ఈవెంట్ల ఖర్చును వినూత్నంగా చెప్పిన ఆర్టిస్ట్

పోర్చుగీస్ వీధి కళాకారుడు పోప్ రాక కోసం దేశం ఖర్చు పెడుతున్నా ఖర్చులకు వ్యతిరేకంగా భారీ డబ్బు నోట్ల కార్పెట్‌తో ధనవంతు నిరసన తెలిపాడు. పోర్చుగీస్ ఆర్టిస్ట్ బోర్డలో II, ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొనడానికి వస్తున్న పోప్ ఫ్రాన్సిస్ రాక కోసం, రాష్ట్ర మరియు కాథలిక్ చర్చి చేసిన ఖర్చుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.  వినూత్న నిరసన:  పోర్చుగీస్ ఆర్టిస్ట్ బోర్డలో II, ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొనడానికి వస్తున్న పోప్ ఫ్రాన్సిస్ రాక కోసం, […]

Share:

పోర్చుగీస్ వీధి కళాకారుడు పోప్ రాక కోసం దేశం ఖర్చు పెడుతున్నా ఖర్చులకు వ్యతిరేకంగా భారీ డబ్బు నోట్ల కార్పెట్‌తో ధనవంతు నిరసన తెలిపాడు. పోర్చుగీస్ ఆర్టిస్ట్ బోర్డలో II, ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొనడానికి వస్తున్న పోప్ ఫ్రాన్సిస్ రాక కోసం, రాష్ట్ర మరియు కాథలిక్ చర్చి చేసిన ఖర్చుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. 

వినూత్న నిరసన: 

పోర్చుగీస్ ఆర్టిస్ట్ బోర్డలో II, ప్రపంచ యువజన దినోత్సవంలో పాల్గొనడానికి వస్తున్న పోప్ ఫ్రాన్సిస్ రాక కోసం, రాష్ట్ర మరియు కాథలిక్ చర్చి చేసిన ఖర్చుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వందల వేల మంది యువ కాథలిక్కులు వస్తున్నట్లు సమాచారం. అయితే నిరసనలో భాగంగా పోర్చుగీస్ ఆర్టిస్ట్ జరగబోయే కార్యక్రమ వేదికపైకి చొరబడ్డాడు. అయితే నిజానికి వేదిక ఏర్పాట్ల కోసం €161m ($179) సుమారు ఖర్చు చేసినట్లు అంచనా. పైతే ఖర్చులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆర్టిస్ట్ భారీ €500 నోట్ల కార్పెట్‌ను  ప్రతి ఒక్కరు నడిచి వచ్చే మెట్ల మీద పరిచాడు.

అయితే ప్రతి ఏటా, పోప్ ఫ్రాన్సిస్ ఆగస్ట్ 2-6 నుండి లిస్బన్‌కు వెళ్లి, యువ క్యాథలిక్‌ల ప్రపంచ యువజన దినోత్సవం ప్రపంచ సమావేశానికి హాజరవుతారు. ప్రతి ఏటా కూడా ఈ సమావేశానికి ఎంతోమంది ప్రపంచ దేశాల నుండి ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

అయితే నిజానికి ఎంతోమంది ప్రజలు ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న సమయంలో, ఎంతో ఖర్చు పెట్టి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం సబవేనా అంటూ నిరసనకు దిగాడు కళాకారుడు. అంతేకాకుండా ప్రజల నుంచి వచ్చిన డబ్బునే ఇప్పుడు సమావేశానికి ఖర్చు చేస్తున్నట్లు అతడు వాపోయాడు. నిరసనకు దిగిన కళాకారుడు తన ఇంస్టాగ్రామ్ పోస్టులో ఇదంతా రాసుకోవచ్చాడు. జనవరిలో అధికారిక అంచనాల ప్రకారం ఈవెంట్‌కు 161 మిలియన్ యూరోలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం, కాథలిక్ చర్చి, సిటీ కౌన్సిల్ ఆఫ్ లిస్బన్ మరియు సమీపంలోని లౌర్స్ చెల్లించాల్సి ఉంటుంది.

పోర్చుగల్ పరిస్థితి: 

లక్షలాది మంది పోర్చుగీస్ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నందున, జనవరిలో ప్రభుత్వం 30 మిలియన్ యూరోలు పెట్టిన ఖర్చులో పోర్చుగీస్ రాష్ట్రం నుంచి పక్కకి వెళ్లిన నిధులు గురించి, పోర్చుగీసులో ఉంటున్న అనేక ప్రజా ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు విమర్శించారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో, పోప్ ఫ్రాన్సిస్ రాక కోసం అంతేకాకుండా ఆగస్టులో జరగబోయే సమావేశానికి సంబంధించిన పెట్టుబడి వ్యయాన్ని తగ్గించవలసిందిగా లిస్బన్ సిటీ కౌన్సిల్ బలవంతం చేసింది. అయితే ప్రస్తుతం జరిగిన సంఘటనలో, బోర్డలో II కార్పెట్ గురించి అడిగినప్పుడు, లిస్బన్ మేయర్ కార్లోస్ మొయిడాస్ విలేకరులతో మాట్లాడుతూ, కళాకారుడు తన ఆందోళనలను తన వంతు బయట పెట్టడానికి ఎలాంటి నిరసన ఎంచుకున్నట్లు తెలిపారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇటువంటి నిరసనలు సాధారణమేనని చెప్పారు లిస్బన్ మేయర్. 

ఏది ఏమైనప్పటికీ, దేశం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నందున ఇటువంటి సమావేశాలు ఎంతవరకు కరెక్ట్? దేశం ఎప్పుడైనా ముందుగా ప్రజల గురించి ఆలోచించాలి తప్పస్తే, ఖర్చుని ప్రజల మీద రుద్దడానికి చూడకూడదు. ఇదే ఆ కళాకారుడు తన కళని ప్రదర్శిస్తూ నిరసన తెలిపాడు. మరి ఇలాగైనా ఆ దేశం ఖర్చు గురించి ఆలోచిస్తుందో లేదో చూడాలి..