ఫ్రాన్స్ లో కొనసాగుతున్న అల్లర్లు

ఫ్రాన్స్ లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత మంగళవారం మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏళ్ల టీనేజర్ నాహెల్ ను  ట్రాఫిక్ పోలీసులు కాల్చి చంపడంతో మొదలైన అల్లర్లు  ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి. కాగా దానికి సంబంధించిన  సమాచారాన్ని తెలుసుకుందాం….. ఫ్రాన్స్ లో అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు దాడులు విస్తరిస్తున్నాయి.  రాత్రి అయిందంటే చాలు వేలమంది ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి ఎదురు వచ్చిన వాహనానికల్లా నిప్పు పెడుతున్నారు. ఆందోళనకారులు ఆగ్రహానికి ఇప్పటికే 2500 మంది […]

Share:

ఫ్రాన్స్ లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత మంగళవారం మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏళ్ల టీనేజర్ నాహెల్ ను  ట్రాఫిక్ పోలీసులు కాల్చి చంపడంతో మొదలైన అల్లర్లు  ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి. కాగా దానికి సంబంధించిన  సమాచారాన్ని తెలుసుకుందాం…..

ఫ్రాన్స్ లో అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు దాడులు విస్తరిస్తున్నాయి.  రాత్రి అయిందంటే చాలు వేలమంది ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి ఎదురు వచ్చిన వాహనానికల్లా నిప్పు పెడుతున్నారు. ఆందోళనకారులు ఆగ్రహానికి ఇప్పటికే 2500 మంది వాహనాలు బూడిదయ్యాయి. వందల కొద్ది షాపులు, మాల్స్ ధ్వంసమయ్యాయి. వరుసగా ఐదో రోజు కూడా ఆందోళనతో ఫ్రెంచ్ దేశం దద్దరిల్లింది. ఈ క్రమంలో ఆందోళనకారులు ప్యారిస్ టౌన్ మేయర్ ఇంటి పై దాడి చేశారు.

ఆదివారం రాత్రి నగర మేయర్ విన్సెంట్ జీన్ బ్రన్ ఇంట్లోకి ఓ కారు దూసుకెళ్లింది. అంతటితో ఆగని నిరసన కారులు ఇంటికి నిప్పు పెట్టారు.దీంతో ఆయన భార్య మరియు కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు విన్సెంట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా రాత్రి తన ఇంట్లోకి కొందరు నిరసన కారులు  దూసుకొచ్చారని ఇంటికి నిప్పు పెట్టారని చెప్పారు. తమపై హత్య ప్రయత్నం కూడా చేశారని ఆయన ఆరోపించారు. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అల్లర్లలో… పోలీసులు ఇప్పటివరకు 4000 మంది నిరసనకారులను అరెస్టు చేశారు.అయినా నిరసనలు ఆగటం లేదు. నిరసనకారులంతా టీనేజర్లేనని పోలీసులు చెబుతున్నారు. శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.

ఫ్రాన్స్ లో తాజా అల్లర్లు గత ఏడాది అమెరికాలో జార్జ్ ఫ్లైట్ ను పోలీసులు చంపిన తర్వాత చెలరేగిన అల్లర్లను తలపిస్తున్నాయి.  పోలీసులు నడి రోడ్డుపై మెడ పై మోకాళ్లతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేయడంతో నల్లజాతీయుడైన జార్జ్ ప్లాయిడ్ ప్రాణాలు కోల్పోయాడు. ఊపిరాడటం లేదని అతడు ఎంత విలపించినా కూడా  పోలీసులు కనికరం చూపలేదు. ఇప్పుడు ఫ్రాన్స్ లో చనిపోయిన నాహెల్ కూడా ఆఫ్రికా నుంచి వలస వచ్చి అరబ్ మూలాలున్న నల్లజాతీయుడే..

అతడు ముస్లిం మతానికి చెందిన వాడు.  కాగా దీంతో ఫాన్స్ లోని నల్లజాతీయులంతా తీవ్ర ఆగ్రహంతో నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలు దశాబ్దాలుగా పాతుకుపోయిన జాతి వివక్షపై తిరుగుబాటు అని ప్రచారం అవుతున్నది. సోషల్ మీడియాలో కూడా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ హోరు కొనసాగుతున్నది. నా హెల్ తల్లి కూడా తన కుమారుడు నల్లజాతీయుడే కాబట్టి కావాలని వారి కక్షతో ఈ పని చేశారని.. పోలీసులు కాల్చి చెప్పారని ఆరోపించారు.

 ఫ్యాన్స్.. గత ఐదు రోజులుగా ఆందోళనకారులు పాల్పడుతున్న హింసకు మౌనసాక్షిగా నిలుస్తుంది. నాహెల్ అనే 17 ఏళ్ల ఇవ్వకుడిని ఓ పోలీసులు కాల్చి చంపడం వల్ల మొదలైన నిరసన జ్వాలలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల సాయంతో యువకులు నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నారు.హింసకాండ కు అడ్జం పోయడంలో ఇవి కీలకపాత్ర పోషించాయని ఫ్యాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రిన్ ఆరోపించారు. పోలీసులు భద్రత కారణంగా నిరసనలు తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది.మరోవైపు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నాహెల్  అంత్యక్రియలు శనివారం ముగిసాయి. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని నివాళులు అర్పించారు. తన బిడ్డను పోలీసు అధికారులు అన్యాయంగా చంపారని నాహెల్ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు.