ఖైదీలను ఎక్స్‌చేంజ్ చేసుకోండి

ఇజ్రాయెల్-పాలస్తీనా (హమాస్ గ్రూప్) యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ యుద్ధం గురించి ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. యుద్ధం వలన ఎటువంటి తీవ్ర పరిణామాలు ఎదురువుతాయోనని అంతా ఆందోళన చెందుతున్నారు. పలు శాంతి సంస్థలు కూడా యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని కోరుతున్నాయి. అనేక మంది అమాయకులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కానీ ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు.  చర్చలు జరుపుతున్న ఖతార్ ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలోకి ఖతార్ ఎంట్రీ ఇచ్చింది. ఖతార్ […]

Share:

ఇజ్రాయెల్-పాలస్తీనా (హమాస్ గ్రూప్) యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ యుద్ధం గురించి ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. యుద్ధం వలన ఎటువంటి తీవ్ర పరిణామాలు ఎదురువుతాయోనని అంతా ఆందోళన చెందుతున్నారు. పలు శాంతి సంస్థలు కూడా యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని కోరుతున్నాయి. అనేక మంది అమాయకులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కానీ ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. 

చర్చలు జరుపుతున్న ఖతార్

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలోకి ఖతార్ ఎంట్రీ ఇచ్చింది. ఖతార్ దేశం ఈ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 36 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని బదులుగా వారు (పాలస్తీనా) కూడా మీ దేశం నుంచి బందీలుగా పట్టుకున్న అమాయకులైన మహిళలను విడుదల చేస్తారని వారు రాయబారం నడుపుతున్నారు. దీనికి సంబంధించి ఖతార్ ఉన్నతాధికారులు హమాస్ అధికారులతో అత్యవసరంగా ఫోన్ కాల్స్ లో సంభాషించినట్లు తెలుస్తోంది. ఖతార్ దేశం శనివారం రాత్రి నుండి యునైటెడ్ స్టేట్స్‌ సమన్వయంతో నిర్వహిస్తున్న చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతున్నట్లు సోర్సెస్ వెల్లడించాయి.  దోహా మరియు గాజాలోని హమాస్ అధికారులతో ఖతార్ టచ్‌లో ఉందట. తీవ్రవాద బృందం శనివారం గాజా నుంచి ఇజ్రాయెల్‌ పై దాడి చేసి 700 మందికి పైగా ఇజ్రాయెలీలను చంపి, డజన్ల కొద్దీ బంధీలుగా తీసుకెళ్లింది. తమ దేశం నుంచి 36 మంది పిల్లలు మరియు మహిళలు ఇజ్రాయెల్ చేతిలో బంధీలుగా ఉన్నారని హమాస్ గుర్తించింది. హమాస్ చేతిలో ఎంత మంది ఇజ్రాయెల్ మహిళలు, పిల్లలు బంధీలుగా ఉన్నారనే విషయంలో స్పష్టమైన లెక్కలు లేవని ఆ సోర్సెస్ పేర్కొన్నాయి. 

సంఖ్యలో స్పష్టత కరువు… 

ఎంత మంది బంధీలుగా ఉన్నారనే విషయంలో స్పష్టత కొరవడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ వార్త కనుక నిజం అయితే అమాయకమైన ప్రజలు విడుదల అవడం మాత్రమే కాకుండా యుద్ధంలో ఎంతో కొంత శాంతి నెలకొంటుందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గాజాలో పట్టుకున్న ఇజ్రాయెల్ బంధీల సంఖ్య కూడా అస్పష్టంగానే ఉంది. అయితే హమాస్ శనివారం మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు సైనికులను స్వాధీనం చేసుకున్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. హమాస్ నియంత్రణలో ఉన్న గాజాలో.. ఇజ్రాయెల్ తన అత్యంత తీవ్రమైన ప్రతీకార దాడులను చేసింది. అక్కడ శనివారం నుంచి దాదాపు 500 మందిని ఇజ్రాయెల్ చంపింది. 2.3 మిలియన్ల ప్రజలు నివసిస్తున్న ఈ సిటీలోకి ఆహారం మరియు ఇంధనాన్ని తీసుకురాకుండా నిరోధించడానికి ఇజ్రాయెల్ సైన్యం అష్ట దిగ్బంధనం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ తెలిపారు.

ప్రయత్నాలు చేస్తున్న ఈజిప్ట్

ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ ల మధ్య పోరాటం మరింత ముదరకుండా ఉండేందుకు ఈజిప్ట్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. అంతే కాకుండా ఇజ్రాయెల్ బంధీల రక్షణ కోసం కూడా ఈజిప్ట్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని ఈజిప్ట్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఈజిప్ట్ ఇజ్రాయెల్‌ ను సంయమనం పాటించాలని మరియు హమాస్ తన వద్ద ఉన్న బంధీలకు ఎటువంటి హాని కలిగించకుండా వారికి రక్షించాలని కోరింది. ఇజ్రాయిలీలు దాడులు మరియు తోటి పౌరుల దిగ్బందనంతో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. బంధీలను విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్‌ లోకి చొరబడటంపై హమాస్‌ మీద ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గుర్రుగా ఉన్నారు. ఆయన బహిరంగంగానే హమాస్ గ్రూప్ కు వార్నింగ్ ఇచ్చారు. మీరు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. అంతే కాకుండా యుద్ధం మీరు మొదలు పెట్టారు కానీ దానికి ముగింపు మేము (ఇజ్రాయెల్) ఇస్తుందని అన్నారు.