భారత్, యుఎస్ మధ్య పురోగతికి అది అవసరం అంటున్న ప్రధాని

దేశం ప్రగతి మార్గంలో పయనించాలి అంటే పైప్ లైన్ ఆఫ్ టాలెంట్ అవసరం అని ప్రధాని మోదీ అన్నారు .ప్రథమ మహిళ జిల్ బిడెన్ నిర్వహించిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘స్కిల్లింగ్ ఫర్ ఫ్యూచర్ ఈవెంట్’ లో  మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా మరియు శ్రామిక శక్తి దేశం యొక్క అభివృద్ధికి ఎంతో అవసరమని. భారత్ మరియు యుఎస్ మధ్య ఈ రెండు విషయాల గురించి హైలైట్ చేస్తూ జరిగిన ఈ […]

Share:

దేశం ప్రగతి మార్గంలో పయనించాలి అంటే పైప్ లైన్ ఆఫ్ టాలెంట్ అవసరం అని ప్రధాని మోదీ అన్నారు .ప్రథమ మహిళ జిల్ బిడెన్ నిర్వహించిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘స్కిల్లింగ్ ఫర్ ఫ్యూచర్ ఈవెంట్’ లో  మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా మరియు శ్రామిక శక్తి దేశం యొక్క అభివృద్ధికి ఎంతో అవసరమని. భారత్ మరియు యుఎస్ మధ్య ఈ రెండు విషయాల గురించి హైలైట్ చేస్తూ జరిగిన ఈ ఈవెంట్లో పాల్గొనడం ఆనందంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు.

ఈ సదస్సులో భాగంగా ప్రధానమంత్రి భారతదేశంలో విద్యా, పరిశోధన మరియు ఎంటర్ప్రీనర్షిప్ అభివృద్ధి కోసం చేపడుతున్నటువంటి పలు కార్యక్రమాల గురించి ముచ్చటించారు.ఈనాడు సృజనాత్మకతతో నిండినటువంటి యువతను కలుసుకోవడం మరియు వారితో ముచ్చటించడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని మోదీ అన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌ ( NSF) మరియు భారతదేశము పలు ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తుందని.. ఇటువంటి ఈవెంట్ నిర్వహించినటువంటి ప్రధమ మహిళ జిల్ బిడెన్‌కి  ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

మోదీ స్కిలింగ్ మిషన్ 

ఇండియన్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి స్కిల్లింగ్ మిషన్ గురించి వివరిస్తూ మోదీ యువతకు విద్య నైపుణ్యం మరియు కొత్త ఆవిష్కరణలపై అవగాహన కలిగించి వారి ఉజ్వల భవితకు బంగారు బాట వేయడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.జాతీయ విద్యా విధానం (NEP), విద్యా మరియు నైపుణ్యాన్ని ఏకీకృతం చేయడం ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళుతుంది అని ఆయన అన్నారు.

ఇప్పటికే ఈ స్కిల్లింగ్ మిషన్ ఆధ్వర్యంలో సుమారు 50 మిలియన్ల యువత శిక్షణ పొందారని మరో 15 మిలియన్ల మంది కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బ్లాక్ చైన్స్ కాన్సెప్ట్ పై అత్యాధునిక సాంకేతిక శిక్షణ అందివ్వడం జరుగుతోందని మోదీ పేర్కొన్నారు.

భారత్ మరియు యుఎస్‌ లకు వృద్ధి వేగాన్ని కొనసాగించాలి అంటే కచ్చితంగా యువతలో టెక్నాలజీ పై అవగాహనను పెంచడమే కాకుండా వారికి సరి అయిన విద్యను అందేలాగా చూడాలని ఆయన అన్నారు. ఈ దశాబ్దాన్ని టెక్‌డికేడ్ మార్చడం తన ప్రథమ లక్షమని ఈ సందర్భంగా మోదీ చెప్పారు.

ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలు మరియు అధునాతన సాంకేతికత లో యుఎస్ ముందంజలో ఉందని. మరోపక్క భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువ కర్మాగారం అని మోదీ అన్నారు. భారత్ మరియు యుఎస్ మధ్య జరగనున్న ఈ భాగస్వామ్యం ప్రపంచవృద్దికి ఆనవాళ్లుగా నిలుస్తుందని మోదీ అన్నారు.

జిల్ బిడెన్ మనసులో మాట…

ప్రధానమంత్రిని యుఎస్ కు స్వాగతిస్తూ ప్రథమ మహిళ 

జిల్ బిడెన్ “ఇప్పుడు మోదీ చేసిన అధికారిక పర్యటనతో.. ప్రపంచంలోని పురాతన మరియు అతి పెద్ద ప్రజాస్వామ్యాలను ఒక చోటుకు తీసుకు రావడం కుదిరిందని.. ఇది కేవలం ఒక ప్రభుత్వ పరమైనటువంటి నిర్ణయం కాదు.. రెండు దేశాలకి మధ్య ఏర్పడినటువంటి స్నేహానికి నిదర్శనమని” ఆమె అన్నారు.

కొన్ని సంవత్సరాల స్నేహం తరువాత ప్రస్తుతం తమ రెండు దేశాల మధ్య అవినాభావ సంబంధం ఏర్పడిందని.. ప్రపంచంలో ఎటువంటి సవాళ్లు ఎదురైనా కలిసికట్టుగా రెండు దేశాలు పోరాడుతాయని ఆమె ఈ సందర్భంగా అన్నారు. “మీరు కూడా మాలాగే విద్యను ఎంతో ప్రధాన అంశంగా పరిగణిస్తారని మేము గ్రహించగలము. మీ దేశంలో ముఖ్యంగా ఆడపిల్లలకు అవసరమైనటువంటి విద్యను అందించడంతోపాటు యువతకు టెక్నాలజీ మరియు స్కిల్ డెవలప్మెంట్ అందివ్వడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు మాకు తెలుసు. అందుకే మా విద్యార్థుల కోసం ఇక్కడ రూపొందించినటువంటి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలను మీకు చూపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.”అని జిల్ బిడెన్ ప్రధానిని ఉద్దేశించి చెప్పారు.