Israel: హమాస్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్

Israel: యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హ‌మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. హఠాత్తుగా జరిగిన హమాస్ (Hamas) ఎటాక్ […]

Share:

Israel: యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హ‌మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. హఠాత్తుగా జరిగిన హమాస్ (Hamas) ఎటాక్ (Attack) కారణంగా ఎన్నో జీవితాలు కుప్పకూలాయి. ఇప్పుడు ఇరువైపుల నుంచి యుద్ధం (War) కొన్ని వేల జీవితాలను బలిగొంది. 

హమాస్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్: 

హమాస్ ఆయుధాల స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ (Israel) సైన్యం..అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదుల వద్ద దొరికిన కొన్ని ఆయుధాలు (weapons) చూపించడం జరిగింది. ముఖ్యంగా అందులో 1,493 హ్యాండ్ గ్రెనేడ్‌లు, పేలుడు పదార్థాలు, 760 RPGలు, 427 పేలుడు బెల్టులు, 375 తుపాకీలు, 106 రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి. 1,400 మంది ఇజ్రాయెల్ (Israel) పౌరులను ఊచకోత కోసేందుకు ఉపయోగించిన ఆయుధాలలో ఇవి కొన్ని మాత్రమే. అమాయకులను చంపడానికి ఉపయోగించే ఆయుధాలు (weapons).. అని ఇజ్రాయిల్ పేర్కొంది.

Read More: Tattoo: నుదుటిపై ప్రియుడి పేరు.. నెట్టింట వీడియో వైరల్..!

అంతకుముందు, ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ (Israel) తన యుద్ధంలో గొప్ప పురోగతి సాధిస్తోందని, సైన్యం వేలాది మంది హమాస్ యోధులను చంపిందని అన్నారు. హమాస్‌తో యుద్ధం తర్వాత గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) నిరవధిక కాలానికి మొత్తం భద్రతా బాధ్యత కలిగి ఉంటుందని నెతన్యాహు చెప్పారు. దాదాపు 2.3 మిలియన్ల పాలస్తీనియన్లకు నివాసంగా ఉన్న భూభాగంను స్వాధీనం చేసుకోవడంలో ఇజ్రాయెల్ (Israel) యోచిస్తోందని టీవీ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టమైన ప్రణాళిక గురించి చెబుతున్నట్టు.. అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. 

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది: 

గత నెలలో ఇజ్రాయిల్‌ (Israel)లోని ఒక మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన ప్రదేశం, హమాస్ (Hamas) చేసిన మొదటి దాడులలో ఒకటి. ఇక్కడ 250 మందికి పైగా మరణించారు. అప్పుడు, మ్యూజిక్ ఫెస్టివల్ హాజరైన ఒక ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model), హమాస్ (Hamas) ఎటాక్ (Attack) నుంచి తప్పించుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్ తో సహా, మృతదేహాల కుప్ప కింద గంటల తరబడి ఎలా దాక్కోవలసి వచ్చిందో వివరించింది. 

తన బాయ్ ఫ్రెండ్ డేవిడ్ నేమాన్‌ను కాల్చి చంపిన తర్వాత రెండు గంటల పాటు మృతదేహాల కుప్ప కిందనే దాక్కోవాల్సి వచ్చిందని, కాలు అదేవిధంగా భుజంపై గాయాలు పాలైన ఇరవై ఏడు సంవత్సరాల మోడల్ (Model) నోమ్ మజల్ బెన్-డేవిడ్ చెప్పింది. చాలా రక్తాన్ని కోల్పోయినప్పటికీ, హమాస్ (Hamas) ఎటాక్ (Attack) జరిగిన సమయంలో మోడల్ (Model) సజీవంగా తప్పించుకోగలిగిందని చెప్పుకొచ్చింది. అక్టోబర్ 7 ఉదయం 6.30 గంటలకు సూపర్‌నోవా ఉత్సవానికి చేరుకున్నప్పుడు పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయని.. ఆ తర్వాత అంతా అంధకారంగా మారింది అంటూ చెప్పుకొచ్చింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). 

నిజానికి తాము తప్పించుకోవడానికి కారులో ప్రయాణమవుతున్న సందర్భంలో, చాలామంది సెక్యూరిటీ గార్డులు తమని తమ ప్రాణాల కోసం రక్షించుకోమంటూ తమకి చెప్పారని, అంతేకాకుండా ఎవరిని బడితే వాళ్ళని విచక్షణ రహితంగా తుపాకీలతో కాల్చి చంపుతున్నారని, సెక్యూరిటీ గార్డులు హెచ్చరించినట్లు చెప్పుకొచ్చింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). అయితే ఎటాక్ (Attack) జరుగుతున్న సందర్భంలో తాము నిజానికి ఒక పెద్ద డస్ట్ బిన్ వెనక దాకున్నామని, తనతో పాటు 14 మంది మూడు గంటలు దాకున్నప్పటికీ, చాలామంది వాళ్లని కనిపెట్టి తన బాయ్ ఫ్రెండ్ ను కాల్చి చంపారని బాధాకరమైన విషాద కథను వెల్లడించింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). ఆ సమయంలోనే చాలామంది తమని కాపాడమంటూ తమని బందీలుగా చేయొద్దు అంటూ ఆర్తనాదాలు చేసినట్లు ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model) వెల్లడించింది. ఈ ఘోరమైన సంఘటన నుంచి బయటపడేందుకు చాలామందికి ఫోన్లు చేస్తూ, భయానక సందర్భం మరొకసారి గుర్తు చేసుకుంది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model).