2030 నాటికి ధూమపాన రహిత దేశంగా బ్రిటన్..

ఒత్తిడి కారణంగా ఈ మధ్య యువత ఎక్కువగా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. కొన్ని సార్లు చెడు సావాసల కారణంగా కూడా మద్యం, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. దీని వల్ల యువత భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే బ్రిటన్ ప్రభుత్వం త్వరలో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో సిగరెట్లపై నిషేధం విధించాలని రిషి సునాక్ ప్రభుత్వం ఆలోచిస్తుందట. దీనిపై ప్రభుత్వం అధికారంగా వెల్లడించనప్పడికీ దీనిని కచ్ఛితంగా […]

Share:

ఒత్తిడి కారణంగా ఈ మధ్య యువత ఎక్కువగా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. కొన్ని సార్లు చెడు సావాసల కారణంగా కూడా మద్యం, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. దీని వల్ల యువత భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే బ్రిటన్ ప్రభుత్వం త్వరలో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో సిగరెట్లపై నిషేధం విధించాలని రిషి సునాక్ ప్రభుత్వం ఆలోచిస్తుందట. దీనిపై ప్రభుత్వం అధికారంగా వెల్లడించనప్పడికీ దీనిని కచ్ఛితంగా అమలు చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలకు చెందిన వారు కూడా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం అందించడం లేదు, పెదవి విప్పడం లేదు.

తమ దేశాన్ని పొగ రహితంగా మార్చేందుకు బ్రిటన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం భవిష్యత్తు తరం సిగరెట్లు వినియోగించకుండా వాటి అమ్మకంపై త్వరలో నిషేధం విధించేందుకు ప్రణాళికలు రచిస్తోందని బ్రిటన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతేడాది న్యూజిలాండ్ ప్రకటించిన సిగరెట్ బ్యాన్ చట్టాల మాదిరిగానే.. బ్రిటన్ లోనూ చట్టాలను రూపకల్పన చేయాలని రిషి యోచిస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్తు తరం సిగరెట్ల వినియోగించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధించే అంశాన్ని ప్రధాని రిషి సునాక్‌ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

2009 సంవత్సరం జనవరి 1న లేదా ఆ తర్వాత జన్మించిన వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడంపై నిషేధం విధిస్తూ గత సంవత్సరం న్యూజిలాండ్ చట్టం చేసింది. అదే విధమైన చట్టాన్నితీసుకొచ్చే దిశగా సునాక్ సర్కారు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ధూమపాన కట్టడి చర్యలను చేపడుతూ.. 2030 నాటికి బ్రిటన్ ను ధూమపాన రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉచిత వేప్ కిట్‌ల పంపిణీ, గర్భిణులు ధూమపానం చేయకుండా ప్రోత్సహించేలా వోచర్ పథకం అమలుకు సంప్రదింపులు జరుపుతున్నామని యూకే ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ముందు సునాక్ బృందం ధూమపాన నిషేధానికి చర్యలను అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఇక అత్యంత ప్రమాదకర ఇ-సిగరెట్ల నియంత్రణ చర్యల్లో భాగంగా పిల్లలకు ఉచితంగా వేప్‌ కిట్ల శాంపిళ్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మే నెలలోనే రిషి ప్రభుత్వం ప్రకటించింది.

ఇక, గ్లోబల్ అడల్డ్ టొబాకో సర్వే ఇండియా ప్రకారం మన దేశంలో 267 మిలియన్ల మంది పెద్దలు పొగాకును వినియోగిస్తున్నారు. భారతదేశంలో ఏటా 3.5 లక్షల మంది ధూమపానం కారణంగా చనిపోతున్నారు. అనేక పరిశోధనల తరువాత ధూమపానం కంటి చూపును దెబ్బతీస్తుందని బయటపడింది. మాక్యులా క్షీణతకు కారణమవుతుందని తేలింది. మాక్యులా అంటే రెటీనాకు వెనుక భాగంలో ఉండే చిన్న భాగం. ఇది రంగులను గుర్తించేందుకు, ఎదురుగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించేందుకు, కేంద్ర దృష్టికి అవసరం. మాక్యులా ఫోటోరిసెప్టర్ కణాలను కలిగి ఉంటుంది. ఇవి కాంతిని గుర్తించే కణాలు. మాక్యుమా దెబ్బతింటే చూపు మధ్య భాగంలో మచ్చలా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలు కనిపించినా మధ్య భాగంలో ఏమీ కనిపించకుండా ఇలా నల్ల చుక్కలా కనిపిస్తుంది. ధూమపానం కళ్లకు చికాకును కలిగిస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ కు దారి తీస్తుంది. ధూమపానం అధికంగా చేయడం వల్ల వయసు పెరుగుతున్న కొద్దీ మాక్యుమా దెబ్బతినడం, కంటి శుక్లాలు, గ్లాకోమా వంటివి కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు కంటి వైద్య నిపుణులు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పొగుకు ఉత్పత్తులైన సిగరెట్లపై అత్యధికంగా 28 శాతం జీఎస్టీ, 290 శాతం వరకు ఎక్సైజ్ సుంకం విధించింది. అయినా ధూమపానం చేసే వారిపై అంతగా ప్రభావం చూపలేదని, ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఓవరాల్ గా సిగరెట్లపై 64 శాతం పన్ను విధిస్తున్నా, విక్రయాలు, వాడకంలో తగ్గుదల కనిపించలేదు. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ  కూడా సిగరెట్లపై పన్నును 75 శాతానికి పెంచమని కోరాగా ,కేవలం పన్నులు పెంచడం మాత్రమే సరిపోదని స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారుసు మేరకు ఈ-సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని 2019లో నిషేధించారు.