మోదీ, జో బిడెన్ మధ్య బలపడుతున్న దోస్తీ..

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరియు ప్రథమ మహిళ జిల్ బిడెన్ బుధవారం వైట్ హౌస్‌లో స్వాగతం పలికారు. వర్జినియాలోని అలెగ్జాండ్రియా లో జరిగినటువంటి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మోదీ వాషింగ్టన్ లోని వైట్ హౌస్ కి చేరుకున్నారు. స్టూడియో ధూమ్ నుండి నృత్యకారుల సంగీత ప్రదర్శనను ఆ ముగ్గురు అక్కడ ఆస్వాదించినట్లు వైట్ హౌస్ సమాచారం. మోదీ మరియు బిడెన్ల మధ్య జరుగుతున్న […]

Share:

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరియు ప్రథమ మహిళ జిల్ బిడెన్ బుధవారం వైట్ హౌస్‌లో స్వాగతం పలికారు. వర్జినియాలోని అలెగ్జాండ్రియా లో జరిగినటువంటి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మోదీ వాషింగ్టన్ లోని వైట్ హౌస్ కి చేరుకున్నారు. స్టూడియో ధూమ్ నుండి నృత్యకారుల సంగీత ప్రదర్శనను ఆ ముగ్గురు అక్కడ ఆస్వాదించినట్లు వైట్ హౌస్ సమాచారం. మోదీ మరియు బిడెన్ల మధ్య జరుగుతున్న ఈ సమావేశం ఇరుపక్షాల మధ్య అధికారికమైన ద్వైపాక్షిక చర్చలకు వేదిక కానుంది.

బిడెన్స్ మోదీకి ఇచ్చిన బహుమతులు 

వైట్ హౌస్ సమాచారం ప్రకారం ఈరోజు మోదీకి బిడెన్ విందుకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ విందుకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివన్ మరియు అతని భారత కౌంటర్ అజిత్ దోవల్ కూడా హాజరు కానున్నారు. ఈ విందు సందర్భంగా బిడెన్స్ జంట 20వ శతాబ్దం నాటి హ్యాండ్ మేడ్ యాంటీ అమెరికన్ బుక్ గాలీ ను బహుకరిస్తున్నారు అని సమాచారం. దీనితో పాటుగా ప్రధాని కోసం మరికొన్ని ప్రత్యేకమైన బహుమతులను కూడా అందించనున్నారు.

బిడెన్ ఎంతో విలువైన వింటేజ్ అమెరికన్ కెమెరా, జార్జ్ ఈస్ట్ మన్ ఫస్ట్ కూడా కెమెరా యొక్క పేటెంట్ కు సంబంధించిన అర్చివల్ ఫాక్సిమైల్ ను మరియు అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన హార్ట్ కవర్ బుక్ ను బహుకరిస్తున్నారు.జిల్ బిడెన్ మోదీ కు కలెక్టెడ్ పోయెమ్స్ ఆఫ్ రాబర్ట్ ఫాస్ట్ యొక్క సైన్డ్ ఫస్ట్ ఎడిషన్ కాపీ ను బహుకరించనున్నారు.

బిడెన్ కు మోదీ కానుకలు…

ఈ సందర్భంగా మోదీ కూడా బిడెన్‌ దంపతులకు అరుదైన కానుకలను బహుకరించారు. చేతితో తయారు చేసినటువంటి ఒక చందనం పెట్టను మరియు  ‘ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషడ్స్ పుస్తకం మొదటి ప్రింట్ కాపీని జో బిడెన్‌కు బహుకరించారు. అలాగే జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని మోదీ అందజేశారు. మోదీ పర్యటన కారణంగా జో బిడెన్‌ కు అతనికి మధ్య సత్సంబంధాలు బలపడుతున్నట్లు కనిపిస్తున్నాయి.

వాషింగ్టన్ డిసి లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ కి చేరుకున్న ప్రధానికి అక్కడ అధికారులతో పాటు చల్లటి చిరు జల్లులతో ప్రకృతి కూడా ఎంతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.”వాషింగ్టన్ డీసీ కి చేరుకున్నాను. భారతదేశం యొక్క వెచ్చదనం మరియు ఇంద్రదేవత యొక్క ఆశీర్వాదం వర్షం రూపంలో నా రాకను మరింత ప్రత్యేకంగా చేసింది..”అని మోదీ వెంటనే తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ కూడా పెట్టారు.

దీనికి ముందుగా భారతదేశం యొక్క భాగస్వామ్య ప్రాధాన్యతను తెలియపరచడం కోసం వర్జీనియాలోని అలెగ్జాండ్రియా లో జరిగిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కు జిల్ బిడెన్‌తో కలిసి మోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇరుదేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలలోని కీలకమైన పరిశ్రమలలో విజయం సాధించడం కోసం పలు రకాల నైపుణ్యాలను నేర్చుకుంటున్నటువంటి అమెరికన్ మరియు భారత్ విద్యార్థులు సమావేశమయ్యారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా గురువారం జరిగిన ఫాన్సీ వైట్ హౌస్ స్టేట్ డిన్నర్ కు 400 మందికి పైగా అతిధులు హాజరయ్యారు. అయితే వీరందరి కోసం మిల్లెట్ మరియు మష్రూమ్స్ తో తయారు చేసినటువంటి వంటకాలను మెనూలో ఉంచారు. నరేంద్ర మోదీ పూర్తిగా శాకాహారి.. అందుకే అతని రుచికి తగిన విధంగా మెనూ ఉండేలా జిల్ బిడెన్‌ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.