న్యూరేమ్‌బెర్గ్ ట్రయల్స్ చివరి ప్రాసిక్యూటర్ బెన్ ఫెరెంజ్ 103 సంవత్సరాల వయసులో మరణించాడు

బెంజమిన్ బెన్ ఫెరెంజ్ ఒక అమెరికన్ న్యాయవాది. ఈయన రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నాజీ యుద్ధ నేరాల పరిశోధకుడు. ఐన్సాట్జ్‌గ్రుప్పెన్ ట్రయల్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీకి చీఫ్ ప్రాసిక్యూటర్.. జర్మనీ న్యూరేమ్‌ బెర్గ్‌ లో US అధికారులు నిర్వహించిన 12 న్యూరెమ్‌ బెర్గ్ ట్రయల్స్‌లో ఈయన కూడా ఒకరు. ఆ తరువాత అతను అంతర్జాతీయ చట్ట నియమం,  అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ స్థాపన కోసం న్యాయవాదిగా చేరారు. 1985 నుండి 1996 పేస్ యూనివర్శిటీలో అంతర్జాతీయ […]

Share:

బెంజమిన్ బెన్ ఫెరెంజ్ ఒక అమెరికన్ న్యాయవాది. ఈయన రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నాజీ యుద్ధ నేరాల పరిశోధకుడు. ఐన్సాట్జ్‌గ్రుప్పెన్ ట్రయల్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీకి చీఫ్ ప్రాసిక్యూటర్.. జర్మనీ న్యూరేమ్‌ బెర్గ్‌ లో US అధికారులు నిర్వహించిన 12 న్యూరెమ్‌ బెర్గ్ ట్రయల్స్‌లో ఈయన కూడా ఒకరు. ఆ తరువాత అతను అంతర్జాతీయ చట్ట నియమం,  అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ స్థాపన కోసం న్యాయవాదిగా చేరారు. 1985 నుండి 1996 పేస్ యూనివర్శిటీలో అంతర్జాతీయ న్యాయశాస్త్రానికి అనుబంధ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.  న్యూరెమ్‌ బెర్గ్ ట్రయల్స్‌లో చివరి ప్రాసిక్యూటర్ గా నాజీ కార్మిక , నిర్బంధ శిబిరాల దురాగతాలను డాక్యుమెంట్ చేసిన బెన్ ఫెరెంజ్ మరణించారు. ఆయన శుక్రవారం రాత్రి ఫ్లోరిడాలోని అసిస్టెడ్ లివింగ్ ఫెసిలిటీలో ఫెరెంజ్ సహజ కారణాలతో నిద్రలో ప్రశాంతంగా మరణించాడని ఆయన కొడుకు డోనాల్డ్ ఫెరెంజ్ శనివారం తెలిపారు.

1920లో రొమేనియాలోని ట్రాన్సిల్వేనియాలో జన్మించిన ఫెరెన్‌జ్ కుటుంబం యూఎస్‌ వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికి చిన్నతనంలోనే అమెరికాకు వలస వచ్చింది. 1943లో హార్వర్డ్ లా స్కూల్ లో పట్టభద్రుడయ్యాడు.  ఆ తర్వాత అమెరికా ఆర్మీలో చేరాడు.  నార్మాండీ బ్యాటిల్ ఆఫ్ ది బల్జ్‌లో మిత్రరాజ్యాల ల్యాండింగ్‌లలో పాల్గొన్నాడు. యుద్ధం తర్వాత, ఫెరెంజ్ న్యాయవాదిగా న్యూయార్క్‌కు తిరిగి వచ్చాడు. కొంతకాలం తర్వాత, న్యూరేమ్‌బెర్గ్ ట్రయల్స్‌లో నాజీలను విచారించడంలో సహాయం చేయడానికి నియమితులయ్యాడు. 

నాజీ-ఆక్రమిత, మొబైల్ డెత్ స్క్వాడ్‌ల సభ్యుల విచారణ చేయడానికి చీఫ్ ప్రాసిక్యూటర్‌గా బెన్ ఫెరేంజ్ ను నియమించారు.  ఒక మిలియన్ కంటే ఎక్కువ మందిని హత్య చేసినట్లు వారు అంచనా వేశారు. ఆ  విచారణలో ఉన్న మొత్తం 22 మంది పురుషులను దోషులుగా గుర్తించారు.  వారిలో 13 మందికి మరణశిక్ష వేశారు. చివరికి నలుగురికి మరణశిక్ష వేశారు.

ఫెరెంజ్ అంతర్జాతీయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్, యుద్ధ నేరాలకు పాల్పడినట్లు గుర్తించిన ప్రభుత్వాల నాయకులను విచారించగల అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యాడు. ఆయన ఈ అంశంపై అనేక పుస్తకాలు రాశాడు.  2002లో నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో స్థాపించిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ స్థాపన కోసం ఆయన వాదించారు. కాగా అనేక ప్రధాన దేశాలు తిరస్కరించడంతో కోర్టు ప్రభావం పరిమితం అయింది.

ఫెరెంజ్‌కు ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అతని భార్య గెర్ట్రూడ్ ఫ్రైడ్ 2019లో మరణించారు.

మారణహోమం, యుద్ధ నేరాల బాధితులకు న్యాయం కోసం ఫెరెంజ్ జీవితాంతం చేసిన కృషి మానవత్వం పట్ల అతని అంకితభావానికి నిదర్శనం. న్యూరేమ్‌బెర్గ్ ట్రయల్స్‌లో జీవించి ఉన్న చివరి ప్రాసిక్యూటర్‌ గా కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అమెరికా హోలోకాస్ట్ మ్యూజియం మారణహోమం,  యుద్ధ నేరాల బాధితులకు న్యాయం కోసం అన్వేషణలో అతని సహకారాన్ని ఇచ్చారు. న్యాయం, మానవతావాదం పట్ల అతని అంకితభావం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.