పాకిస్తాన్ కొనాల‌ని  చూస్తున్న సౌదీ యువరాజు !

ఆర్థిక రంగంలో ఇప్పటికే వెనుకబడిన పాకిస్తాన్ కొనేందుకు సౌదీ రాజు చూస్తున్నట్లు పలు వార్తలు బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌదీ కి చెందిన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ 10న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ను కలిసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  పాకిస్తాన్ కొనేందుకు చూస్తున్న యువరాజు: సౌదీ కి చెందిన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ దేశాన్ని కొనేందుకు చూస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి ఆజ్యం పోస్తూ, సెప్టెంబర్ […]

Share:

ఆర్థిక రంగంలో ఇప్పటికే వెనుకబడిన పాకిస్తాన్ కొనేందుకు సౌదీ రాజు చూస్తున్నట్లు పలు వార్తలు బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌదీ కి చెందిన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ 10న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ను కలిసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

పాకిస్తాన్ కొనేందుకు చూస్తున్న యువరాజు:

సౌదీ కి చెందిన యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ దేశాన్ని కొనేందుకు చూస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి ఆజ్యం పోస్తూ, సెప్టెంబర్ రెండోవారంలో, సౌదీకి చెందిన యువరాజు ఇస్లామాబాద్ సందర్శించిందిన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ కేవలం నాలుగు నుంచి ఆరు గంటలు మాత్రమే పాకిస్తాన్లో సమయం గడిపేందుకు చూస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

పాకిస్తాన్ సందర్శన అనంతరం, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశాన్ని కూడా సందర్శించినన్నట్లు ప్రతినిధులు తెలపడం జరిగింది. అయితే పాకిస్తాన్ వెళ్లేందుకు ముఖ్య కారణం అక్కడ ఆర్మీ చీఫ్ ను కలిసేందుకు మాత్రమే కాదని, అక్కడ తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ముఖ్య కారణమని పలు వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు పాకిస్తాన్ లో జరుగుతున్న ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఆర్మీ చీఫ్ మునీర్ పర్యవేక్షణలో జరిగేవని, అయితే గవర్నమెంట్ ఏర్పడిన అనంతరం, ఆర్మీ చీఫ్ మునీర్, అతను కేవలం ఇన్చార్జిగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

ఏది ఏమైనా సౌదీకి చెందిన యువరాజు కేవలం భారతదేశాన్ని సందర్శించే క్రమంలో పాకిస్తాన్ కూడా సందర్శిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం, సౌదీ యువరాజు కచ్చితంగా పాకిస్తాన్ ను కొనేందుకు మాత్రమే చూస్తున్నట్లు, కనిపిస్తోంది అని వాపోతున్నారు.

ఇదిలా ఉండగా మరి కొందరు మాత్రం పాకిస్తాన్ లో కొన్ని పెట్టుబడులు పెట్టేందుకు, ఆర్థికంగా పాకిస్తాన్ దేశాన్ని కాస్త మెరుగుపరిచేందుకు సౌదీ యువరాజు ఇస్లామాబాద్ సందర్శించడానికి వస్తున్నాడని ఊహాగానాలు వేస్తున్నారు. మరోవైపు కొంతమంది పాకిస్తాన్ అధికారులు మాత్రం, సౌదీ అరేబియా కు మరియు పాకిస్తాన్ మధ్య మంచి స్నేహబంధం ఏర్పరచుకునేందుకు మాత్రమే ఆయన పాకిస్తాన్ రావడానికి గల కారణం అంటున్నారు. 

బిజినెస్ విషయంలో సందర్శన:

సౌదీ అరేబియా కు సంబంధించిన ఒక బిజినెస్ పెట్టుబడి గోథర్ రిఫైనరీ ప్రాజెక్ట్ అనేది పాకిస్తాన్ లో నడుస్తున్నందున, దీనికి సంబంధించి పాకిస్తాన్ కి అదేవిధంగా సౌదీ అరేబియాకు మధ్య మంచి స్నేహబంధం ఉందని ప్రపంచానికి తెలియచేయడానికి కూడా సందర్శనకు కారణం అంటున్నారు పలువురు. అంతేకాకుండా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ వంటి పెద్ద సంస్థ ద్వారా మంచి పేరు తెచ్చుకునేందుకు కూడా పాకిస్తాన్ సందర్శించడానికి యువరాజు మక్కువ చూపిస్తున్నట్లు మరి కొంతమంది తమ ఊహాగానాలు బయటపెడుతున్నారు.

అయితే ఈ అపోహలన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ, పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ ద్వారా వెలువడిన స్టేట్మెంట్ ప్రకారం, డిఫెన్స్ అలాగే మిలట్రీ కి సంబంధించి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పెంచుకునేందుకే సౌదీ యువరాజు వస్తున్నట్లు వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి మహమ్మద్ బిన్ సల్మాన్ గత ఏడాదిలోనే పాకిస్తాన్ సందర్శించేందుకు ప్రణాళికలు వేసుకున్నప్పటికీ, కొన్ని కారణాలవల్ల ఆగిపోవలసి వచ్చిందని పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ స్టేట్మెంట్ వెల్లడించింది.

పాకిస్తాన్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే కష్టాలలో ఉన్న పాకిస్తాన్ ను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా డ్రాగన్ దేశం ఎప్పుడు కూడా పాకిస్తాన్ కు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా చైనా పాకిస్తాన్ కు సహాయం చేసేందుకు ముఖ్య కారణం భారత్ ను దెబ్బతీయటమే అంటూ ఉంటారు కొందరు.