పెషావ‌ర్‌లో సిక్కుల దారుణ హ‌త్య‌లు

మొదట ఒకసారి తుపాకీ దాడి జరగగా, శుక్రవారం కూడా, తార్లోక్ సింగ్ అనే సిక్కు దుకాణదారుని మెద తుపాకితో దాడి చేయడం జరిగింది, అయితే అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మన పక్క దేశమైన పాకిస్తాన్‌లోని మైనారిటీ కమ్యూనిటీ సభ్యుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతూ ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కెపికె) ప్రావిన్స్‌లోని పెషావర్‌లోని రషీద్‌గర్హి బజార్‌లో శనివారం ఒక సిక్కు దుకాణ వ్యాపారిని కాల్చి చంపారు. మన్మోహన్ సింగ్ (32) అనే వ్యక్తిని శనివారం తుపాకీతో కాల్చి చంపారు, […]

Share:

మొదట ఒకసారి తుపాకీ దాడి జరగగా, శుక్రవారం కూడా, తార్లోక్ సింగ్ అనే సిక్కు దుకాణదారుని మెద తుపాకితో దాడి చేయడం జరిగింది, అయితే అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

మన పక్క దేశమైన పాకిస్తాన్‌లోని మైనారిటీ కమ్యూనిటీ సభ్యుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతూ ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కెపికె) ప్రావిన్స్‌లోని పెషావర్‌లోని రషీద్‌గర్హి బజార్‌లో శనివారం ఒక సిక్కు దుకాణ వ్యాపారిని కాల్చి చంపారు.

మన్మోహన్ సింగ్ (32) అనే వ్యక్తిని శనివారం తుపాకీతో కాల్చి చంపారు, ఇది కావాలని చేసిన దాడిగా చెప్తున్నారు స్థానికులు  – రెండు రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి జరిగిన ఘటన.

శుక్రవారం కూడా, ఒక సిక్కు దుకాణ వ్యాపారి, ఒక తర్లోక్ సింగ్‌ మీద కూడా దాడి జరిగింది కానీ అదృష్టంతో ఆయన బయటపడ్డాడు, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు, అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తుల గురించి ఇప్పటికీ ఎటువంటి సమాచారం లేదు.

స్థానిక సిక్కు కమ్యూనిటీ సభ్యుడు బల్బీర్ సింగ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, బ్యూటీ ప్రొడక్ట్స్ లాంటివి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించే దుకాణ వ్యాపారి అయిన మన్మోహన్ సింగ్ తన దుకాణాన్ని మూసి ఇంటికి వెళుతున్నప్పుడు ఇటువంటి అసాధారణ సంఘటన జరిగిందని చెప్పారు. మన్మోహన్ ఆటోరిక్షా ఎక్కిన తర్వాత, మోటర్‌బైక్‌లో వచ్చిన ఇద్దరు దుండగులు మొదట అతనిని అనుసరించి కాల్పులు జరిపారు. ” అది సుమారు రాత్రి 8 గంటల సమయం. అతను ఆటోలో ఇంటికి వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే మరణించాడు, ”అని బల్బీర్ చెప్పారు, మన్మోహన్‌కు అతని తల్లిదండ్రులు, భార్య, కుమారుడు మరియు ఒక సోదరుడు ఉన్నారు.

“అతని మృతదేహాన్ని ఇప్పుడు గురుద్వారా భాయ్ జోగా సింగ్‌కు తీసుకువెళుతున్నారు, అక్కడ పెషావర్‌లో నివసిస్తున్న సిక్కు సమాజం వారి చివరిసారిగా జరపాల్సిన అంత్యక్రియలను చేస్తారు మరియు తదుపరి ఏం చేయాలి అనే దాని గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది,” అని అతను చెప్పాడు.

శుక్రవారం జరిగిన ఈ ఘటనలో తార్లోక్ సింగ్ అనే సిక్కు దుకాణ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు అతనిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు తెలిపారు. “కనీసం ఏడుసార్లు అతనిపై కాల్పులు జరిపారు, అయితే అదృష్టవశాత్తూ అతని కాలుకు గాయంతో తప్పించుకున్నాడు” అని మరొక స్థానిక సిక్కు మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. స్థానిక వార్తా వేదిక “ది ఖొరాసన్ డైరీ” ద్వారా నివేదించిన ప్రకారం, ఈ దాడిని ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) క్లెయిమ్ చేసింది.

పాకిస్తాన్‌లోని పెషావర్‌లో నివసిస్తున్న కొద్దిమంది పష్టున్ సిక్కు సంఘం సభ్యులు గత రెండు సంవత్సరాలలో ముష్కరులచే అనేకసార్లు లక్ష్యంగా చేసుకున్న హింసాత్మక బెదిరింపుల మధ్య కాస్త భయంగా నివసిస్తున్నారు.

నిజానికి పాకిస్తాన్లో నివసిస్తున్న చాలామంది ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుంది అనే భయంతో బ్రతుకుతూ ఉంటారు. చాలామంది ప్రజలు ముష్కురుల చేతిలో హతమైనట్లు ఇప్పటివరకు మనం చూసే ఉంటాం. ప్రపంచంలో ఇటువంటి భయానకమైన సంఘటనలు జరగడం నిజంగా బాధాకరమైన విషయం. నిజానికి మనిషిని మనిషి చంపే అంత ఘోరమైన ఆధునిక ప్రపంచంలో బ్రతుకుతున్నందుకు చాలామంది బాధపడుతున్నారు.

ఇంకా చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ప్రపంచంలో చాలా దేశాలలో తుపాకీల దాడి చాలా ఎక్కువగా జరిగింది. ఇటీవల అమెరికాలో ఒక మార్ట్ లో జరిగిన తుపాకీ దాడిలో, భారత్ నుంచి అమెరికాకు  పై చదువుల కోసం వెళ్ళిన ఒక అమ్మాయి మరణించింది.