ఫ్లోరిడాలో చనిపోయిన తెలంగాణ వ్యక్తి

అయితే ఫ్లోరిడాలో పని చేస్తున్న తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరణించిన అనంతరం అతని బౌద్ధిక కాయాన్ని తిరిగి భారత్కు తీసుకురావాలి అని స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ జై శంకర్ కు లేఖ రాశారు.  అసలు విషయం ఏమిటి:  తెలంగాణకు చెందిన రాజేష్ కుమార్ అనే వ్యక్తి ఫ్లోరిడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. అయితే తన కుమారుడితో కలిసి బీచ్ కి తీసుకు వెళ్లిన అనంతరం తన కొడుకు జాక్సన్ […]

Share:

అయితే ఫ్లోరిడాలో పని చేస్తున్న తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరణించిన అనంతరం అతని బౌద్ధిక కాయాన్ని తిరిగి భారత్కు తీసుకురావాలి అని స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ జై శంకర్ కు లేఖ రాశారు. 

అసలు విషయం ఏమిటి: 

తెలంగాణకు చెందిన రాజేష్ కుమార్ అనే వ్యక్తి ఫ్లోరిడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. అయితే తన కుమారుడితో కలిసి బీచ్ కి తీసుకు వెళ్లిన అనంతరం తన కొడుకు జాక్సన్ విల్లా బీచ్ లో కొట్టుకుపోతుండగా తనిని కాపాడబోయి, రాజేష్ కుమార్ మరణించడం జరిగింది. 

వివరాల్లోకి వెళితే, పొట్టి రాజేష్ కుమార్ 42 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి ఫ్లోరిడాలో జాక్సన్ విల్లా బీచ్ లో జరిగిన ప్రమాదంలో మరణించడం జరిగింది. 

అయితే ఇప్పుడు ఆయన చనిపోయిన అనంతరం తమ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్లోని అద్దంకి బాపట్ల డిస్ట్రిక్ట్ లో, చనిపోయిన రాజేష్ కుమార్ కు చివరిగా చేయవలసిన సంస్కరణల గురించి రాజేష్ కుమార్ భౌతికగా ఖాయం రాక కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది:

అయితే రాజేష్ ఫ్లోరిడాలో బ్రిడ్జ్ వాటర్ దగ్గర తమ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంటాడు. ఆయనకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సరదాగా ఫ్లోరిడా జాక్సన్ విల్లా బీచ్ లో గడపడానికి వెళ్లిన ఆయనకి ప్రాణాలు మీదకి తెచ్చి పెట్టింది. ఎంతో ఆనందంగా బీచ్ లోకి గడుపుతుండగా 12 ఏళ్ల తన పెద్ద కొడుకు బీచ్ లో కొట్టుకుపోవడం గమనించి తనని కాపాడే ప్రయత్నం చేశాడు రాజేష్. అయితే ఇదే ప్రయత్నంలో తన కొడుకుని కాపాడిన రాజేష్ ప్రాణాలతో తిరిగి రాలేదు.

ప్రస్తుతం తన పెద్ద కొడుకు హాస్పిటల్లో రికవరీ అవుతున్నాడు. కానీ రాజేష్ మరణం భారతదేశంలో ఉంటున్న తన కుటుంబానికి తీరని లోటుగా మిగిల్చింది. ఎంతో ఉన్నత చదువులు చదివే ఫ్లోరిడాకి వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం సంపాదించుకున్న తన కొడుకుని పోగొట్టుకున్నందుకు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కానీ ఇప్పటివరకు తమ కుటుంబ సభ్యులకి రాజేష్ భౌతిక కాయం అందకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతూ సహాయం కోరుకున్నారు.

అయితే ఫ్లోరిడాలో పని చేస్తున్న తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరణించిన అనంతరం అతని బౌద్ధిక కాయాన్ని తిరిగి భారత్కు తీసుకురావాలి అని స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ జై శంకర్ కు లేఖ రాశారు. 

భౌతిక కాయాన్ని అద్దంకి తీసుకువచ్చే క్రమంలో నార్త్ అమెరికాకు చెందిన తానా అసోసియేషన్ కూడా తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. 

బీచ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి: 

ప్రపంచంలో అనేక చోట్లు జరుగుతున్న ప్రమాదాల్లో సముద్రంలో అలలకు కొట్టుకుపోవడం కూడా ఒకటి. ఎంతోమంది సముద్ర గర్భంలో కలిసిపోతున్నారు. దీనికి సంబంధించిన ఎన్నో వార్తలు చూసే ఉంటాం. కానీ ముఖ్యంగా సముద్ర తీరంలో ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించాలి. చిన్నారులు తప్పకుండా తమ పెద్దవారితోనే ఉండేలా చూసుకోవాలి. తీర ప్రాంతాలకు తీసుకు వచ్చినప్పుడు అలలు ఎక్కువగా కనిపిస్తే పిల్లల్ని ఆడుకోనివ్వకూడదు. అలలు తక్కువగా ఉన్నప్పుడే పిల్లలని సముద్రంలో ఆడుకునే ఏర్పాటు చేయాలి. లేదంటే పిల్లలతో పాటు పెట్టలికి కూడా ముప్పు పొంచి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. 

పెద్దవారు కూడా ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా పిల్లలతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు. చిన్న చిన్న జాగ్రత్తలే పెద్దపెద్ద ప్రమాదాలు అవ్వకుండా ఆపగలుగుతాయి. పిల్లలకు అన్నీ తెలుసు వారు అన్ని చూసుకుంటారు అనే భ్రమలో కూడా చాలా మంది ఉంటూ ఉంటారు.

లేదంటే కుటుంబానికి తీరని లోటుగానే ఉండిపోతుంది. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. దీనికి ఎవరు బాధ్యులం?