టర్మినేట్ చేసినందుకు నష్టపరిహారం ఇవ్వాలని ఎలోన్ మస్క్ పై మేనేజర్ వ్యాజ్యం

టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. దీని ఆకట్టుకునే శ్రేణి, పనితీరు ఇంకా సెమీ అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ ఆటోపైలట్ వంటి ఇన్నోవేటివ్ ఫీచర్స్ ని అందిస్తోంది. టెస్లా అనేది 2003లో ఎలోన్ మస్క్ చే స్థాపించబడిన ఒక అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికల్  క్లీన్ ఎనర్జీ కంపెనీ. ఈ కంపెనీకి ప్రసిద్ధ ఆవిష్కర్త నికోలా టెస్లా అని పేరు పెట్టారు. ఇది కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో ఉంది. టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. […]

Share:

టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. దీని ఆకట్టుకునే శ్రేణి, పనితీరు ఇంకా సెమీ అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ ఆటోపైలట్ వంటి ఇన్నోవేటివ్ ఫీచర్స్ ని అందిస్తోంది.

టెస్లా అనేది 2003లో ఎలోన్ మస్క్ చే స్థాపించబడిన ఒక అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికల్  క్లీన్ ఎనర్జీ కంపెనీ. ఈ కంపెనీకి ప్రసిద్ధ ఆవిష్కర్త నికోలా టెస్లా అని పేరు పెట్టారు. ఇది కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో ఉంది. టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. దీని ఆకట్టుకునే శ్రేణి, పనితీరు ఇంకా సెమీ అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ ఆటోపైలట్ వంటి ఇన్నోవేటివ్ ఫీచర్స్ ని అందిస్తోంది. కంపెనీ సూపర్‌ చార్జర్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇవి టెస్లా వెహికల్స్ ని నిమిషాల్లో ఛార్జ్ చేయగల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లు. టెస్లా యొక్క ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్, ఇంకా బలమైన బ్రాండ్ దీనిని ప్రపంచంలోని అత్యంత విలువైన ఆటోమేకర్‌లలో ఒకటిగా మార్చాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో చాలా కాలంగా స్థిరపడిన ఆటోమేకర్‌లను అధిగమించింది. కాగా టెస్లాలో పనిచేస్తున్న మేనేజర్ సైమన్ ను ఎలోన్ మస్క్ టర్మినేట్ చేశారు. కాగా ఎలోన్ మస్క్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మేనేజర్ సైమన్.

బెంజమెన్ సైమన్ టెస్లాలోని ఎక్స్-సర్వీస్ మేనేజర్. 2021లో మసాచు సెట్స్‌లోని టెస్లా కంపెనీ లో ఫ్లోర్‌లో అధికమైన వేడి కారణంగా ‘ప్రమాదకరమైన ఉష్ణోగ్రతలకు’ చేరుకోవడం వల్ల ఇవి పని పరిస్థితులకు అంత సేఫ్ కాదని తను అనేక సార్లు రిపోర్ట్ చేశారు. టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో అధిక హీట్ వేవ్స్ సంభవించడం వలన అతను తన టెక్నీషియన్‌లను రక్షించడానికి తన సర్వీస్ షాపులలో ఒకదానిలో ఎయిర్ కండిషనింగ్‌ను ఇన్‌స్టాల్ చేయడం చాలా మంచిది అని సూచించారు. ఇంకా చౌక అని రీజనల్ సర్విస్ మేనేజర్ చెప్పగా.. ఆయన సైమన్ తన ఫిర్యాదులను తప్పు పడటంతో పాటు తనకి పనిష్మెంట్ కూడా ఇచ్చారు. అతని పర్యవేక్షణలో ఉన్న ఎనిమిది డీలర్‌ షిప్‌లలో మూడింటి నుండి మేనేజర్ తొలగించబడ్డాడని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ చేసింది. అతను AC ల కోసం ఒత్తిడి చేయడం కొనసాగించిన తర్వాత, చివరికి ప్రతీకారంగా “టెస్లా తన కంపెనీ వాహనాన్ని ఉపయోగిస్తున్నట్లుగా తెలిపింది. 

టెస్లా ఈ కేసులో తప్పు చేయడాన్ని ఖండించింది.   ఫిర్యాదుల ప్రకారం.. టెస్లా యొక్క ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ తనను “ఒకే ఒక ప్రదేశంలో $100,000” ఖర్చు చేయడానికి అనుమతించదని అతని మేనేజర్లు చెప్పిన తర్వాత కూడా తాను తన రిక్వెస్ట్ ని రైజ్ చేయమని సైమన్ కోరారు. ప్రమాదకరమైన వేడి పరిస్థితి మెరుగుపడలేదు ”అని మాజీ మేనేజర్ తరపు న్యాయవాది కాథ్లీన్ డేవిడ్‌సన్ ఫిర్యాదులో రాశారు. కానీ టెస్లా.. సైమన్ భద్రతా ఫిర్యాదులను అసలు పట్టించుకోలేదు. పైగా తనని తప్పుగా టెర్మినేషన్ చేశారని సైమన్ ఆరోపించారు. ఇంకా తను కోల్పోయిన జీతాలు, బెనిఫిట్స్, స్టాక్ ఆప్షన్‌ లను ఇవ్వమని జ్యూరీని కోరారు. ఇంతే కాకుండా అతను ఎదుర్కొన్న ఎమోషనల్ స్ట్రెస్ కి పరిహారం కూడా తాను కోరారు.

కానీ, తనకి చివరికి ఎలాంటి ఉపశమనానికి అర్హత లేదని టెస్లా పేర్కొంది అని కార్ల తయారీదారు యొక్క న్యాయవాది ఆంథోనీ కాలిఫానో పేర్కొన్నారు. ఈ క్లెయిమ్‌ ని ఫెడరల్ కోర్టుకు తరలించాలని ఒక పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసులో సైమన్ $2.7 మిలియన్ నుండి $10 మిలియన్ల మధ్య నష్టపరిహారాన్ని కోరారు.  కాగా ఈ కేసు ఆ రాష్ట్రానికి వెలుపల ఉన్న పార్టీకి సంబంధించిన రాష్ట్ర కోర్టు క్లెయిమ్‌లను మార్చడానికి అవసరమైన థ్రెషోల్డ్ కంటే ఎక్కువగా ఉన్నందున కేసు అక్కడికి చెందినదని కాదని అతను చెప్పారు. కాలిఫానో, టెస్లా తరపు మరో న్యాయవాది నికోల్ చోమియాక్ సాధారణ వ్యాపార వేళల్లో వ్యాజ్యంపై చేసిన అభ్యర్థనలకు ప్రతిస్పందించలేదు.  ఇక ఈ కేసు సైమన్ వర్సెస్ టెస్లా కేసు, 23-cv-10583, US డిస్ట్రిక్ట్ కోర్ట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ మసాచుసెట్స్ (బోస్టన్) గా మారింది.