Ryanair: టికెట్లు బుక్ చేసుకున్నాక.. బయటపడ్డ భర్త వివాహేతర సంబంధం..

ఆ భార్య చేసిన పనితో పేలుతున్న సెటైర్లు..!

Courtesy: Twitter

Share:

Ryanair: యూరోపియన్ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ (European budget airlines) సంస్థ అయిన ర్యానైర్‌లో(Ryanair) ప్రయాణించేందుకు ఓ మహిళ తనకు, తన భర్తకు టికెట్లు బుక్ చేసుకుంది. అయితే విమాన ప్రయాణానికి కొద్ది సేపటి ముందు ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. తన భర్తకే వేరే మహిళతో వివాహేతర సంబంధం(Extramarital Affair) ఉన్నట్టు తెలుసుకుంది.

యూరోపియన్ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ (European budget airlines) సంస్థ అయిన ర్యానైర్‌ (Ryanair )లో ప్రయాణించేందుకు ఓ మహిళ తనకు, తన భర్తకు టికెట్లు బుక్ చేసుకుంది. అయితే విమాన ప్రయాణానికి కొద్ది సేపటి ముందు ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. తన భర్తకు (Husband) వేరే మహిళతో వివాహేతర సంబంధం (Affair) ఉన్నట్టు తెలుసుకుంది. షాకైన మహిళ తన భర్తతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడలేదు. తన టికెట్ డబ్బులు వాపస్(Money back) ఇవ్వడం కుదురుతుందా? అంటూ ఎయిర్‌లైన్స్(Airlines) సంస్థను కోరింది. ఆ మహిళ ప్రశ్నకు ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందించిన విధానం వైరల్ (Viral) అవుతోంది.

కార్లీ(Carly) అనే మహిళ ర్యానైర్‌లో(Ryanair ) ప్రయాణించేందుకు తనకు, తన భర్తకు టికెట్లు బుక్ చేసుకుంది. అయితే తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు కార్లీ తెలుసుకుంది. దీంతో ఆ జర్నీని క్యాన్సిల్(Cancel) చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె `ఎక్స్` (Twitter) ద్వారా ర్యానైర్‌ను సంప్రదించి `హాయ్ ర్యానైర్.. నా భర్తతో కలిసి ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకున్నా. అతడికి వేరే మహిళతో అఫైర్ (Affair) ఉందని ఇప్పుడే తెలిసింది. మీరు టికెట్లు క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇవ్వగలరా? లేదా నా సీటు మార్చగలరా?` అని అడిగింది.

కార్లీ ప్రశ్నకు ర్యానైర్ (Ryanair)సంస్థ ఇచ్చిన రిప్లై చాలా ఫన్నీగా ఉంది. `ఎమోషనల్ బ్యాగేజీకి (Emotional baggage) అదనపు ఖర్చులు చెల్లించాలి కార్లీ` అని రిప్లై ఇచ్చింది. ఈ రిప్లపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ``ఎమోషనల్ బ్యాగేజీ అత్యంత భారమైనది. అదనపు బ్యాగేజీ రుసుము వసూలు చేయాలి`, `ఇది ఆన్‌లైన్‌లో ఉత్తమ కస్టమర్ ఫీడ్`, `ర్యానైర్‌ ల్యాండింగ్‌ల కంటే కఠినమైనది వారి ట్విట్టర్ రిప్లై`, `చాలా క్రూరమైన రిప్లై` అంటూ నెటిజన్లు స్పందించారు.

కొంతకాలం క్రితం, యూరప్‌లో ర్యాన్‌ఎయిర్‌తో (Ryanair) ప్రయాణిస్తున్న ఒక మహిళ విండో సీటు (Window seat) కోసం అదనపు డబ్బు చెల్లించింది, కానీ ఆమె విమానం ఎక్కినప్పుడు, ఆమె సీటుకు కిటికీ లేదు. కలత చెందిన ప్రయాణికురాలు మార్టావర్స్, విమానంలో తనకు లభించిన సీటు చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ట్వీట్‌లో, ఆమె తన నిరాశను ర్యానైర్‌కి (Ryanair) వ్యక్తం చేసింది, "సీరియస్‌గా @ర్యానైర్‌ నేను విండో సీటు కోసం చెల్లించాను అని ట్వీట్‌లో పేర్కొంది.

 ర్యాన్‌ఎయిర్ (Ryanair) సరదాగా ఫోటోకు ప్రతిస్పందిస్తూ, ఎయిర్‌లైన్ వారు ప్రయాణీకుడికి అందించిన విండో సీటు(Window seat) ఇదేనని సూచిస్తూ, ఎమర్జెన్సీ డోర్‌పై (Emergency door) ఉన్న చిన్న వృత్తాకార గ్లాస్ ఓపెనింగ్‌ను ప్రదక్షిణ చేస్తూ తిరిగి చిత్రాన్ని పంచుకున్నారు. ఫైన్ ప్రింట్ (Fine Print) చదవలేని వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఆమె విచారం వ్యక్తం చేస్తోంది" అని సరదాగా అన్నారు. ఈ చమత్కారమైన మార్పిడి ఏడు మిలియన్లకు పైగా వీక్షణలతో విస్తృత దృష్టిని ఆకర్షించింది, మంచి స్వభావం గల టీజింగ్‌లో ర్యానైర్‌కి (Ryanair) యొక్క నైపుణ్యాన్ని హైలైట్ చేసింది. విండో సీటు అభ్యర్థనను తాము నెరవేర్చామని వారు సమర్థించుకున్నారు. ఎయిర్‌లైన్ (Airline) యొక్క ట్విట్టర్ బయో కూడా హాస్యభరితమైన నవీకరణను పొందింది, "మేము సీట్లు విక్రయిస్తాము, విండోలను కాదు" అని గర్వంగా పేర్కొంది. ఈ చిన్న కానీ ఫన్నీ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో కస్టమర్‌లతో ఇంటరాక్ట్ చేయడానికి ర్యానైర్‌(Ryanair) యొక్క ఉల్లాసభరితమైన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.

Tags :