సిలికాన్ వాలీ బ్యాంకు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యిందా?

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సిలికాన్ వాలీ బ్యాంకు తన పర్యవేక్షణలో తగిన శక్తి మరియు ఆవశ్యకతను వ్యవహరించడంలో విఫలమైందని పేర్కొంది. 2008 తర్వాత దేశంలో అతిపెద్ద బ్యాంకు వైఫల్యంతో గత నెలలో కుప్పకూలిన సిలికాన్ వాలీ బ్యాంకు పై పర్యవేక్షణలో  సక్సెస్ సాధించడంలో విఫలం అయ్యిందని సమాచారం. ఇకపోతే బ్యాంకింగ్ పరిశ్రమ స్థితిపై ఇది ప్రపంచ భయాలను రేకెత్తించింది మరొక యుఎస్ ఋణదాత ఫస్ట్ రిపబ్లిక్ సమస్యలో ఉన్నందున ఈ సమీక్ష వచ్చినట్లు సమాచారం. ఇకపోతే యూఎస్ […]

Share:

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సిలికాన్ వాలీ బ్యాంకు తన పర్యవేక్షణలో తగిన శక్తి మరియు ఆవశ్యకతను వ్యవహరించడంలో విఫలమైందని పేర్కొంది. 2008 తర్వాత దేశంలో అతిపెద్ద బ్యాంకు వైఫల్యంతో గత నెలలో కుప్పకూలిన సిలికాన్ వాలీ బ్యాంకు పై పర్యవేక్షణలో  సక్సెస్ సాధించడంలో విఫలం అయ్యిందని సమాచారం. ఇకపోతే బ్యాంకింగ్ పరిశ్రమ స్థితిపై ఇది ప్రపంచ భయాలను రేకెత్తించింది మరొక యుఎస్ ఋణదాత ఫస్ట్ రిపబ్లిక్ సమస్యలో ఉన్నందున ఈ సమీక్ష వచ్చినట్లు సమాచారం. ఇకపోతే యూఎస్ రెగ్యులేటర్లు గత ఏడాది చివర్లో యూఎస్ లో 14వ అతిపెద్ద బ్యాంకుగా ఉన్నప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న సంస్థ కోసం సంభావ్య రెస్క్యూపై పనిచేస్తున్నట్లు నివేదించబడింది.

ఇకపోతే సమీక్షకు నాయకత్వం వహించిన ఫెడరల్ రిజర్వు పర్యవేక్షణ వైస్ చైర్ మైఖేల్ బార్, ఎస్‌వి‌బి మరణం నుండి నేర్చుకున్న దానికి ప్రతిస్పందనగా యూఎస్ సెంట్రల్ బ్యాంక్ నిబంధనలను మరింత కఠిన తరం చేయాలని అనుకున్నారు.. కానీ సూపర్‌వైజర్ తగినంత చర్య తీసుకోవడంలో విఫలం అయ్యారని సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో పనిచేయకపోవడం, మధ్య పరిమాణ బ్యాంకుల్లో సమస్యల వల్ల విస్తృత వ్యవస్థకు ప్రమాదాల వల్లే ఇలా పాలసీలు మిస్ అయినట్లు సమాచారం. ఈ మేరకు ఫెడరల్ రిజర్వ్ అధిపతి చైర్మన్ పావెల్ సమగ్రమైన, స్వీయ విమర్శనాత్మక నివేదికను స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

వాస్తవానికి గత సంవత్సరం యూఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లు బాగా పెంచిన తర్వాత రెండు బ్యాంకులు కూడా వ్యాపార కస్టమర్లకు సేవలు అందించాయి. అయితే కస్టమర్ల నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం ప్రారంభించిన తర్వాత ఇబ్బందులు ఎదురయ్యాయి. గత నెలలో నిధులను సేకరించాల్సిన అవసరం ఉందని సిలికాన్ వాలీ బ్యాంకు ప్రకటన చేయడం తీవ్రభయాందోళనకు దారితీసింది. అలాగే కస్టమర్ల నుంచి మిలియన్ల డాలర్ల డబ్బును ఉపసంహరించుకోవడం ప్రారంభించిన తర్వాత ఇబ్బందులు ఎదురయ్యాయి. గత నెలలో నిధులను సేకరించాల్సిన అవసరం ఉందని సిలికాన్ వాలీ బ్యాంకు యొక్క చేయడం ప్రకటన తీవ్రభయాందోళనకు దారితీసింది ..అలాగే మిలియన్ల డాలర్లు రాత్రికి రాత్రి ఉపసంహరించబడ్డాయి. దాంతో నియంత్రణ అధికారులు అడుగు పెట్టవలసి వచ్చింది. అంటూ తాజా సమాచారం. ఇకపోతే ఇలా బ్యాంకు దివాలా తీయడానికి కారణం  ఏమిటి అనే విషయానికి వస్తే మార్చి 10వ తేదీన దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు భారీ క్షీణతను నమోదు చేశాయి.

అమెరికాకు చెందిన సిలికాన్ వాలీ బ్యాంకు మాతృ సంస్థ సిలికాన్ వ్యాలీ బ్యాంకు ఫైనాన్షియల్ గ్రూప్ షేర్లు భారీగా పతనం కావడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఇకపోతే ఈ బ్యాంకు ప్రధానంగా స్టార్టప్ కంపెనీలకు రుణాలను అందిస్తూ ఉంటుంది.  బ్యాంకు ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉంది. నిధుల కోసం కష్టపడుతున్న స్టార్టప్ ల నుంచి డిపాజిట్లు తగ్గిపోవడంతో బ్యాంకు తన బ్యాలెన్స్ షీట్ ను పెంచుకోవడానికి 2.25 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ ప్రకటనతో బ్యాంకు మార్కెట్ విలువ రూ.6.5 లక్షల కోట్ల మేర ఆవిరయిపోయింది.  బ్యాంకు షేర్ విలువ దాదాపు 60.41% క్షీణించింది. ఇక ఈ సమస్య కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైనప్పటికీ కూడా ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లపై కనిపిస్తోంది. ఏది ఏమైనా జూన్ 2020 తర్వాత అమెరికా బ్యాంక్ ఇండెక్స్ ఇంత భారీ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. మరొకవైపు గత ఏడాది కాలంలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు తన వడ్డీ రేట్లు 4.5 శాతానికి పైగా పెంచింది. 2007 తర్వాత ఇదే అత్యధికం ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని.. ఇటీవల కంపెనీ కీలక ప్రకటన చేయగా ఇది మరింత ఆందోళనలను పెంచుతోంది.