అమెరికాలో పోలీస్ కారు ఢీకొని తెలుగు విద్యార్థి మృతి

‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అన్నాడో సినీ కవి. ఒక కాకి చనిపోతే వంద కాకులు వచ్చి అరుస్తాయి. కానీ ఒక మనిషి చనిపోతే.. తోటి మనుషులు కనీసం మానవత్వంతో వ్యవహరించడం లేదు. పోలీసు నిర్లక్ష్యంతో ఓ తెలుగు యువతి చనిపోతే.. ఓ అధికారి వెకిలి వ్యాఖ్యలు చేశాడు. ‘ఆమె లైఫ్‌కు అంత విలువ లేదు’ అంటూ రాక్షసుడిలా నవ్వాడు. ఉన్నత చదువుల కోసం ఎంతో మంది విదేశాలకు వెళ్తుంటారు. ఎన్నో కలలతో ఆ అమ్మాయి కూడా వెళ్లింది. కానీ […]

Share:

‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అన్నాడో సినీ కవి. ఒక కాకి చనిపోతే వంద కాకులు వచ్చి అరుస్తాయి. కానీ ఒక మనిషి చనిపోతే.. తోటి మనుషులు కనీసం మానవత్వంతో వ్యవహరించడం లేదు. పోలీసు నిర్లక్ష్యంతో ఓ తెలుగు యువతి చనిపోతే.. ఓ అధికారి వెకిలి వ్యాఖ్యలు చేశాడు. ‘ఆమె లైఫ్‌కు అంత విలువ లేదు’ అంటూ రాక్షసుడిలా నవ్వాడు.

ఉన్నత చదువుల కోసం ఎంతో మంది విదేశాలకు వెళ్తుంటారు. ఎన్నో కలలతో ఆ అమ్మాయి కూడా వెళ్లింది. కానీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పోలీసు అధికారి నిర్లక్ష్యానికి ఆ అమ్మాయి బలి అయింది. అకారణంగా చనిపోయిన యువతి విషయంలో కనీసం ఇంగితం మరిచిన ఓ పోలీసు అధికారి వెకిలి మాటలు మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు పోలీసు అధికారి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారతీయుల ప్రాణాలకు విలువ లేదా అంటూ ఇండియన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకరు చనిపోయి ఉంటే.. నవ్వుతూ మాట్లాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. 

పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో..

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ జిల్లాకు చెందిన కందుల జాఘ్నవి అనే యువతి.. గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకు వెళ్లింది. నార్త్‌ఈస్ట్ యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా.. ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ‘సియాటెల్ టైమ్స్’ కథనం ప్రకారం.. ప్రమాద సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు రికార్డయింది. కారు ఢీకొట్టిన తర్వాత 100 అడుగులకు పైగా దూరం ఆమెను లాక్కెళ్లింది. కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్లే జాహ్నవి ప్రాణాలు కోల్పోయిందని తర్వాత విచారణలో వెల్లడైంది. ఈ ప్రమాదం గురించి ఓ అధికారి మాట్లాడిన చులకనగా మాట్లాడిన మాటలు బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. 

11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందంట

జాహ్నవికి జరిగిన ప్రమాదంపై సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్‌‌కు సమాచారం అందింది. ఈ విషయాన్ని గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు తెలియజేస్తూ నవ్వాడు. ఆమె జీవితానికి వెలకట్టాడు. ఆమె ప్రాణానికి ‘లిమిటెడ్ వ్యాల్యూ’ ఉందని, ఓ చెక్‌ రాసిస్తే సరిపోతుందని అన్నాడు. జాహ్నవి వయసు 23 ఏళ్లు కాబట్టి.. 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెకిలిగా మాట్లాడాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి, ప్రమాదానికి కారణమైన పోలీసు గురించి మాట్లాడకుండా.. చిల్లర మాటలు మాట్లాడాడు. ‘‘ఆమె 40 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిందని నేను అనుకోను. కానీ ఆమె  చనిపోయింది” అంటూ నవ్వాడు. తర్వాత.. ‘‘కాదు.. ఆమె సాధారణ వ్యక్తే. ఓ చెక్కు (పరిహారం) ఇస్తే సరిపోతుంది” అని చెప్పాడు. ‘‘11 వేల డాలర్లు అంతే. ఆమె వయసు 26 ఏళ్లు అనుకుంటా. ఆమె పరిమిత విలువను కలిగి ఉంది” అని చెప్పాడు. అయితే డేనియల్ ఆర్డరర్ మాటలకు సోలన్ ఏమని బదులిచ్చాడనేది తెలియరాలేదు. బాడీ కెమెరాలో కేవలం ఆర్డరర్ మాట్లాడుతున్న మాటలే వినిపించాయి. 

బాడీ కెమెరాలో రికార్డయిన వాయిస్

బాడీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియోను అధికారులు విడుదల చేశారు. ఘటనకు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ‘‘సియాటెల్ ప్రజలకు మరింత భద్రత కల్పించడం మా డ్యూటీ. ఈ ఘటనపై మేం కచ్చితంగా విచారణ చేపడతామని తెలియజేసేందుకే ఈ వీడియోను విడుదల చేశాం” అని అధికారులు తెలిపారు. పోలీసులు ఏం మాట్లాడుకుంటున్నారో వినే ప్రక్రియలో భాగంగా ఈ ఉద్యోగి సంభాషణను రికార్డింగ్‌ను తాము విన్నామని, ఇలాంటి వ్యాఖ్యలను గుర్తించామని సియాటెల్ పోలీసు విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. వెకిలి వ్యాఖ్యలపై అడెరర్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని కూడా చెప్పింది. వచ్చే డిసెంబర్‌‌లో తన డిగ్రీ పట్టాను జాహ్నవి అందుకోవాల్సింది. కానీ ఓ పోలీసు నిర్లక్ష్యానికి బలి అయిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనపై కింగ్ కౌంటీ అటార్నీ కార్యాలయం దర్యాప్తు జరుపుతోంది.