దగ్గినందుకు జైలు పాలైన కరోనా వచ్చిన వ్యక్తి

సింగపూర్ లో సెటిల్ అయిన ఒక ఇండియన్, 64 సంవత్సరాల వ్యక్తి రెండు వారాల పాటు జైలు శిక్షకు పాత్రుడయ్యాడు. మహమ్మారి కరోనా కారణంగా సింగపూర్లో కరోనా ఆంక్షలు ఉల్లంఘించినందుకు 64 సంవత్సరాల వ్యక్తికి జైలు శిక్ష పడింది. 2021 లో కరోనా ఆంక్షలు ప్రకారం, ముక్కు నోరు కవర్ అయ్యే విధంగా మాస్క్ పెట్టుకోవాల్సి ఉంది, కానీ ఈ అంశాన్ని ఉల్లంఘించినందుకు ఆయనకు శిక్ష పడింది.  అసలు విషయం:  కరోనా మరొకసారి విచారంబిస్తున్న వేళ సింగపూర్లో, […]

Share:

సింగపూర్ లో సెటిల్ అయిన ఒక ఇండియన్, 64 సంవత్సరాల వ్యక్తి రెండు వారాల పాటు జైలు శిక్షకు పాత్రుడయ్యాడు. మహమ్మారి కరోనా కారణంగా సింగపూర్లో కరోనా ఆంక్షలు ఉల్లంఘించినందుకు 64 సంవత్సరాల వ్యక్తికి జైలు శిక్ష పడింది. 2021 లో కరోనా ఆంక్షలు ప్రకారం, ముక్కు నోరు కవర్ అయ్యే విధంగా మాస్క్ పెట్టుకోవాల్సి ఉంది, కానీ ఈ అంశాన్ని ఉల్లంఘించినందుకు ఆయనకు శిక్ష పడింది. 

అసలు విషయం: 

కరోనా మరొకసారి విచారంబిస్తున్న వేళ సింగపూర్లో, చివరి దశలో ఉన్న ఒక కేసు వెలుగులోకి వచ్చింది, సింగపూర్ లోని ఒక వ్యక్తికి రెండు వారాల జైలు శిక్ష పడింది. కరోనా ఆంక్షలు ఉల్లంఘించినందుకు కారణంగానే ఆయనకు శిక్ష పడినట్లు వెళ్లడైంది. సింగపూర్ 20201 లో పెట్టిన కరోనా ఆంక్షలు ఆయన పాటించనందుకు, ఇటీవల ఆయనకు రెండు వారాల జైలు శిక్ష విధించారు. 

ఇక విషయానికి వస్తే, తమిళ్ సెల్వం రామయ్య అనే 64 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ అతనికి కరోనా వచ్చినట్లు తెలిసినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా మాస్క్ తీసి తన కొలీగ్స్ మీద దగ్గడం జరిగింది. ఈ కారణంగానే తనకు సింగపూర్ లోని శిక్ష పడింది. తమిళ్‌సెల్వం లియోంగ్ హప్ సింగపూర్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నారని కోర్టు తెలిపింది. 

ఎప్పటిలాగే, 2021 అక్టోబర్ 18న ఉదయాన్నే పని చేయడానికి వచ్చాడు తమిళ్ సెల్వం. అయితే అప్పటికే తనకి అనారోగ్యంగా ఉండడంతో అసిస్టెంట్ లాజిస్టిక్ మేనేజర్ కి చెప్పి టెస్టులు నిర్వహించారు. అయితే ఈ క్రమంలోనే అతనికి కరోనా వచ్చినట్లు నిర్ధారణ అయింది. కరోనా వచ్చింది కాబట్టి తమను ఇంటికి వెళ్ళిపోమని టెస్ట్ చేసిన వాళ్లు సలహా ఇచ్చాడు. ఈ విషయాన్ని అప్పటికే తెలుసుకున్న మేనేజర్, తమిళ్ సెల్వన్ సహ ఉద్యోగులకు కూడా చెప్పడం జరిగింది. 

