కరోనా వైరస్ కంటే పది రెట్లు వేగంగా వ్యాపించే కొత్త వైరస్ మరో పదేళ్లలో వస్తుందన్న ఎయిర్‌ఫినిటీ

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలపై విజృంభించి గడగడలాడించింది. కొవిడ్ వ్యాధి ప్రారంభమై మూడేళ్లు గడిచిన ఇప్పటికి ఈ మహమ్మారి తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఈ మహమ్మారి దెబ్బతో ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేకపోతోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ కరోనా మహమ్మారి ఇప్పటికీ విజృంభిస్తూనే ఉంది. కొంతకాలంగా […]

Share:

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలపై విజృంభించి గడగడలాడించింది. కొవిడ్ వ్యాధి ప్రారంభమై మూడేళ్లు గడిచిన ఇప్పటికి ఈ మహమ్మారి తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఈ మహమ్మారి దెబ్బతో ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేకపోతోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ కరోనా మహమ్మారి ఇప్పటికీ విజృంభిస్తూనే ఉంది. కొంతకాలంగా తగ్గిన కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి, మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.  ఇదిలా ఉంటే కొవిడ్ లాంటి మరో మహమ్మరి 10 ఏళ్లలో ప్రపంచాన్ని తాకే అవకాశం ఉందని లండన్‌కి చెందిన ఆరోగ్య విశ్లేషణ సంస్థ ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ అంచనా వేసింది. 

తాజాగా ఎయిర్‌ఫినిటీ అనే ఆరోగ్య విశ్లేషణ సంస్థ రానున్న పదేళ్లలో కరోనా తరహాలో మరో ప్రమాదకరమైన మహమ్మారి మానవాళిని కబళించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇది కొవిడ్ – 19 వైరస్ కంటే ఎక్కువగా 27.5% మేర ప్రమాదకరంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ వ్యాధి వేగంగా వ్యాపించి మనిషి ప్రాణాలను అంతే వేగంగా తీసుకుపోతుందని తెలిపింది. అయితే సరైన సమయంలో వ్యాక్సిన్‌ను కనుగొంటే ఈ మహమ్మారి నుంచి కొంతలో కొంత ముప్పు తగ్గే అవకాశం ఉందని నివేదికలో తెలిపింది. కాగా కొత్త మహమ్మారి వ్యాపించేందుకు కారణాలు ఏంటి అనే అంశంపై పరిశోధన చేసిన ఈ సంస్థ వాతావరణంలోని మార్పులు పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణాలు, పెరుగుతున్న జనాభా జంతువుల నుంచి వ్యాపిస్తున్న వ్యాధులే ఈ కొత్త మహమ్మారి పుట్టుకకు కారణం అవుతాయని స్పష్టం చేసింది.  అయితే కొత్త వైరస్‌ను గుర్తించిన 100 రోజులలోగా వ్యాక్సిన్‌ను కనుగొంటేనే ఈ మహమ్మారి ప్రమాద శాతం 8.1% ఉంటుందని అంచనా వేసింది.

ఎయిర్‌ఫినిటీ సంస్థ కొత్త వైరస్ ప్రమాదం ఎలా ఉంటుందో ఉదాహరణలతో వివరించింది.  యూకే లాంటి దేశంలో బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్తే ఒకే రోజులో 15 వేల మంది చనిపోయే అవకాశం ఉందని తెలిపింది. కొత్త వైరస్ కూడా అంతకంటే ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నట్టు నివేదికలో తెలిపింది. ప్రస్తుతం H5N1 ఏ విధంగా కలవరపెడుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. కొంతమంది దీని బారిన పడ్డారు. అయితే ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్తుందన్న సంకేతాలు కనిపించకపోవడం కాస్త ఊరటని కలిగించే అంశం. జీకా లాంటి వైరస్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. అదే సమయంలో చికిత్స కూడా లేదు. ఇక ప్రస్తుతం మరో వైరస్ పంజా విసిరేందుకు సిద్ధంగా ఉందంటూ పలు పరిశోధనా సంస్థలు ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాయి. అన్ని దేశాలు ఆ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రపంచానికి ముప్పు వాటిల్లితే ఎలా ఎదుర్కోవాలనే దానికి సిద్ధంగా ఉందని తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా కొవిడ్ 19 లకు కరోనా వైరస్లు కారణమయ్యాయి. 2009లో స్వైన్ ఫ్లూ కూడా కనిపించింది. బర్డ్ ఫ్లూ కూడా వేగంగా వ్యాప్తి చెందడం ఇప్పటికే ఆందోళన కలిగిస్తుంది. ఇది ఇప్పటివరకు తక్కువ మందికి వ్యాపించింది.  అయితే నిఘా విధానాలు కొత్త మహమ్మారిని సకాలంలో గుర్తించే అవకాశం లేదని ఎయిర్‌ఫినిటీ సంస్థ తెలిపింది.