Palestine-Israel: పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం అవసరం.. 

పాలస్తీనా-ఇజ్రాయెల్ (Palestine-Israel) యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే, బుధవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారతదేశం పాలస్తీనా(Palestine) ప్రజలకు తన మద్దతును ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి(United Nations) భద్రతా మండలి సమావేశంలో భారతదేశం పాలస్తీనా (Palestine) ప్రజలకు తన నిరంతర మద్దతును ప్రకటించింది. పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధంపై ఐక్య రాజ్య సమితి తన మొదటి బహిరంగ చర్చను నిర్వహించింది. ఈ సమావేశంలో మెజారిటీ సభ్యులు పాలస్తీనియన్లకు తక్షణ కాల్పుల విరమణ, మానవతా సహాయం గురించి మాట్లాడారు. ఐక్యరాజ్యసమితిలో […]

Share:

పాలస్తీనా-ఇజ్రాయెల్ (Palestine-Israel) యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే, బుధవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారతదేశం పాలస్తీనా(Palestine) ప్రజలకు తన మద్దతును ప్రకటించింది.

ఐక్యరాజ్యసమితి(United Nations) భద్రతా మండలి సమావేశంలో భారతదేశం పాలస్తీనా (Palestine) ప్రజలకు తన నిరంతర మద్దతును ప్రకటించింది. పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధంపై ఐక్య రాజ్య సమితి తన మొదటి బహిరంగ చర్చను నిర్వహించింది. ఈ సమావేశంలో మెజారిటీ సభ్యులు పాలస్తీనియన్లకు తక్షణ కాల్పుల విరమణ, మానవతా సహాయం గురించి మాట్లాడారు. ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి (DPR), రాయబారి ఆర్. రవీంద్ర(Ravindra) మాట్లాడుతూ, “పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి(Security situation) గురించి, పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రాణనష్టం గురించి భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోంది” అని అన్నారు. “ఈ క్లిష్ట సమయంలో భారతదేశం పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయం పంపడం కొనసాగిస్తుంది. ఈ చర్చల పునఃప్రారంభానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నం చేయాలి” అని రాయబారి చెప్పారు.

Also Read: Israel: పోరాడేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వెళ్తున్న ఇజ్రాయిలీలు

హమాస్(Hamas) దాడిని భారతదేశం ఖండించింది. ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendramodi) “ప్రాణ నష్టానికి తన సంతాపాన్ని తెలియజేసిన మొదటి ప్రపంచ నాయకులలో ఒకరు అని అన్నారు. ఉగ్ర దాడులను ఎదుర్కొంటున్న సంక్షోభ సమయం(Crisis time)లో ఇజ్రయేల్ కు భారత్ సంఘీభావంగా నిలబడుతుంది.. బాధితుల కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అని ఐక్యరాజ్యసమితి ప్రతినిథి అన్నారు.

భారతదేశం పాలస్తీనియన్లకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. రాయబారి ఆర్ రవీంద్ర(Ravindra) మాట్లాడుతూ, “భారతదేశం పాలస్తీనా ప్రజలకు మందులతో సహా 38 టన్నుల మానవతా వస్తువులను పంపింది. భారతదేశం(India) ఎల్లప్పుడూ ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు రెండు-రాష్ట్రాల పరిష్కారం కోసం చర్చలు జరిపింది. “ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారం” కోసం భారతదేశం యొక్క నిబద్ధతను కూడా ఆయన పునరుద్ఘాటించారు.

ఈ నెల 7న హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్‌.. హమాస్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న గాజా(Gaza)పై దాడి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య యుద్ధం తీవ్రతరమైంది. దాడులు, ప్రతిదాడులతో ఇప్పటివరకు 4300 మంది పాలస్తీనియన్లు, సాధారణ పౌరులు మరణించారు.

కాగా, ఇజ్రాయెల్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజాకు ఊరట కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు వారం రోజులకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గాజా వాసుల కోసం సహాయ సామగ్రిని తీసుకొచ్చిన ట్రక్కులను ఇజ్రాయెల్‌ అనుమతించింది. దాంతో యుద్ధం మొదలైన రెండు వారాల తర్వాత గాజా తలుపులు తెరుచుకున్నాయి. ఆహారం, నీరు, ఇంధన కొరతతో అల్లాడుతున్న గాజా ప్రజల కోసం రఫా(Rafa) బార్డర్‌ పాయింట్‌ను ఈజిప్టు ఓపెన్ చేసింది. దాంతో నిత్యావసరాలు, మందులతో కూడిన మానవతా సాయంతో వచ్చిన ట్రక్కులు బార్డర్‌ దాటాయి. ఇరవై ట్రక్కులు గాజాలోకి ఎంటరవుతున్న వీడియోలను ఈజిప్ట్(Egypt) ప్రభుత్వం టీవీలో ప్రసారం చేసింది.

Also Read: Israel – Gaza War : బందీలను విడుదల చేసిన హమాస్, నిరాకరించిన ఇజ్రాయెల్

గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ అధీనంలో లేని ఏకైక దారి రఫా మాత్రమే. ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న ఈ దారి నుంచి ట్రక్కులు వచ్చేందుకు తొలుత ఇజ్రాయెల్ అంగీకరించలేదు. దాంతో కొన్ని రోజులుగా మానవతా సాయాన్ని తీసుకొస్తున్న కార్గో విమానాలు, ట్రక్కులు రఫా బార్డర్ వద్దే ఆగిపోయాయి. అమెరికా విజ్ఞప్తి నేపథ్యంలో కేవలం 20 ట్రక్కుల ప్రవేశానికి ఇజ్రాయెల్​ఓకే చెప్పింది.

గాజాలో ఎంటరైన 20 ట్రక్కుల్లోని సామగ్రిని చిన్న చిన్న మోటార్లపై అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, వందలాది ట్రక్కు లు సహాయ సామగ్రితో వారం రోజులకుపైగా ఈజిప్టు సరిహద్దుల వద్ద వేచి చూస్తున్నాయి. అందులో 20 ట్రక్కులను ఇప్పుడు లోపలికి అనుమతించారు. దాంతో గాజా వాసులకు స్వల్ప ఊరట లభించింది. ఇప్పటిదాకా తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక సుమారు 23 లక్షల మంది గాజావాసులు అల్లాడుతున్నారు.