బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన‌నున్న ట్రాన్స్‌జెండ‌ర్

వెనుజులాలో జరగబోతున్న మిస్ వెనిజులా బ్యూటీ కాంటెస్ట్లో కనిపించనున్న మొదటి ట్రాన్స్ జెండర్ సోఫియా సలోమాన్. సోఫియా నిజానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అలాగే వెనుజులాలో ఒక మోడల్. వెనుంజలలో జరగబోతున్న మిస్ వెనుజులా బ్యూటీ కాంటెస్ట్లో తను కూడా పాలుపంచుకోవాలని ఒక కంటెస్టెంట్ గా అప్లై చేసుకుంది. సోఫియా సలోమన్ ఎవరు: వేణుచులలో పుట్టి పెరిగిన సోఫియా ఒక ట్రాన్స్టెండర్. తను సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంతేకాకుండా ఒక మోడల్. తనకి ఇన్స్టాగ్రామ్ లో చాలామంది […]

Share:

వెనుజులాలో జరగబోతున్న మిస్ వెనిజులా బ్యూటీ కాంటెస్ట్లో కనిపించనున్న మొదటి ట్రాన్స్ జెండర్ సోఫియా సలోమాన్. సోఫియా నిజానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అలాగే వెనుజులాలో ఒక మోడల్. వెనుంజలలో జరగబోతున్న మిస్ వెనుజులా బ్యూటీ కాంటెస్ట్లో తను కూడా పాలుపంచుకోవాలని ఒక కంటెస్టెంట్ గా అప్లై చేసుకుంది.

సోఫియా సలోమన్ ఎవరు:

వేణుచులలో పుట్టి పెరిగిన సోఫియా ఒక ట్రాన్స్టెండర్. తను సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంతేకాకుండా ఒక మోడల్. తనకి ఇన్స్టాగ్రామ్ లో చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

అయితే ఈ సంవత్సరం వెనుజులాలో జరగబోతున్న వెనిజులా బ్యూటీ కాంటెస్ట్లో పాలు పంచుకోబోతోంది. తను అందులో పాటిస్పేట్ చేయనుంది. అందుకోసమే ఇప్పటికే తను కంటెస్టెంట్ గా పోటీ చేస్తూ అప్లికేషన్ కూడా పంపించడం జరిగింది. అయితే ఒకవేళ అప్లికేషన్ గనుక యాక్సెప్ట్ చేస్తే తను వెనుజులలో  జరగబోతున్న వెనుజులా కాంటెస్ట్ లో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ అవుతుంది.

ఇంటర్వ్యూ ప్రకారం:

అయితే ఆ కాంటాక్ట్స్ లో పాల్గొనాలి అనుకుంటే ఒక కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. అందులో మొట్టమొదటిది పాటిస్పేట్ చేయడానికి ఒక మహిళ అయి ఉండాలి. అయితే దీని గురించి మోడల్ మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో,“ఇది నిజానికి మా కమ్యూనిటీ ప్రపంచాన్ని గొప్పగా పరిచయం చేయడానికి గొప్ప అవకాశం. ఒక ట్రాన్స్ జెండర్ మహిళ అంటే ఏమిటో ఈ కాంటెస్ట్ ద్వారా చూపించాలి అనుకుంటున్నా,” అంటూ తనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని సోఫియా బయట పెట్టింది.

అంతేకాకుండా సోఫియా మాట్లాడుతూ,“నిజానికి చట్టాల్లో ఎన్నో మార్పులు కనిపించాయి. ఇప్పుడు గనక నా అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే, ట్రాన్స్ జెండర్ ఆడవాళ్లు కూడా మరింత సురక్షితంగా భావిస్తారు.”

సోఫియా ఒక లాయర్ గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా వర్ణించారు. తనకి సహాయం చేసిన లోయర్ తామర ఆడ్రియన్. ఒక ట్రాన్స్ జెండర్ లాయర్. తన కారణంగానే 2014లో తన బర్త్ సర్టిఫికెట్ లో సోఫియా తన పేరును అలాగే తన పర్సనల్ విషయాలు చేంజ్ చేసుకోగలిగింది. అంతేకాకుండా, 2015లో తామర మొట్టమొదట ట్రాన్స్ జెండర్ లా మేకర్గా నిలిచింది.

నిజానికి ఒక ట్రాన్స్ జెండర్ ఇలాంటి బ్యూటీ కంటస్టెంట్ లో పాల్గొనడం మొదటిసారి కాదు.2018 లో యాంజిలా పోన్స్ అని ట్రాన్స్లేటర్ మహిళా మిస్ యూనివర్స్ లో పార్టిసిపేట్ చేసింది. అంతేకాకుండా థాయ్ బిజినెస్ టైకూన్ అయినా మరో ట్రాన్స్ జెండర్ మహిళా, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్నీ 164 కోట్లకు కొనుక్కుంది.

నిజంగా సోఫియా ఇప్పుడు వెనుజులలో జరుగుతున్న కాంటెస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవడం అనేది ఒక ముందు అడుగు అని చెప్పుకోవాలి. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో చాలామంది మహిళలు అన్ని రంగాల్లోనే ముందుకు వెళ్లడానికి ఎప్పుడు వెనకాడరు. అంతేకాకుండా ట్రాన్స్ జెండర్ మహిళలు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. ఎవరు సాహసించని పనులను కూడా చేయడానికి వెనకాడరు. అంత ధైర్యం కావాలంటే చాలా తగ్గింపు ఉండాలి. నలుగురికి సహాయం చేయడానికి వారికి ఎంతో చక్కని మనసు దేవుడు ఇచ్చాడు. అందుకే వారు ఎక్కడికి వెళ్ళినా మంచే జరుగుతుంది. వాళ్ల కమ్యూనిటీ లోనే కాకుండా ఇతర మహిళలకు కూడా వారు స్ఫూర్తిదాయకంగా ఎన్నో పనులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోఫీయా వెనుజులా కంటెస్టెంట్గా మారితే అది కచ్చితంగా,  నిజంగా గొప్ప విజయం కింద భావించవచ్చు.