Royal baby: కుమార్తెకు 157 అక్షరాలతో పేరు పెట్టిన పేరెంట్స్

తన కుమార్తె(Daughter)కు ఎంతో ఇష్టపడి ఏకంగా 157 అక్షరాలతో పెద్ద పేరు పెట్టారో ఓ రాకుమారుడు. అమ్మ, అమ్మమ్మ, తండ్రి, మేనమామ..ఇలా రక్త సంబంధీకులను గుర్తు చేసుకుంటూ స్పెయిన్‌(Spain)లోని ఓ రాకుమారుడు తన బిడ్డకు నామకరణం చేశాడు. ఆ తమ మత విశ్వాసాల్ని తెలిపే పదాల్ని కూడా చేర్చాడు. దీంతో ఆ రాయల్‌ బేబీ(Royal baby) పేరు 25 పదాలు, 157 అక్షరాలతో తయారైంది. అయితే, అదే ఇప్పుడు సమస్యగా మారింది. పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో […]

Share:

తన కుమార్తె(Daughter)కు ఎంతో ఇష్టపడి ఏకంగా 157 అక్షరాలతో పెద్ద పేరు పెట్టారో ఓ రాకుమారుడు. అమ్మ, అమ్మమ్మ, తండ్రి, మేనమామ..ఇలా రక్త సంబంధీకులను గుర్తు చేసుకుంటూ స్పెయిన్‌(Spain)లోని ఓ రాకుమారుడు తన బిడ్డకు నామకరణం చేశాడు. ఆ తమ మత విశ్వాసాల్ని తెలిపే పదాల్ని కూడా చేర్చాడు. దీంతో ఆ రాయల్‌ బేబీ(Royal baby) పేరు 25 పదాలు, 157 అక్షరాలతో తయారైంది. అయితే, అదే ఇప్పుడు సమస్యగా మారింది.

పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో పేరెంట్స్ ఎంతో జాగ్రత్త పడతారు. జీవితాంతం అదే పేరుతో పిలవాలి కాబట్టి ఆచి తూచి ఆలోచన చేస్తారు. కానీ, కొం తమంది మాత్రం మగ పిల్లాడు పుడితే ఈ పేరు.. ఆడ పిల్ల పుడితే ఈ పేరు అనుకున్నాం అంటూ ఇష్టానుసారంగా నామకరణం చేస్తుంటారు. మా అమ్మ, నాన్నల పేర్లు, దేవుడు పేర్లు అంటూ నేమ్స్‌ను ఇష్టమొచ్చినట్లు పెట్టేస్తారు. కానీ, పిల్లలను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు లేదా.. పిల్లల పుట్టిన తేదీ రిజిస్టర్(Register) చేయించినప్పుడు ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్నారు ఓ జంట. తన కూతురును సుదీర్ఘమైన పేరు పెట్టి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.

స్పెయిన్‌ (Spain) రాజకుటుంబానికి(Royal family) చెందిన ఓ రాకుమారుడు కూడా ఇలాగే తన కుమార్తెకు వెరైటీ పేరు పెట్టారు. అయితే ఇప్పుడదే ఆయనకు సమస్యగా మారింది. ఎందుకంటారా..? ఆ రాయల్‌ బేబీ (Royal Baby) పేరు ఏకంగా 157 అక్షరాలు మరి..! బాబోయ్‌ అని ఆశ్చర్యపోతున్నారు కదా..! ఇంతకీ ఏంటా పేద్ద పేరు..? దాని వల్ల వచ్చిన తిప్పలేంటీ అంటే..

స్పెయిన్‌లోని ఆల్బా రాజ్య వారసుడు, 17వ హ్యూస్కర్‌ డ్యూక్‌ ఫెర్నాండో ఫిట్జ్‌ – జేమ్స్‌ స్టువర్ట్ (Duke Fernando Fitz-James Stuart), ఆయన సతీమణి సోఫియా పలాజు(Sofia Palaju)లకు ఇటీవల ఈ ఏడాది జనవరిలో రెండోసారి పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు ఫెర్నాండో ఓ ప్రత్యేకమైన పేరు పెట్టారు. ఏకంగా 25 పదాలు, 157 అక్షరాలతో.. ‘సోఫియా ఫెర్నాండా డోలోరెస్‌ కయెటన థెరెసా ఏంజెలా డి లా క్రూజ్‌ మైకెలా డెల్‌ శాంటిసిమో సక్రామెంటో డెల్‌ పర్పిటో సొకోరో డి లా శాంటిసిమా ట్రినిడాడ్‌ యే డి టోడోస్‌ లాస్‌ శాంటోస్‌’ అని ఆ చిన్నారికి నామకరణం చేశారు.

తమ పూర్వీకుల జ్ఞాపకార్థంతో పాటు మతపరమైన విశ్వాసాలకు అనుగుణంగా ఫెర్నాండో తన కుమార్తెకు ఈ పేరు పెట్టారట. స్పెయిన్‌(Spain)లో, అధికారిక పత్రాలపై ఒక వ్యక్తి ఎన్ని పేర్లను కలిగి ఉండాలనే దానిపై నియమాలు ఉన్నాయి. ఈ పేరును రిజిస్టర్(Register) చేసేందుకు స్పెయిన్ అధికారులు నిరాకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంత పెద్ద పేరు ఉండటంతో పేరును తగ్గించుకోవాలని అధికారులు ఫెర్నాండోకు సూచించారు. చిన్నారి పేరును సివిల్‌ రిజిస్ట్రీ(Civil Registry)లో నమోదు చేయాలంటే నిబంధనలకు అనుగుణంగా చిన్న పేరు పెట్టాలని అధికారులు.. రాకుమారుడిని సూచించారు. అయితే, దీనిపై ఫెర్నాండో ఇంకా స్పందించలేదు. 

గిన్నిస్‌ రికార్డు(Guinness record)ల ప్రకారం.. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతి పొడవైన పేరు కూడా ఈ రాజకుటుంబానికి చెందిన వ్యక్తిదే కావడం విశేషం. 18వ ఆల్బా డచెస్‌(Duchess of Alba) పేరు ‘మరియా డెల్‌ రసారియో కయెటన ఆల్ఫోన్సా విక్టోరియా యుగేనియా ఫ్రాన్సిస్కా ఫిట్జ్‌ జేమ్స్‌ స్టువర్ట్‌ యే డి సిల్వా’. ప్రస్తుత డ్యూక్ ఫెర్నాండోకు ఈమె నానమ్మ.