అయితే, తమిళసెల్వం వెంటనే ఇంటికి వెళ్లలేదు. అతను తన కోవిడ్-19 పరీక్ష ఫలితం గురించి అసిస్టెంట్ లాజిస్టిక్స్ మేనేజర్‌కి తెలియజేయడానికి కంపెనీ లాజిస్టిక్స్ ఆఫీస్ కి వెళ్ళాడు. పాజిటివ్ టెస్ట్ రిజల్ట్ గురించి తెలియని కంపెనీ డ్రైవర్‌తో తమిళసెల్వం ఆఫీసులోకి రావడం సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయింది. 40 ఏళ్ల లాజిస్టిక్ సూపర్‌వైజర్, తమిళసెల్వం దగ్గరికి వెళ్లవద్దని డ్రైవర్‌కు చెప్పాడు. సూపర్‌వైజర్ కూడా తమిళ్‌సెల్వంను ఆఫీసు నుండి బయటకు రమ్మని అడిగాడు. తమిళ్‌సెల్వం తలుపు దగ్గరకు దగ్గుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు.

సూపర్‌వైజర్ ఆఫీసు డోర్ మోసేగా మళ్లీ తమిళసెల్వం తెరిచాడు. అంతేకాకుండా తను ఆఫీస్ నుంచి వెళ్లే ముందు మాస్క్ తీసేసి చాలా సార్లు తగ్గడం జరిగింది. ఈ విషయాలు అన్నీ క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తమిళసెల్వం లాజిస్టిక్స్ ఆఫీస్ గ్లాస్ కిటికీ అవతలి వైపున ఉన్న 56 ఏళ్ల క్లర్క్‌ దగ్గరికి వెళ్ళాడు కిటికీ తెరిచి, మాస్క్ వేసుకుని తగ్గుతూ ఆమె వైపు వెళ్తూ, “కెనా కోవిడ్, కెనా కోవిడ్” అన్నాడు, “కెనా” అనే మలేయ్ పదాన్ని ఉపయోగించి, నీకు కూడా కరోనా వచ్చేస్తుంది అంటూ.. వెటకారంగా నవ్వాడు. 

తమిళ్‌సెల్వం కోవిడ్‌-19కి పాజిటివ్‌గా తేలిందని తెలిసి సహ ఉద్యోగులు నిజానికి ఆందోళనకు గురయ్యారు. అయితే నిజానికి క్లర్క్ డయాలసిస్ రోగి, తను గుండె మరియు మూత్రపిండాల సమస్యలతో అప్పటికే బాధపడుతున్నారు. దగ్గు రావడంతో ఆమె ART చేయించుకుంది.

ఎవరికీ కోవిడ్-19 సోకలేదు:

అయితే తర్వాత తమిళసెల్వం ట్రీట్మెంట్ కి వెళ్ళగా, క్వారంటైన్‌లో ఉండాలని కూడా చెప్పారు. ఈ ఘటనపై కంపెనీ అసిస్టెంట్ లాజిస్టిక్స్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో, తమిళసెల్వం తన సహోద్యోగులతో జోక్ చేసినట్లు వివరించాడు. అంతేకాకుండా తను ఆఫీసులో తనకి టెస్టులు చేయించుకున్నప్పటికీ, కరోనా వచ్చిందో రాలేదో నేస్తరించుకోలేదని, మళ్లీ ఇంకొకసారి క్లినిక్ కి వెళ్లి నిర్ధారించుకున్నట్లు కూడా వివరించాడు. ఆయన దగ్గినప్పటికీ అతని సహో ఉద్యోగులకు కరోనా సోకలేదు.

డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శృతి బొప్పన మాట్లాడుతూ, నిజానికి అది జోక్ కాదని, తమిళసెల్వం తన సహోద్యోగుల ముందు ఉద్దేశపూర్వకంగా దగ్గడమే కాకుండా, ఆఫీస్ నుంచి వెళ్ళమని చెప్పినప్పటికీ మాట వినలేదని మరొకసారి గుర్తు చేశారు. అయితే కరోనా కేసులు సింగపూర్లో పెరుగుతున్న క్రమంలో మూడు నుంచి నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. కోవిడ్-19 నిబంధనను ఉల్లంఘించినందుకు, అతనికి ఆరు నెలల వరకు జైలు శిక్ష, SGD10,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు అని చెప్పారు.