ప్రిన్స్ హ్యారీ, మేఘ‌న్ మార్కెల్‌పై అక్క‌డ నిషేధం?

4200 డాలర్లు జరిమానా : ప్రిన్స్ హ్యారీ,మేఘన్ మార్క్లే లాస్ ఏంజిల్స్‌లోని ప్రత్యేకమైన ప్రైవేట్ సభ్యుల క్లబ్ నుండి నిషేధించబడలేదు అని రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న కొత్తల్లో  విసెంటే బంగ్లా ని సందర్శించి అక్కడ ఫోటోలు తీసుకున్నందుకు ఈ జంటకి సంవత్సరానికి 4200 డాలర్స్ ఫైన్ కట్టాల్సిందిగా, అలాగే ఆ బంగ్లా లోకి ఇక ఎప్పుడూ కూడా అడుగుపెట్టకూడదని అక్కడి న్యాయ వ్యవస్థ ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఆ […]

Share:

4200 డాలర్లు జరిమానా :

ప్రిన్స్ హ్యారీ,మేఘన్ మార్క్లే లాస్ ఏంజిల్స్‌లోని ప్రత్యేకమైన ప్రైవేట్ సభ్యుల క్లబ్ నుండి నిషేధించబడలేదు అని రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న కొత్తల్లో  విసెంటే బంగ్లా ని సందర్శించి అక్కడ ఫోటోలు తీసుకున్నందుకు ఈ జంటకి సంవత్సరానికి 4200 డాలర్స్ ఫైన్ కట్టాల్సిందిగా, అలాగే ఆ బంగ్లా లోకి ఇక ఎప్పుడూ కూడా అడుగుపెట్టకూడదని అక్కడి న్యాయ వ్యవస్థ ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఆ బంగ్లా సంబంధించిన వారి గోప్యాన్ని బహిర్గతం చేసిన  చర్యగా పరిగణించారు. అయితే సెలెబ్రిటీల రహస్య  ప్రదేశానికి దగ్గరగా ఏదైనా రాహస్య కెమెరాలు వంటివి ఉండడం వల్ల ఈ ఫోటోలు లీక్ అయ్యి ఉండొచ్చు అనే వాదనని ఇప్పుడు తప్పుబట్టింది. ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే కానీ, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవని చెప్పుకొచ్చారు.

అసలు నిజాలు ఇవే :

శాన్ విసెంట్ బంగ్లాస్ ప్రైవసీ పాలసీ ప్రకారం, ఆ ప్రాంతం లో  ఫోటోలు తీసుకొనుట పూర్తిగా నిషిద్ధం. ఈ బంగ్లా లోకి ఫోన్లను తీసుకొని రావొచ్చు కానీ , దాని కెమెరాల లెన్స్ కి స్టిక్కర్లు వేస్తారు, ఎందుకంటే ఫోటోలు తీసుకునేందుకు వీలు లేకుండా చెయ్యాలనే అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ ముఖ్య ఉద్దేశ్యం.  అంతే కాదు ఆ బంగ్లాలో చూసినవాటిని ఇతరులతో చర్చించడం కూడా నిషేధించబడింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే ఈ నియమాలు అతిక్రమించినందుకే వారిపై కేసు నమోదు చెయ్యబడింది.  ఇది ఇలా ఉండగా పాప్, జిల్ ఇష్కానియన్ సెలెబ్రెటీలకు  తెలియకుండా ఫోటోలు తియ్యడం లో నిష్ణాతురాలు. ఈమె గత కొంత కాలం నుండి మేఘన్ కి సంబంధించిన ఫొటోలనుతీస్తూ వచ్చింది.  జూలై 14న కూడా  ఆమె మోంటెసిటో ఫ్లవర్ మార్కెట్‌లో మేఘన్‌ని ఫోటో తీసింది అంటూ చెప్పుకొచ్చింది ఈ  ఫోటోగ్రాఫర్. ఆమె ఎప్పటి నుండో ఈమె మేఘన్ కి సంబంధించిన ఫోటోలను సీక్రెట్ తియ్యడం గమనిస్తూ ఉందట.

మేఘన్ లేటెస్ట్ ఫోటోను ఆమె ఎలా తీసిందో చెప్పుకొచ్చింది, ఆమె మాట్లాడుతూ  ‘నేను గులాబీ మరియు తెలుపు రంగు చారల గోల్ఫ్ కార్ట్‌ని చూశాను, కాటి పెర్రీ తండ్రి పువ్వులు పట్టుకుని దాని పక్కన ఎవరితోనో మాట్లాడుతున్నాడు’ అని జిల్ చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నేను కాటి పెర్రీ తండ్రిని చూడగానే అతనితో ఫోటో దిగే ఛాన్స్ దొరికింది అని తెగ సంబర పడ్డాను , దాంతో వెంటనే నా  కారును పక్కకు తిప్పి,  పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళడానికి  క్రాస్ చేస్తున్నాను. అప్పుడు నీలి రంగు చొక్కా ధరించిన ఈ వ్యక్తి నా కారు ముందు ఉన్నాడు.  నన్ను  చూసి వెనక్కి వచ్చి చెయ్యి చూపిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పాడు. ఇక ఆ తర్వాత నేను కెటి పెర్రీ డాడీ కి ఫోటోలను తీసాను , కానీ అదే సమయం లో అక్కడ ఒక అమ్మాయి మేఘన్ ఫోట్లను తియ్యడం గమనించాను’ అంటూ చెప్పుకొచ్చింది జిల్. అలా ఆ ఫోటోగ్రాఫర్  చేసిన పనికి ప్రిన్స్ హ్యారీ,మేఘన్ ఇన్ని ఇబ్బందులకు గురి అయ్యారు. ఇది ఇలా ఉండగా ఈ దంపతులిద్దరికీ ప్రిన్స్ ఆర్చీ , ప్రిన్స్ లిలిబిట్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలిద్దరినీ కూడా రాజకుటుంబీకులుగా గుర్తిస్తూ సింహాసన అధిష్టాన వారుసలా జాబితాలో 6 ,7 స్థానాల్లో  నిలిచారు. సోషల్ మీడియా లో కూడా ఈ దంపతులిద్దరికీ ఎంతో మంచి క్రేజ్ ఉంది.