చైనాలో టెంప‌రరీ పార్ట్‌న‌ర్స్ ట్రెండ్

కాలం మారింది, కేవలం స్నేహబంధం కోసమే సన్నిహిత్యం కోసమే పార్ట్నర్ కావాలని ఎంతో మంది యువత చైనాలో ఒక కొత్త ట్రెండిని సృష్టిస్తున్నారు. హద్దులు దాటని ప్రేమ, తోడు కోసం, స్నేహం సన్నిహిత్యం కోసం మాత్రమే తమకు పార్ట్నర్లు కావాలంటున్నారు చైనా యువత. కొత్త సాంప్రదాయం:  హద్దులు దాటని ప్రేమ, తోడు కోసం, స్నేహం సన్నిహిత్యం కోసం మాత్రమే తమకు పార్ట్నర్లు కావాలంటున్నారు చైనా యువత. చైనీస్‌లో ‘డా జి’ అని పిలుస్తారు, ఏదైనా సాధ్యమే అనే […]

Share:

కాలం మారింది, కేవలం స్నేహబంధం కోసమే సన్నిహిత్యం కోసమే పార్ట్నర్ కావాలని ఎంతో మంది యువత చైనాలో ఒక కొత్త ట్రెండిని సృష్టిస్తున్నారు. హద్దులు దాటని ప్రేమ, తోడు కోసం, స్నేహం సన్నిహిత్యం కోసం మాత్రమే తమకు పార్ట్నర్లు కావాలంటున్నారు చైనా యువత.

కొత్త సాంప్రదాయం: 

హద్దులు దాటని ప్రేమ, తోడు కోసం, స్నేహం సన్నిహిత్యం కోసం మాత్రమే తమకు పార్ట్నర్లు కావాలంటున్నారు చైనా యువత. చైనీస్‌లో ‘డా జి’ అని పిలుస్తారు, ఏదైనా సాధ్యమే అనే ఆలోచనను చెప్తుంది ఈ చైనీస్ పదం. అయితే ఇందులో భాగంగా, యువత తమకి నచ్చిన వారిని, లింగ భేదం లేకుండా తమ పార్ట్నర్లను ఎంపిక చేసుకోవచ్చు.

Xiaohongshu వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చైనాలోని యువకులు ఈ ” టెంపరరీ పార్ట్నర్స్”ని   వెతుకుతున్నారని, యువత ఆసక్తి చూపిస్తున్నారని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ విషయంలో, ఆహారం, గేమింగ్, ఫిట్‌నెస్, ప్రయాణం, వ్యవసాయం, చాటింగ్ మరియు సంగీతం వినడం వంటి అనేక వర్గాలలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్న వారి కోసం తమకు సరిపోయే పార్టనర్స్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. అయితే లింగ బేధం లేకుండా తమకి నచ్చిన పార్ట్నర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, చైనాలో అందుబాటులో ఉన్న WeChat ద్వారా ప్రతిరోజు మాట్లాడుకోవచ్చు అని, అయితే ఇందులో వీడియో చాటింగ్ వంటివి ఎక్కువగా ఉండకపోవచ్చు అని కూడా తెలుస్తోంది.

చైనీస్ యువకుల భావోద్వేగ అవసరాలను తీర్చడానికి ఇటువంటి ఒక కొత్త సాంప్రదాయం, ఒక ట్రెండు కొత్తగా ఉద్భవించిందని నివేదిక పేర్కొంది. ఈ ఏర్పాటు వారి ఇండిపెండెంట్ స్పేస్ మరియు స్వతంత్రతను కాపాడుకుంటూ వారి ఒంటరితనాన్ని తొలగించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ధోరణి అనేక మంది వ్యక్తులు అర్ధవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. 

మరోవైపు చైనాలో తగ్గుతున్న జనాభా: 

చైనాలో జనాభా తగ్గుతున్న క్రమంలో, Trip.com యొక్క ప్రకటన ద్వారా జనాభా పెంచేందుకు కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది. చైనా 2022లో జనాభా తగ్గడాన్నీ గమనించింది, ఇది ఆరు దశాబ్దాలలో చైనాలో జనాభా తగ్గడం ఇదే మొదటిసారి. ఫలితంగా, చైనా, జనాభా సంఖ్యలో భారతదేశం కంటే తక్కువగా ఉంది, అంతేకాకుండా మరి ఇప్పుడు ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. 

2015లో, బీజింగ్ పెట్టిన షరతు “ఒక బిడ్డ” అనే విధానాన్ని ముగించింది, మొదట్లో వివాహిత జంటలు ఇద్దరు పిల్లలను పనేందుకు చైనా అనుమతించారు. అయితే, 2016లో తాత్కాలికంగా పెరిగినప్పటికీ, చైనాలో జాతీయ జననాల రేటు తగ్గుతూనే ఉంది.ఇదే కొనసాగితే చైనాలో జనాభా అధిక మొత్తంలో తగ్గుతుందని భయం మొదలైంది. ఇది ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న జనాభా సవాలును మరింత తీవ్రతరం చేస్తుంది, ఇది ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తుంది, పన్ను రాబడిని తగ్గిస్తుంది మరియు ఇప్పటికే భారంగా ఉన్న పెన్షన్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. 

అందుకోసమే చైనాలో ఉన్న చిన్న చిన్న కంపెనీలు జనాభా పెంచేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ వంతు ఆఫర్లను తమ ఉద్యోగాలకు అందిస్తున్నారు. ఇదే క్రమంలో, ఇప్పుడు చైనాలో ఉన్న ప్రముఖ గ్లోబల్ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన Trip.com, కుటుంబ సభ్యులను పెంచేందుకు, పిల్లల్ని కనడానికి మొహమాట పడకూడదని, ఈ ఏజెన్సీ తమ కంపెనీలో పని చేస్తున్న 32,000 మంది ఉద్యోగులతో కూడిన వర్క్‌ఫోర్స్‌ను ప్రేరేపించడానికి 1 బిలియన్ యువాన్ ($138 మిలియన్) విలువైన చైల్డ్‌కేర్ సబ్సిడీ ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది.