America: 22 మంది కాల్చి చంపిన నిందితుడు మృతి

అమెరికా (America)లోని చాలా ప్రాంతాలలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి భయాందోళన కలిగిస్తోంది. అయితే దీనంతటికీ కారణం ఒక వ్యక్తి విచక్షణ రహితంగా షూట్ (Shoot) చేసిన కారణంగానే అని, చాలా ప్రాంతాలలో సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు అమెరికా (America)లో అయితే ఆ హంత‌కుడు చ‌నిపోయిన‌ట్లు అమెరిక‌న్ పోలీసులు ధృవీక‌రించారు. 2 రోజుల పాటు గాలించిన పోలీసులు బుధవారం రాత్రి జరిగిన ఒక దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోగా, […]

Share:

అమెరికా (America)లోని చాలా ప్రాంతాలలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి భయాందోళన కలిగిస్తోంది. అయితే దీనంతటికీ కారణం ఒక వ్యక్తి విచక్షణ రహితంగా షూట్ (Shoot) చేసిన కారణంగానే అని, చాలా ప్రాంతాలలో సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు అమెరికా (America)లో అయితే ఆ హంత‌కుడు చ‌నిపోయిన‌ట్లు అమెరిక‌న్ పోలీసులు ధృవీక‌రించారు.

2 రోజుల పాటు గాలించిన పోలీసులు

బుధవారం రాత్రి జరిగిన ఒక దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. మైనే (Maine)లోని, లూయిస్టన్‌లోని బౌలింగ్ అల్లే మరియు బార్‌లో సామూహిక కాల్పులకు సంబంధించి అనుమానితుడు అయిన US ఆర్మీ రిజర్విస్ట్ రాబర్ట్ కార్డ్ (Robert Card) కోసం పోలీసులు (Police) 2 రోజుల పాటు గాలింపులు చేప‌ట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా భారీ సాయుధ పోలీసులు (Police) గురువారం ఒక ఇంటిని చుట్టుముట్టారు. 

అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, బౌడోయిన్ పట్టణానికి సమీపంలో ఉన్న ఇల్లు రాబర్ట్ కార్డ్ (Robert Card) బంధువుకు సంబంధించిందని సమాచారం. మైనే (Maine) లా ఎన్‌ఫోర్స్‌మెంట్ బులెటిన్, కార్డ్ (Robert Card)‌ నిజానికి షూటింగ్ నేర్చుకున్న ఒక వ్యక్తి అని అభివర్ణించింది. అంతేకాకుండా ప్రస్తుతం చాలా కాలం తర్వాత కార్డ్ (Robert Card) మళ్ళీ బయటికి వచ్చాడని, అతనికి నిజానికి ఇతర మానసిక ఆరోగ్య (Health) సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు అధికారులు.

అతను సాకోలోని నేషనల్ గార్డ్ స్థావరాన్ని కాల్చివేస్తానని బెదిరించాడు. 2023 వేసవిలో రెండు వారాల పాటు మానసిక ఆరోగ్య (Health) ట్రీట్మెంట్ అనేది కార్డ్ (Robert Card) తీసుకున్నడని అధికారులు తెలిపారు. అయితే రెండు వారాల తర్వాత అతను బయటికి వెళ్లిపోయాడని అని మైనే (Maine) ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ సెంటర్, యూనిట్ రాష్ట్ర పోలీసులు (Police) వెల్లడించారు.

మైనే  ప్రాంతంలో ఘాతుకం: 

‘జస్ట్-ఇన్-టైమ్ రిక్రియేషన్’ బౌలింగ్ అల్లే దగ్గర బుధవారం రాత్రి 7 గంటల ముందు కాల్పులు ప్రారంభమయ్యాయి, అక్కడ ఒక మహిళా, ఆరుగురు పురుషులు కాల్పుల్లో చనిపోయారని పోలీసులు (Police) వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. దాదాపు 10 నిమిషాల వ్యవధిలో, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కీంగీస్ బార్, అంతే కాకుండా గ్రిల్ రెస్టారెంట్‌లో కాల్పులు జరిపి, ఎనిమిది మంది వ్యక్తులు కాల్పుల్లో మరణించారని నివేదికలు అందాయి.

రోగులలో ఒకరిని మినహాయించి అందరినీ సెంట్రల్ మైనే (Maine) మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. గురువారం సాయంత్రం వరకు ఎనిమిది మంది రోగులు అక్కడే ఉన్నారు, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ కి సంబంధించిన అధ్యక్షుడు స్టీవెన్ లిటిల్సన్ విలేకరులతో చెప్పడం జరిగింది. ఇప్పుడు సంబంధించిన 18 మరణాలు.. సాధారణంగా మైనే (Maine)లో నిజానికి సంవత్సరంలో అప్పుడప్పుడు సంభవించే హత్యల సంఖ్యకు దగ్గరగా ఉండడం గమనార్హం. నలభై ఏళ్ల రాబర్ట్ R కార్డ్ సమీపంలోని US ఆర్మీ రిజర్వ్ బేస్‌లో సార్జెంట్.

అయితే హంతకుడు కొంతమందిని షూట్ (Shoot) చేసి హతమార్చిన అనంతరం, సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా హంతకుడి ఫోటోలను విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన ఫోటోలో, సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో హంతకుడు లోపలికి వస్తున్న సందర్భం కనిపిస్తుంది.

US కోస్ట్ గార్డ్‌తో సహా అనేక రకాల ఏజెన్సీల నుండి వందలాది మంది అధికారులు అంతకుడ్ని వెతికే ప్ర‌య‌త్నాలు చేసారు. కెనడా బోర్డర్ అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. హంతకుడు కార్డ్ (Robert Card), ప్రస్తుతానికి ఆగ్నేయ దిశలో 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిస్బన్‌కు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి య‌త్నించ‌గా అప్ప‌టికే అత‌ను త‌న‌ని తాను షూట్ చేసుకుని చ‌నిపోయిన‌ట్లు గుర్తించారు.