ఫెయిల్ అయిన రష్యా అంతరిక్ష మిషన్

రష్యా పంపించిన మిషన్ అనుకోని దెబ్బతీసింది. సుమారు 47 సంవత్సరాలుగా రష్యా కృషికి మరోసారి భంగం కలిగింది. ల్యాండ్ అవుతుంది అనుకున్న మిషన్ ఒక్కసారిగా చంద్రుడి ఉపరితలంపై కూలిపోవడంతో రష్యా రీసెర్చ్ సెంటర్ నిరాశలో మునిగిపోయింది. సరిగ్గా చంద్రుడు మీదకి వెళ్ళిన అనంతరం చిన్న లోపం కారణంగా, రష్యా మిషన్ కూలిపోయినట్లు సమాచారం. నిరాశలో రష్యా:  లూనా 25 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై కూలిపోవడంతో 47 ఏళ్లలో తమ మొదటి మూన్ ల్యాండింగ్ మిషన్ మీద రష్యా […]

Share:

రష్యా పంపించిన మిషన్ అనుకోని దెబ్బతీసింది. సుమారు 47 సంవత్సరాలుగా రష్యా కృషికి మరోసారి భంగం కలిగింది. ల్యాండ్ అవుతుంది అనుకున్న మిషన్ ఒక్కసారిగా చంద్రుడి ఉపరితలంపై కూలిపోవడంతో రష్యా రీసెర్చ్ సెంటర్ నిరాశలో మునిగిపోయింది. సరిగ్గా చంద్రుడు మీదకి వెళ్ళిన అనంతరం చిన్న లోపం కారణంగా, రష్యా మిషన్ కూలిపోయినట్లు సమాచారం.

నిరాశలో రష్యా: 

లూనా 25 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై కూలిపోవడంతో 47 ఏళ్లలో తమ మొదటి మూన్ ల్యాండింగ్ మిషన్ మీద రష్యా పెట్టుకున్న ఆశలు ఆవిరి అయ్యాయి. అందిన సమాచారం ప్రకారం, రోబోటిక్ ప్రోబ్ ఒక లోపం కారణంగా , మాస్కో సమయం ప్రకారం, ఆగష్టు 19న, మధ్యాహ్నం 2:57 గంటలకు గ్లిచ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ముందు జరిగిన సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను రష్యన్ అంతరిక్ష సంస్థ విడుదల చేయలేదు, ఆగస్ట్ 21న ల్యాండింగ్‌కు దగ్గరగా ఉన్న సందర్భంలో, లూనా 25ను ఎలిప్టికల్ అప్రోచ్ ఆర్బిట్ లో ఉంచే సమయంలో ఇంజిన్ మిస్‌ఫైర్ అవ్వడం వల్ల మిషన్ క్రాష్ జరిగిందని ప్రకటన ద్వారా పేర్కొంది రష్యా. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద బోగుస్లావ్స్కీ బిలం ఉత్తరం.

సరైన ఆర్బిట్ కు చేరుకోవడానికి బదులుగా, మిషన్ లో ఏర్పడిన లోపం కారణంగా వేరే మార్గంలో, చంద్రుడి ఉపరితలం మీదగా క్రాఫ్ట్ వెళ్లిపోవడం క్రాష్ జరగడానికి ముఖ్య కారణం అంటున్నారు. అయితే క్రాష్ తెగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, మిషన్ మీద ప్రభావం చూపించలేకపోయాయి అని వెల్లడించింది రష్యా. ప్రమాదం యొక్క ఖచ్చితమైన కారణాన్ని మరింత వివరంగా తెలుసుకోవడానికి ఇంటర్‌డిపార్ట్‌మెంటల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రష్యా తూర్పు అముర్ ప్రాంతంలోని వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుండి సోయుజ్-2.1b రాకెట్‌ నింగిలోకి ఎగరడం జరిగింది.

భవిష్యత్తులో రష్యన్ మూన్ స్థావరాన్ని నిలబెట్టడానికి, నీటి నిల్వలను వెతకడానికి, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతాలపైకి రీసెర్చ్ కోసం ప్రయోగించిన మొదటి క్రాఫ్ట్ ఇది. ఉక్రెయిన్‌తో ఒక పెద్ద యుద్ధంలో నిమగ్నమై ఉన్నప్పటికీ, రష్యా చేస్తున్న అంతరిక్ష ప్రయత్నాలు, రష్యా సమర్థతను మరోసారి బయటపెట్టాయి. 

అంతరిక్ష పరిశోధన బరిలో భారత్: 

ఇస్రో ద్వారా ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ఇప్పటికే సగం పని పూర్తి చేసుకుందని చెప్పుకోవాలి. ఆగస్టు 5కి ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క కక్ష్య(ఆర్బిట్)లోకి ప్రవేశించి మొదటి విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం చంద్రయాన్-3 తన రెండో స్టెప్ తీసుకుని మరో అడుగు ముందుకు వేసి మరో విజయాన్ని సాధించిందని చెప్పుకోవాలి. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరవుతూ చివరి కక్ష్య (ఆర్బిట్)లోకి ప్రవేశించడానికి, ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించబోతోంది. 

రెండవ మిషన్ పథంలో కీలకమైన దశ ఇది, ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-3 మిషన్ కక్ష్యను మరింత తగ్గించడానికి ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించడం ఇందులో ఉంటుంది. దీని లక్ష్యం 170 కి.మీ x 4313 కి.మీ కక్ష్య (ఆర్బిట్)ను సాధించడం, చంద్రయాన్-3ని దాని చివరి గమ్యస్థానం, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరువ చేయడం. సుమారు 4 వారాలుగా ప్రయాణం చేస్తూ చంద్రయాన్-3 చంద్రుడికి అతి చేరువలోకి చేరింది. అయితే ఆగస్టు 23న చంద్రుడు మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లూనార్ లాండర్ పనితీరు సవ్యంగానే ఉన్నట్లు సమాచారం అందింది. ఇంకో రెండు రోజుల్లో, సాయంత్రం సమయం నాటికి చంద్రుడు మీద, చంద్రయాన్-3 లాండర్ సురక్షితంగా, విజయవంతంగా అడుగుపెట్టే అవకాశం ఉంది అని ఇస్రో తెలియజేస్తుంది.