చంద్రుని దక్షిణ ధ్రువం వైపుగా ప్రపంచ దేశాలు

ప్రపంచ దేశాలు ప్రస్తుతం చంద్రుని మీద దక్షిణ ధ్రువం(సౌత్ పోల్)లోకి అడుగు పెట్టేందుకు ముఖ్యంగా ఆత్రుత చూపిస్తున్నారు. భారత నుంచి పంపించిన చంద్రయాన్-3 దగ్గర నుంచి రష్యా అపోలో వరకు ప్రతి ఒక్క మిషన్ చంద్రుడు మీద దక్షిణ ధ్రువం (సౌత్ పోల్) మీద దృష్టి పెట్టాయి.  ఎందుకు దక్షిణ దృవం (సౌత్ పోల్):  రష్యా 1960లో జరిపిన మొదటి చంద్రుడు మిషన్ ప్రయోగించిన సమయంలో, చంద్రుడు మీద నుంచి కొన్ని శాంపిల్స్ అనేవి సేకరించడం జరిగింది. […]

Share:

ప్రపంచ దేశాలు ప్రస్తుతం చంద్రుని మీద దక్షిణ ధ్రువం(సౌత్ పోల్)లోకి అడుగు పెట్టేందుకు ముఖ్యంగా ఆత్రుత చూపిస్తున్నారు. భారత నుంచి పంపించిన చంద్రయాన్-3 దగ్గర నుంచి రష్యా అపోలో వరకు ప్రతి ఒక్క మిషన్ చంద్రుడు మీద దక్షిణ ధ్రువం (సౌత్ పోల్) మీద దృష్టి పెట్టాయి. 

ఎందుకు దక్షిణ దృవం (సౌత్ పోల్): 

రష్యా 1960లో జరిపిన మొదటి చంద్రుడు మిషన్ ప్రయోగించిన సమయంలో, చంద్రుడు మీద నుంచి కొన్ని శాంపిల్స్ అనేవి సేకరించడం జరిగింది. అప్పట్లో ఉన్న పరిజ్ఞానంతో, చంద్రుడు మీద నీటి వనరులు ఉన్నాయో లేవో తెలుసుకోవడం కాస్త కష్టంగా మారింది. అయితే 2008లో బ్రాండ్ యూనివర్సిటీ, 1960 సంవత్సరంలో చంద్రుడు మీద కలెక్ట్ చేసిన కొన్ని శాంపిల్స్ అనేవి పరీక్ష చేశారు. పరీక్ష చేసిన తర్వాత అందులో హైడ్రోజన్ నిలువలు ఉన్నట్లు తేలింది. అంటే కచ్చితంగా చంద్రుడు మీద ముఖ్యంగా దక్షిణ ధ్రువంలో నీటి వనరులు తప్పకుండా ఉంటాయని నిర్ధారించారు. అయితే అప్పటి నుంచి చంద్రుడు మీదకు ముఖ్యంగా దక్షిణ ధ్రువం వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టాయి ప్రపంచ దేశాలు. 

ముఖ్యంగా చంద్రుడు మీద నీటి వనరులు ఉన్నట్లయితే, ఆ వనరులను ఉపయోగించుకుని మరో గ్రహం గా పిలువబడుతున్న మార్స్ ప్రయాణం సులభతరం చేసుకోవచ్చు అనేది ప్రస్తుతం పరిశోధకుల ముఖ్య ఆలోచన.

రష్యా చంద్రుడి మిషన్ ఫెయిల్: 

రష్యా పంపించిన మిషన్ అనుకోని దెబ్బతీసింది. సుమారు 47 సంవత్సరాలుగా రష్యా కృషికి మరోసారి భంగం కలిగింది. ల్యాండ్ అవుతుంది అనుకున్న మిషన్ ఒక్కసారిగా చంద్రుడి ఉపరితలంపై కూలిపోవడంతో రష్యా రీసెర్చ్ సెంటర్ నిరాశలో మునిగిపోయింది. సరిగ్గా చంద్రుడు మీదకి వెళ్ళిన అనంతరం చిన్న లోపం కారణంగా, రష్యా మిషన్ కూలిపోయినట్లు సమాచారం అందింది. 

లూనా 25 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై కూలిపోవడంతో 47 ఏళ్లలో తమ మొదటి మూన్ ల్యాండింగ్ మిషన్ మీద రష్యా పెట్టుకున్న ఆశలు ఆవిరి అయ్యాయి. అందిన సమాచారం ప్రకారం, రోబోటిక్ ప్రోబ్ ఒక లోపం కారణంగా , మాస్కో సమయం ప్రకారం, ఆగష్టు 19న, మధ్యాహ్నం 2:57 గంటలకు గ్లిచ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ముందు జరిగిన సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను రష్యన్ అంతరిక్ష సంస్థ విడుదల చేయలేదు, ఆగస్ట్ 21న ల్యాండింగ్‌కు దగ్గరగా ఉన్న సందర్భంలో, లూనా 25ను ఎలిప్టికల్ అప్రోచ్ ఆర్బిట్ లో ఉంచే సమయంలో ఇంజిన్ మిస్‌ఫైర్ అవ్వడం వల్ల మిషన్ క్రాష్ జరిగిందని ప్రకటన ద్వారా పేర్కొంది రష్యా.

చంద్రయాన్-3: 

ఇస్రో ద్వారా ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ఇప్పటికే సగం పని పూర్తి చేసుకుందని చెప్పుకోవాలి. ఆగస్టు 5కి ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క కక్ష్య(ఆర్బిట్)లోకి ప్రవేశించి మొదటి విజయాన్ని సాధించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరవుతూ చివరి కక్ష్య (ఆర్బిట్)లోకి ప్రవేశించడమే కాకుండా ఆగస్టు 23 సాయంత్రం సమయంలో, చంద్రుడు మీద అడుగు పెట్టబోతోంది చంద్రయాన్-3. 

ఆగస్టు 23న చంద్రుడు మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే క్షణాలు దగ్గర పడుతున్నాయి. భారతదేశం యావత్తు కూడా చంద్రయాన్-3 చంద్రుడు మీద సురక్షితంగా అడుగు పెట్టాలని తమ వంతు ప్రార్థనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి లూనార్ లాండర్ పనితీరు సవ్యంగానే ఉన్నట్లు సమాచారం అందింది. ఇంకో కొన్ని గంటలలోనే, సాయంత్రం సమయం నాటికి చంద్రుడు మీద, చంద్రయాన్-3 లాండర్ సురక్షితంగా, విజయవంతంగా అడుగుపెట్టే అవకాశం ఉంది అని ఇస్రో తెలియజేస్తుంది.