ఇది హ్యాండ్ బ్యాగ్ అంటే న‌మ్ముతారా?

ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ అద్భుత ఆవిష్కరణలలో కొన్ని అత్యధిక ధరలు పలుకుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు 51 లక్షలు పలికిన మైక్రోస్కోపిక్ లూయి విట్ట‌న్ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పుకోవచ్చు.  బ్యాగ్ సైజు ఎంత ఉంటుంది: ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చిన్న బ్యాగ్, నిజానికి 657 x 222 x 700 micrometres మాత్రమే ఉంటుంది. దీన్ని చూడాలంటే తప్పకుండా మైక్రోస్కోప్ ఉపయోగించాలి. అందుకే దీన్ని సొంతం చేసుకోవడానికి […]

Share:

ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ అద్భుత ఆవిష్కరణలలో కొన్ని అత్యధిక ధరలు పలుకుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు 51 లక్షలు పలికిన మైక్రోస్కోపిక్ లూయి విట్ట‌న్ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పుకోవచ్చు. 

బ్యాగ్ సైజు ఎంత ఉంటుంది:

ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చిన్న బ్యాగ్, నిజానికి 657 x 222 x 700 micrometres మాత్రమే ఉంటుంది. దీన్ని చూడాలంటే తప్పకుండా మైక్రోస్కోప్ ఉపయోగించాలి. అందుకే దీన్ని సొంతం చేసుకోవడానికి 51లక్షలు ఖర్చుపెట్టారు. 

లూయి విట్ట‌న్ మోనోగ్రామ్‌ను కలిగి ఉన్న MSCHF హ్యాండ్‌బ్యాగ్ ఇటీవల వేలంలో అమ్ముడుపోయిందని నివేదికలు చెబుతున్నాయి. కళ మరియు సాంకేతికత నైపుణ్యాల కలగలిపి డిజైనర్, ఉప్పు రేణువు కంటే చిన్న  హ్యాండ్‌బ్యాగ్‌ను ఉత్పత్తి చేసినట్లు మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బ్యాగ్ మరొకరి సొంతమైంది. వేలం ఆన్‌లైన్‌లో జరిగింది. నిజానికి ఇది $ 63,000 (సుమారు రూ. 51.6 లక్షలు)కి అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. హ్యాండ్‌బ్యాగ్‌లోని ఎలా ఉంటుంది ఏంటి అని చూడడానికి మనం మైక్రోస్కోప్ ఉపయోగించాల్సి ఉంటుంది. MSCHF తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో హ్యాండ్‌బ్యాగ్ గురించిన వివరాలు మరియు స్నాప్‌లను షేర్ చేసినప్పటి ఇది వైరల్ గా మారింది. సృష్టి లూయి విట్ట‌న్ సృష్టించిన దాంట్లో ఇదే అద్భుతమైన కళాఖండం అని చాలామంది చూపురులు చెప్తున్నారు. 

బ్యాగ్  వివరాలు:

MSCHF వారి ఈ మైక్రో మాస్టర్‌పీస్ నియాన్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీన్ని సూక్ష్మంగా చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే బ్యాగ్ తయారు చేసిన వాళ్ళు ఖచ్చితమైన కుట్లతో ఒక కళాఖండంకా ఈ హ్యాండ్ బ్యాగ్ ను మార్చేశారు. ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఎలా ఉంటుంది ఎన్ని సెపరేషన్స్ ఉంటాయి అనేది చూడాలి అనుకుంటే మనం మైక్రోస్కోప్ లోనే చూడగలుగుతాం. MSCHF హ్యాండ్‌బ్యాగ్ రిలీజ్ చేసినప్పుడు అది చాలా వైరల్ గా మారింది. ఎందుకంటే బ్యాగ్ సైజ్ దీనికి మెయిన్ రీజన్ అని చెప్పాలి. బ్యాగ్ కొలతలు 657 x 222 x 700 మైక్రోమీటర్లు.. ఇది 2-ఫోటాన్ పాలిమరైజేషన్ ప్రింటింగ్ పద్ధతులను ఉపయోగించి సృష్టించబడింది.

హ్యాండ్ బ్యాగ్ వేలం పాట ఎక్కడ జరిగింది: 

జూపిటర్ అనే సంస్థ ద్వారా ఈ హ్యాండ్ బ్యాగ్ వేలం జరిగిందని నివేదికలు వెల్లడించాయి. ఈ ఆన్‌లైన్ వేలం గృహాన్ని అమెరికన్ సంగీతకారుడు మరియు డిజైనర్ ఫారెల్ విలియమ్స్ స్థాపించారు. MSCHF యొక్క చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ కెవిన్ వీస్నర్ దాని మోనోగ్రామ్ మరియు డిజైన్‌ను వేలంపాటలో ఉపయోగించడానికి, విలియమ్స్ మరియు లూయి విట్ట‌న్ల అనుమతిని కోరినట్లు తెలియజేయడం జరిగింది.

MSCHF అనేది 2018లో స్థాపించబడిన ఒక సరిహద్దు-పుషింగ్ ఆర్ట్ మరియు మీడియా సంస్థ.  ఒకవేళ మీకు తెలియకపోతే, అద్భుతమైన మరియు టైని డిజైన్స్ సృష్టించడానికి ట్రాక్షన్‌ను పొందిన కంపెనీ ఇదే. MSCHF నిజానికి దాని ఆవిష్కరణ మరియు ఇంటర్ డిసిప్లినరీ విధానానికి ప్రసిద్ధి చెందింది. బ్రాండెడ్ ఆవిష్కరణలు, వాణిజ్యం మరియు సాంకేతికత యొక్క అంశాలను ఇందులో విలీనం చేసి, ప్రత్యేకమైన మరియు రిఫ్రెష్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ కంపెనీ ద్వారా అనేక మంది ఆవిష్కరణలు బయటికి వచ్చాయి. అందులో ముఖ్యమైనదే ఈ టైని హ్యాండ్ బ్యాగ్. ఈ టైం హ్యాండ్ బ్యాగ్ అత్యధికంగా 51 లక్షలకు అమ్ముడుపోవడం నిజంగా ఆశ్చర్యకరమే.