దొంగతనానికి అని వచ్చి ఖాళీ చేతులతో బయటకెళ్లిన దొంగ

అమెరికా లోని అట్లాంట ప్రాంతం లో ఒక చిన్న నైల్ సలోన్ షాప్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన కి సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అది అసలే దాడులకు నిలయమైన భయంకరమైన ప్రాంతం. అక్కడ 2021 వ సంవత్సరం లో జరిగిన కాల్పుల వల్ల 8 మంది చనిపోయారు. అందులో ఆరు మంది మహిళలు మన ఆసియా ఖండానికి […]

Share:

అమెరికా లోని అట్లాంట ప్రాంతం లో ఒక చిన్న నైల్ సలోన్ షాప్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన కి సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అది అసలే దాడులకు నిలయమైన భయంకరమైన ప్రాంతం. అక్కడ 2021 వ సంవత్సరం లో జరిగిన కాల్పుల వల్ల 8 మంది చనిపోయారు. అందులో ఆరు మంది మహిళలు మన ఆసియా ఖండానికి చెందిన వారే, ఈ సంఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అలాంటి సంఘటన జరిగిన చోట జనాలకు భయాలు ఉండడం సహజమే, కానీ ఒక సలోన్ లో కస్టమర్లు చూపించిన ధైర్యం, తెగువ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియో చూసేందుకు ఫన్నీ గా అనిపించినా స్ఫూర్తిదాయకంగాను ఉంది.

ఎంత బెదిరించినా బెదరని కస్టమర్లు :

ఇక అసలు విషయానికి వస్తే ఒక దొంగ సెలూన్ షాప్ లోకి అడుగుపెట్టి అక్కడ ఉన్న కస్టమర్స్ అందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తాడు. మర్యాదగా చేతులు పైకెత్తి మోకాళ్ళ మీద కూర్చోండి అని బెదిరిస్తాడు. కానీ అక్కడ ఉన్న కస్టమర్స్ మొత్తం ఆ దొంగని ఒక కమెడియన్ లాగ చూసారు, అతడు గొంతు చించుకొని ఎంత బెదిరించినా కూడా తొణకలేదు. దీనితో మెంటలెక్కిపోయిన ఆ దొంగ, ఎలాంటి డబ్బు దొంగతనం చెయ్యలేక, ఉత్త చేతులతో బయటకి వెళ్ళాడు. ఈ సంఘటన లో దొంగ పరిస్థితి చూసిన ప్రతీ ఒక్కరికీ నవ్వు రాక తప్పదు, అదే సమయం లో అక్కడ ఉన్న కస్టమర్స్ చూపించిన ధైర్యం , తెగువకి ఎంత పొగిడినా అది తక్కువే అవుతుంది. జరిగిన సంఘటన గురించి సెలూన్ స్టాఫ్ మీడియా తో మాట్లాడుతూ ‘బ్లూ హ్యాట్ , సన్ గ్లాస్సస్ మరియు బ్లూ జీన్స్ వేసుకొచ్చి ఒక అతను మమల్ని తమ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేసారు, అతని చేతిలో ఉన్న ఆయుధాన్ని చూసి కూడా ఎవరూ భయపడకుండా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా కూర్చుకున్నారు. ఇక డోర్ దగ్గర కూర్చున్న ఇద్దరు అమ్మాయిలను కూడా ఆయన డబ్బుల కోసం బెదిరించాడు, వాళ్ళ నుండి కూడా ఎలాంటి రియాక్షన్ లేకపోవడం తో ఉత్తచేతులతో బయటకి వెళ్ళాడు’ అని చెప్పుకొచ్చింది స్టాఫ్.

సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారిన సీసీటీవీ వీడియో :

ఇక ఈ సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా లేదా అని అడగగా, ఇలాంటివి చూస్తే పాపం ఆ దొంగపై ఆ పోలీసులు కూడా జాలి చూపిస్తారు, సినిమాల్లో కూడా ఇంత తింగరి దొంగని ఎక్కడ చూడలేదు అంటూ నవ్వుతు స్టాఫ్ మీడియా తో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరో పక్క ఈ వీడియో కి ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి, వాట్సాప్ స్టేటస్ లలో కూడా ఈ వీడియో ని షేర్ చేసి తెగ నవ్వుకుంటున్నారు. ఒకవైపు కామెడీ గా అనిపించినా, మరోపక్క ఈ వీడియో ఎంతో మంది అమాయకులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఎలాంటి సంఘటన ఎదురైనా మనం ధైర్యం గా ఉంటే అవతలి వ్యక్తి బయపడుతాడు అనేందుకు నిదర్శనమే ఈ సంఘటన అని చెప్తున్నారు. గత రెండు రోజుల నుండి మన నేషనల్ మీడియా లో కూడా వీడియో తెగ వైరల్ గా మారింది.