విచారణకి వచ్చిన ప్రిన్స్ హ్యారీ వ్యక్తిగత వివరాల చోరీ కేసు

తనకి సంబంధించిన వ్యక్తిగత వివరాలను అనుమతి లేకుండా ప్రచురించినందుకు గాను న్యూస్ గ్రూప్ న్యూస్ (NGN) సంస్థ పై ప్రిన్స్ హ్యారీ న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇలా నా వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చెయ్యడం వల్ల చాలా నష్టపోయానని, వెంటనే దీనికి నష్టపరిహారం చెల్లించాలి అంటూ హ్యారీ న్యూస్ గ్రూప్ న్యూస్ రైటర్ పై కోర్టు లో కేసు నమోదు చేసాడు. అయితే హ్యారీ పెట్టిన కేసు చాలా ఆలస్యమైనదిగా పరిగణించి ఆ కేసు ని […]

Share:

తనకి సంబంధించిన వ్యక్తిగత వివరాలను అనుమతి లేకుండా ప్రచురించినందుకు గాను న్యూస్ గ్రూప్ న్యూస్ (NGN) సంస్థ పై ప్రిన్స్ హ్యారీ న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇలా నా వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చెయ్యడం వల్ల చాలా నష్టపోయానని, వెంటనే దీనికి నష్టపరిహారం చెల్లించాలి అంటూ హ్యారీ న్యూస్ గ్రూప్ న్యూస్ రైటర్ పై కోర్టు లో కేసు నమోదు చేసాడు. అయితే హ్యారీ పెట్టిన కేసు చాలా ఆలస్యమైనదిగా పరిగణించి ఆ కేసు ని కొట్టి వేయించే ప్రయత్నాలు NGN సంస్థ చేసింది.అయితే, ఫోన్ హ్యాకింగ్‌కు సంబంధించి హ్యారీ తన క్లెయిమ్‌ను తీసుకురాలేనప్పటికీ, ప్రైవేట్ పరిశోధకుల వినియోగానికి సంబంధించిన అతని ఆరోపణలను వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే విచారణకు వెళ్లాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు నుండి ఎలాంటి తీర్పు రాబోతుందో అని ప్రిన్స్ హ్యారీ తో పాటుగా ఆయన అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.

కేసు నుండి తప్పించుకోవడానికి NGN సంస్థ విశ్వప్రయత్నాలు :

డ్యూక్  యొక్క దావా చాలా ఆలస్యంగా తీసుకురాబడిందని వాదిస్తూ, ఏప్రిల్‌లో కేసును కొట్టివేయడానికి NGN ప్రయత్నించింది మరియు అతను దాని గురించి ముందుగానే తెలుసుకోవాలి. హ్యారీకి మరింత ఎదురుదెబ్బగా, న్యాయమూర్తి అతని వాదనలో భాగంగా రాజకుటుంబం మరియు మీడియా మొగల్ రూపర్ట్ మర్డోచ్ యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల మధ్య జరిగిన ఆరోపించిన రహస్య ఒప్పందం పై ఆధారపడటానికి అనుమతించలేదు. అటువంటి ఒప్పందం ఉనికికి మద్దతు ఇచ్చే ఆధారాలు లేవని కోర్టు భావించింది.హ్యారీ  న్యాయవాదులు NGN ఈ కేసుని అణగదొక్కే ప్రయత్నాలు చాలానే చేస్తుందని 2012 వ సంవత్సరం లోనే హ్యారీ తెలుసుకున్నారు. చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు తాము ఏమి చెయ్యలేదని, కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.

గతంలో కూడా ఆరు సార్లు ఇలాంటి సమస్యలపై పోరాడిన హ్యారీ:

తనకి సంబంధించి ఆరు వివిధ రకాల అంశాల పై ఆయన న్యాయ పోరాటం చేసాడు, అందులో ఇది కూడా ఒకటి.విచారణ తేదీ సమీపిస్తున్న కొద్దీ, ఈ హై-ప్రొఫైల్ కేసు కి సంబంధించిన  ఫలితం మరియు యునైటెడ్ స్టేట్స్‌లో ప్రైవసీ పాలసీ మరియు మీడియా ప్రాక్టీస్‌ల కోసం చాలా మంది ద్రుష్టి ఈ కేసు పై పడింది. మరి జనవరి లో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. వ్యక్తిగత వివరాలను ట్యాప్ చెయ్యడం అనేది చట్టరీత్యా చాలా నేరం. నేరస్తుల ఫోన్స్ ని ట్యాప్ చెయ్యడం వల్ల మేలు జరుగుతుంది, కానీ సమాజం లో ఒక స్థాయిలో బ్రతుకుతున్న వ్యక్తి  ఫోన్ కాల్ సంభాషణలను ట్యాప్ చెయ్యడం ఆ వ్యక్తికీ తీవ్రమైన నష్టమే. దీని పై ప్రిన్స్ హ్యారీ మాట్లాడుతూ ‘న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాను, నా వ్యక్తిగత విషయాలను సేకరించి , నా మీద తప్పుడు రాతలు రాసిన ఏ వెబ్ సైట్ ని, యూట్యూబ్ ఛానల్ ని వదలను. ప్రతీ ఒక్కరికి తగిన శిక్ష పడేలా చేస్తాను. వాళ్ళ టీఆర్ఫీ రేటింగ్స్ మరియు వ్యూయర్ షిప్ కోసం పిచ్చి రాతలు రాసి నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టారు. ఆ నీచమైన వార్తలను నేను కూడా చూడాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.