా టోర్నడోస్ ఏర్పడే అవకాశం ఉందని అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. వాషింగ్టన్, DCలోని US ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా హెచ్చరిక కారణంగా ముందస్తు జాగ్రత్తగా మూసేయడం జరిగింది. 

టోర్నడోలు వచ్చే అవకాశం:

టోర్నడోలు, పెద్దగా వేస్తున్న ఈదురు గాలులు మరియు పెద్ద వడగళ్ళు వర్షాల కారణంగా వాషింగ్టన్ D.C. ప్రాంతంలోని U.S. ప్రభుత్వ కార్యాలయాలు, ఆగస్ట్ 7 నుంచి ముందస్తు జాగ్రత్తగా మూసేయడం జరిగింది. అంతేకాకుండా వాతావరణం మార్పు కారణంగా, తూర్పు U.S. అంతటా ప్రజలు ఇంటి లోపల ఉండాలని హెచ్చరించినట్లు NDTV నివేదించింది.

ఫ్లైట్అవేర్, ఫ్లైట్ ట్రాకింగ్ సైట్, వాషింగ్టన్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 102 సహా 2,600 U.S. విమానలు రద్దు చేసినట్లు, NDTV నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, వాషింగ్టన్ డల్లెస్‌లో 35 విమానాలు అంతేకాకుండా ప్రస్తుతానికి 7,700 U.S. విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

విద్యుత్ అంతరాయాలు: 

హఠాత్తుగా ఏర్పడిన వాతావరణ మార్పు కారణంగా, ఉరుములు మరియు బలమైన ఈదురు గాలులకు, అనేక ప్రాంతాలలో చెట్లు నేలకూలాయి. అంతేకాకుండా దాదాపు 2,00,000 గృహాలు మరియు వ్యాపారాలకు విద్యుత్తు అంతరాయం కలిగించిందని నివేదిక పేర్కొంది. ప్రధానంగా సమీపంలోని మేరీల్యాండ్ మరియు వర్జీనియాలో మరీ ముఖ్యంగా ఎక్కువ విద్యుత్ అంతరాయాలు సంభవించాయని PowerOutage.us నివేదించింది. కొన్ని ప్రాంతాలు చిమ్మ చీకట్లోనే గడుపుతున్నాయి. NDTV నివేదిక ప్రకారం, దక్షిణ మరియు మధ్య-అట్లాంటిక్ రాష్ట్రాలు 8,00,000 మంది వినియోగదారుల పవర్ కట్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

వాతావరణం లో వచ్చిన మార్పులు కారణంగా అనేక చోట్ల బీకర వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నట్లు తెలుస్తోంది. వర్షాలతో తడిసిముద్దయినా, వడగళ్ల వాన కురిసినా, దేశ రాజధాని టోర్నడోల నుంచి అదృష్టవశాత్తు తప్పించుకుందని కూడా నివేదికలు పేర్కొన్నాయి. నేషనల్ వెదర్ సర్వీస్ యొక్క టోర్నడో వాచ్, అందించిన సమాచారం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో, తుఫాను తీరం దాటి మెల్లగా తగ్గిందని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించడం జరిగింది.

నివేదిక ప్రకారం, వాషింగ్టన్ లో తెల్లవారుజామున 4 గంటల వరకు వరద హెచ్చరికను ఇవ్వడం జరిగింది అయితే. అయితే, ఆగస్ట్ 7న అలబామా నుండి పశ్చిమ న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న 29.5 మిలియన్ల మంది ప్రజలు టోర్నడో వంటి ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అని ఆగస్టు 7 సోమవారం నాడు నేషనల్ వెదర్ సర్వీస్ సూచించింది. అయితే, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల వరకు ఎటువంటి టోర్నాడో అనేది సంభవించలేదని NDTV పేర్కొంది.

ఉరుములతో కూడిన వర్షం కారణంగా, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా మరియు బాల్టిమోర్‌లోని విమానాశ్రయాలలో బయలుదేరే విమానాలను నిలిపివేసినట్లు NDTV నివేదించింది. ప్రమాదాలను నివారించడానికి, FAA తుఫాను కారణంగా కొన్ని విమానాల టైమింగ్స్ కూడా చేయించడం జరిగింది. నివేదిక ప్రకారం, ఆగస్టు 7న లైబ్రరీలు, మ్యూజియంలు, నేషనల్ జూ మరియు . కొన్ని ఎన్విరాన్మెంటల్ పార్క్కులతో సహా వాషింగ్టన్ ప్రాంతంలోని జాగ్రత్త కింద కొన్ని సర్వీసెస్ ఆపేశారు.

మునిసిపల్ మరియు ఫెడరల్ సేవలు కూడా దెబ్బతిన్నాయని నివేదిక పేర్కొంది. NDTV యొక్క నివేదికల ప్రకారం, U.S. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ ఫెడరల్, ప్రమాద హెచ్చరికలు అందుకున్న అనంతరం, ఉద్యోగులను మధ్యాహ్నం 3 గంటల ఇళ్లకు పంపించేయాలని కోరింది.