వైరల్ డాగ్  ‘చీమ్స్‌’ కన్నుమూత!

సోషల్ మీడియాలో జంతువుల పేజీలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కుక్కలు, పిల్లులు వంటి వాటికి ఇంకాస్త క్రేజ్ ఎక్కువ. వాటి చేష్టలు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు అభిమానులు ఎక్కువే. అలా తన రూపంతో, చిలిపి పనులతో ఎంతో మందికి చేరువైంది ‘చీమ్స్’. సోషల్ మీడియా ద్వారా వేలాది మందికి చేరువైంది. కానీ క్యాన్సర్‌‌తో కన్నుమూసింది. శాశ్వతంగా నిద్రపోయింది.. ‘షిబా ఇను’ జాతికి చెందిన బాల్ట్‌జ్‌ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఇన్‌స్టాలో  ఈ శునకానికి ఓ పేజీ ఉంది. […]

Share:

సోషల్ మీడియాలో జంతువుల పేజీలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కుక్కలు, పిల్లులు వంటి వాటికి ఇంకాస్త క్రేజ్ ఎక్కువ. వాటి చేష్టలు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు అభిమానులు ఎక్కువే. అలా తన రూపంతో, చిలిపి పనులతో ఎంతో మందికి చేరువైంది ‘చీమ్స్’. సోషల్ మీడియా ద్వారా వేలాది మందికి చేరువైంది. కానీ క్యాన్సర్‌‌తో కన్నుమూసింది.

శాశ్వతంగా నిద్రపోయింది..

‘షిబా ఇను’ జాతికి చెందిన బాల్ట్‌జ్‌ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఇన్‌స్టాలో  ఈ శునకానికి ఓ పేజీ ఉంది. అంతేనా ‘చీమ్స్‌ బాల్ట్‌జ్‌.కామ్’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ కూడా ఉంది. సోషల్ మీడియాలో ‘చీమ్స్‌’ పేరుతో చాలా ఫేమస్. ఆగస్టు 18న క్యాన్సర్‌‌తో చనిపోయింది. ఈ విషయాన్ని దాని యజమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చాలా కాలంగా బాల్ట్‌జ్‌ క్యాన్సర్‌‌తో బాధ పడుతోందని, చివరిగా థొరాసెంటెసిస్ శస్త్ర చికి త్స చేస్తుండగా చనిపోయిందని తెలిపారు.

‘‘బాల్ బాల్.. 18వ తేదీన శాశ్వతంగా నిద్రపోయింది. తన చివరి థొరాసెంటెసిస్ సర్జరీ సమయంలో శుక్రవారం ఉదయం కన్నుమూసింది. వాస్తవానికి ఈ ఆపరేషన్ తర్వాత తనకి కీమోథెరపీ లేదా ఇతర చికత్సను ఇప్పించాలని అనుకున్నాం. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది” అని బాల్ట్‌జ్‌ యజమానులు రాసుకొచ్చారు. ‘‘బాధపడకండి.. ప్రపంచానికి బాల్ట్‌జ్‌ ఇచ్చిన ఆనందాన్ని గుర్తుంచుకోండి. మిమ్మల్ని, నన్ను కలిపిన బాల్ట్‌జ్‌ .. కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మందికి సాయపడింది. మీలో ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు తన మిషన్ పూర్తయింది. వెళ్లిపోయింది”అని భావోద్వేగ పోస్టు చేశారు. 

2017లో ఫేమస్

2017లో తొలిసారి బాల్ట్‌జ్‌  ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ శునకం ఫేమస్ అయిపోయింది. ఎంతో మంది లైక్స్, కామెంట్స్‌తో ప్రోత్సహించారు. ఎంతో మంది ఫ్యాన్స్ అయిపోయారు. ‘‘2017 సెప్టెంబర్ 4న.. రోజు మాదిరే నేను మామూలుగానే కూర్చున్నా. వెనక్కి వాలి గోడలకు ఆనుకుని కూర్చున్నా.. మా అమ్మ నా ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసింది. అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ జోష్ నా పోస్ట్ గురించి కామెంట్ చేశాడు. ‘‘ఇతడు ఎవరో తెలియదు కానీ.. కానీ జున్ను మాదిరే ఉన్నాడు” అని రాసుకొచ్చాడు. అప్పుడే నా ‘మీమ్ ఫేమ్’ మొదలైంది. చీమ్స్, చీమ్స్ బర్గర్‌‌గా పిలిచుకునేవారు” అని చీమ్స్ బాల్ట్‌జ్‌   వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు.

చనిపోయే సమయానికి బాల్ట్‌జ్‌ వయసు 12 ఏళ్లు. తన యజమాని కాథీతో కలిసి హాంకాంగ్‌లో ఉంటోంది. ఏడాది వయసున్నప్పుడే బల్ట్‌జ్‌ను కాథీ అడాప్ట్ చేసుకుంది. ఆ శునకం ఫోటోజెనిక్ అని నమ్మింది. ఈ కుక్క ఫొటోలను, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. దీంతో దీని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని మీమ్స్‌కు తెగ వినియోగించే వారు. ఇప్పుడు భౌతికంగా లేకపోయినా.. మీమ్స్‌లో బతికి ఉంటుంది. 

సంతాపాల వెల్లువ

పాపులర్ మీమ్ డాగ్ చనిపోయిందని తెలిసి ఇంటర్నెట్ యూజర్లు.. తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఆర్‌‌ఐపీ బడ్డీ.. నువ్వు ఎంతో మందికి సంతోషాన్నిచ్చావు” అని ఒకరు కామెంట్ చేశారు. ‘‘అతడు ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక లెజెండ్. ఓ మీమ్ ఫౌండర్, ఇప్పుడు అతడు అమరుడు. రెస్ట్ ఇన్ లవ్ బాల్ బాల్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేమను మీరు పొందారు” అని మరొకరు రాసుకొచ్చారు. ‘‘మీమ్ ట్రెండ్‌తో ఈ లెజెండ్‌కు పరిచయమయ్యాను. ఇన్నేళ్ల తర్వాత అతడి మరణం గురించి వినడం చాలా కష్టంగా ఉంది. 2020లో చాలా మందికి అతడు సాయం చేశాడు. ఓ రాజులా నిద్రపో.. నిన్ను మిస్ అవుతాం” అని ఇంకొకరు కామెంట్ చేశారు.