మేం దాడి చేయడం మొదలు పెడితే శత్రుశేషం మిగలదు

ఉక్రెయిన్ తో పోరు మొదలుపెట్టి ఏడాది దాటిపోయినా ఇంకా ఫలితం తేలకపోవడంతో రష్యాపై  ప్రపంచ దేశాల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. దీంతోపాటే రష్యాలోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ పై ఒక్కసారిగా రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో దాదాపు 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అక్కడితో ఆగకుండా రష్యా ఇవాళ ఒక శక్తివంతమైన కొత్త వ్యూహాత్మక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అయితే, తమ దేశ రక్షణ విషయంలో వెనుకడుగు […]

Share:

ఉక్రెయిన్ తో పోరు మొదలుపెట్టి ఏడాది దాటిపోయినా ఇంకా ఫలితం తేలకపోవడంతో రష్యాపై  ప్రపంచ దేశాల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. దీంతోపాటే రష్యాలోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ పై ఒక్కసారిగా రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో దాదాపు 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అక్కడితో ఆగకుండా రష్యా ఇవాళ ఒక శక్తివంతమైన కొత్త వ్యూహాత్మక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అయితే, తమ దేశ రక్షణ విషయంలో వెనుకడుగు వేసేదిలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరువైపులా పెద్ద సంఖ్యలో సైనికులతో పాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం నేపథ్యంలో ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, పుతిన్ మరోమారు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.

రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌ మరోసారి అణ్వస్త్రాల ప్రస్తావన తీసుకొస్తూ శత్రువులకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగిస్తున్న రష్యా ఇటీవలే కొత్త మిస్సైల్ ని ప్రయోగించడం సంచలనమవుతోంది. మిస్సైల్ ని ప్రయోగించడం అనేది సాధారణమే కావచ్చు. కానీ…న్యూక్లియర్ ఎక్స్‌ప్లోజన్స్‌కి అవసరమైన ఆయుధాలనూ మోసుకెళ్లగలికే సామర్థ్యం ఈ మిస్సైల్ కి ఉందన్న వార్తలే ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 3 దశాబ్దాలుగా రష్యా ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో ఇలాంటి టెస్ట్‌లు చేయడం కలవర పెడుతోంది. పైగా రష్యా అధ్యక్షుడు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దీనిపై స్పందించారు.

రష్యా తొలిసారి న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన మిస్సైల్  బ్యూరేవెస్ట్నిక్‌ను ప్రయోగించిందని వెల్లడించారు. వేలాది కిలోమీటర్ల మేరకు దూసుకెళ్లే కెపాసిటీ ఈ క్షిపణికి ఉందని వివరించారు. కొత్త తరం అణ్వాయుధాలు సిద్ధం చేసుకోవడంలో కీలకమైన సర్మత్  ఇంటర్‌కాంటినెంటన్ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్‌కి సంబంధించిన పనులూ తుది దశకు చేరుకున్నట్టు స్పష్టం చేశారు. గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. అప్పటి నుంచి పుతిన్ నోట అణ్వస్త్రాల మాట చాలా సందర్భాల్లో వినిపించింది. మరే దేశం కూడా రష్యాపై అణ్వాయుధాలు ప్రయోగించాలన్న ఆలోచనే చేయకూడదన్న పట్టుదలతో ఉన్నారు పుతిన్. అందుకే చాలా సార్లు ఈ వార్నింగ్ ఇచ్చారు. “మాపై దాడి చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే మా మిస్సైల్ ని సిద్ధం చేసుకుంటాం. వందలాది క్షిపణుల్ని వదులుతాం. మేం దాడి చేయడం మొదలు పెడితే శత్రువుల్లో ఒక్కరు కూడా మిగలరు” వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు..! 

1990 నుంచి రష్యా ఇలా అణు ప్రయోగాలు చేయలేదు. అప్పటికే సోవియ్ యూనియన్‌ పతనమైపోయింది. కానీ…ఇప్పుడు మళ్లీ వీటిని యాక్టివ్ చేసేందుకు రెడీగానే ఉన్నామని తేల్చి చెప్పారు పుతిన్. న్యూక్లియర్ టెస్ట్‌లు చేయకూడదన్న కట్టుబాట్లు ఏమీ పెట్టుకోలేదని, తమ పార్లమెంట్‌ ఎప్పుడైనా అందుకు ఆమోదం తెలిపేందుకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. అటు అమెరికా కూడా ఈ ప్రయోగాలు మొదలు పెడితే…రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదముంది. 

ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్…రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు సంచలన నేతలు ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా కిమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధాన్ని సమర్థించారు. పశ్చిమ దేశాలతో పుతిన్‌ చేస్తోంది పవిత్ర యుద్ధం అని కితాబునిచ్చారు. ఉత్తర కొరియా, రష్యా కలిసి పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొంటాయని తేల్చి చెప్పారు.