కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి నాయకత్వం వహించనున్న ప్రధాన మంత్రి ‘రిషి సునాక్’ మరియు ఆయన భార్య ‘అక్షతా మూర్తి’

ఇంగ్లాండ్ రాజు ‘కింగ్ చార్లెస్’ పట్టాభిషేకం మే 6 న అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఈ పట్టాభిషేకం అనే కార్యక్రమం ఆ దేశ ప్రధాన మంత్రి అయిన రిషి సునాక్ మరియు ఆయన భార్య అయిన అక్షతా మూర్తి సమక్షంలో జరుగుతుంది. ఇంగ్లాండ్ దేశ ఆచారాల ప్రకారం ఆ దేశ రాజు కి జరిగే పట్టాభిషేకం లో యునైటెడ్ కింగ్ డం యొక్క జెండాని మోసే రాయల్ ఎయిర్ ఫోర్స్ క్యాడర్ ని ప్రధాన మంత్రి, ఆయన […]

Share:

ఇంగ్లాండ్ రాజు ‘కింగ్ చార్లెస్’ పట్టాభిషేకం మే 6 న అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఈ పట్టాభిషేకం అనే కార్యక్రమం ఆ దేశ ప్రధాన మంత్రి అయిన రిషి సునాక్ మరియు ఆయన భార్య అయిన అక్షతా మూర్తి సమక్షంలో జరుగుతుంది. ఇంగ్లాండ్ దేశ ఆచారాల ప్రకారం ఆ దేశ రాజు కి జరిగే పట్టాభిషేకం లో యునైటెడ్ కింగ్ డం యొక్క జెండాని మోసే రాయల్ ఎయిర్ ఫోర్స్ క్యాడర్ ని ప్రధాన మంత్రి, ఆయన భార్య అనుసరిస్తారు. వారితో పాటుగా ఇంగ్లాండ్ లో ఉన్న ప్రతి రాజ్యం యొక్క జెండాలను వారి గవర్నర్ జనరల్ మరియు ప్రధాన మంత్రులతో పాటు జాతీయ ప్రతినిధులు తీసుకువెళతారు.” అని బకింగ్‌హమ్  ప్యాలెస్ ఒక ప్రకటనలో  తెలిపింది. కింగ్ చార్లెస్ ఊరేంగింపు సమయంలో వివిధ రాజ్యాల ప్రతినిధులు పాల్గొంటారు.

వారితో పాట గా కింగ్ చార్లెస్, క్వీన్ చార్లెస్‌ని అనుసరిస్తూ వారి ఊరేగింపుకు మార్క్వెస్ ఆఫ్ ఆంగ్లేసీ, డ్యూక్ ఆఫ్ వెస్ట్‌మిన్‌స్టర్, ఎర్ల్ ఆఫ్ కాలెడాన్ మరియు ఎర్ల్ ఆఫ్ డూండీ నాయకత్వం వహిస్తారు, వీరు రాచరిక ఆయుధాలు మరియు ప్రిన్సిపాలిటీ ఆఫ్ ప్రిన్సిపాలిటీ యొక్క ప్రమాణాలను కలిగి ఉంటారు.. ఫ్రాన్సిస్ డైమోక్ రాయల్ స్టాండర్డ్‌ను తీసుకువెళతారని ప్యాలస్ నుంచి వెలువడిన ఒక ప్రకటనలో తెలియపరిచారు.

వచ్చే వారం మే 6 న కింగ్ చార్లెస్‌కు జరిగే పట్టాభిషేక సేవలో అత్యంత పవిత్రమైన సమయంలో పెద్ద తెరను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఆ దేశ రాజుకి జరిగే పట్టాభిషేకం  చేయడాన్ని ప్రపంచం అంతా చూసే విధంగా  చేస్తున్నామని బకింగ్‌హామ్ ప్యాలెస్ శనివారం తెలిపింది. లండన్ లోని వెస్టమిన్స్టర్ అబ్బేలో పట్టాభిషేకం జరిగే ముందు కింగ్ చార్లెస్ కి మూడు వైపులా నుంచి భారీ స్క్రీన్ లు ఏర్పాటు చేయనున్నారు. కింగ్ చార్లెస్ జెరూసలేంలో పవిత్ర తైలంతో ఆయనకి అభిషేకం చేస్తున్నప్పుడు,ఆయన చేతులకి, ఛాతి మీద, తల మీద కవచాలు ఏర్పరుస్తారు.

కింగ్ చార్లెస్ కి జరుగుతున్న ఈ పట్టాభిషేకానికి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రానున్న నేపథ్యంలో వారి భద్రత దృష్ట్యా ఆ దేశ రక్షణ శాఖ వారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. హాలీవుడ్ నుంచి టామ్ క్రూజ్, మరియు ఇతర సూపర్ స్టార్ లు హాజరు కానున్నారు. మన దేశం నుంచి కూడా కొంత మంది సెలెబ్రెటీలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మరి ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న ఈ పట్టాభిషేకాని మన ఇండియన్ ఫ్యామిలీ నుంచి వెళ్లిన వారు ప్రధాన మంత్రి స్థానంలో కూర్చుని, ఆ దేశ రాజ్య ‘రాజు’ ని పట్టాభిషేకితుడిని చేయడం అంటే మాటలు కాదు, ఇంత గొప్ప అరుదైన గౌరవం తీసుకుని వచ్చిన రిషి సునాక్ కి మన దేశం నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ  పట్టాభిషేకాన్ని వీక్షించే వారిలో రాజుకు అతని వారసులకు విధేయత చూపుతూ “మిలియన్ల మంది పాడే కోరస్”లో చేరమని ఆహ్వానించబడతారని నిర్వాహకులు చెప్పారు. మొదటిగా కింగ్ చార్లెస్ పూర్తి పట్టాభిషేకంలో, మహిళా మతాధికారులు ప్రముఖ పాత్ర పోషిస్తారు మరియు రాజు స్వయంగా బిగ్గరగా ప్రార్థిస్తారు. క్రైస్తవ సేవలో ఇతర విశ్వాసాల నుండి వచ్చిన మత పెద్దలు మొదటిసారిగా చురుకైన పాత్రను కూడా చూస్తారు.