పింక్ శవపేటికల ట్రెండ్‌

మార్గోట్ రాబీ-ర్యాన్ గోస్లింగ్ నటించిన “బార్బీ” మూవీ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని దేశాల బార్బీ మూవీ చూసి చాలా ఇన్సూరెన్స్ అవుతున్నారు. పైగా దీనికి పోటీ గా వచ్చిన “ఓపెన్‌హైమర్” కొంచం మేధావుల సినిమాలాగా ఉండటం తో  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను బార్బీ సినిమా ఇంకా ఆకర్షిస్తోంది. సినిమా సక్సెస్‌తో పాటు బార్బీ మార్కెటింగ్ టీమ్ కృషితో “బార్బీకోర్” అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది.  చావు కూడా పెళ్లిలాంటిదే […]

Share:

మార్గోట్ రాబీ-ర్యాన్ గోస్లింగ్ నటించిన “బార్బీ” మూవీ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని దేశాల బార్బీ మూవీ చూసి చాలా ఇన్సూరెన్స్ అవుతున్నారు. పైగా దీనికి పోటీ గా వచ్చిన “ఓపెన్‌హైమర్” కొంచం మేధావుల సినిమాలాగా ఉండటం తో  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను బార్బీ సినిమా ఇంకా ఆకర్షిస్తోంది. సినిమా సక్సెస్‌తో పాటు బార్బీ మార్కెటింగ్ టీమ్ కృషితో “బార్బీకోర్” అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. 

చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్: 

ఆకలి రాజ్యం సినిమాలో డబ్బునోళ్లు చనిపోయినా పెళ్లి వేదికగా జరిగినట్టు, ఇప్పుడు ఆశ్చర్యకరంగా, అంత్యక్రియల శవపేటికలు కూడా ట్రెండ్ని పట్టుకున్నాయి. NY పోస్ట్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం Olivares Funeral Home, బార్బీ నేపథ్య శవపేటికలను పరిచయం చేసింది, “ఇలా మీరు బార్బీ లాగా విశ్రాంతి తీసుకోవచ్చు” అనే ఆకట్టుకునే నినాదంతో గులాబీ రంగుల శవపేటికలను ప్రచారం చేసింది. “జీవితంలో మరపురాని క్షణాల స్పార్క్ మరియు ఎనర్జీ, మన జీవితాలని కథలుగా గుర్తుంచుకోవడానికి మరియు ప్రకాశవంతమైన రంగులతో వేడుక జరుపుకోవడానికి అర్హత ఉన్నావు” అని ఇది రిమైండర్‌గా పనిచేస్తుంది అని కంపెనీ ప్రమోషనల్ క్లిప్ చెప్తోంది. నివాళి అనేది ప్రేమ మరియు మరపురాని జ్ఞాపకాలతో నిండిన వేడుకను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుని రంగుల లోకం సృష్టించాలి అంటున్నారు కంపెనీవారు. 

అంతులేని బార్బీ కోర్ ట్రెండ్: 

మాలూనులానే పుట్టినరోజు నుంచి ఏ ఫంక్క్షన్ కైనా ట్రెండ్ ని థీమ్ గా పెట్టుకుంటున్న జనాల ఆలోచనలని కాష్ చేసుకుంటోంది ఓ కంపెనీ. ఈ ట్రెండ్ ఒక అంత్యక్రియలకి లేదా ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. మెక్సికో, ఎల్ సాల్వడార్ మరియు లాటిన్ అమెరికాలోని వివిధ ప్రాంతాలలోని అంత్యక్రియల సేవపేటికలు వచ్చి జనాలు తమ ప్రియమైన వారికి ప్రత్యేకమైన రీతిలో వీడ్కోలు చెప్పే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు, ఎల్ సాల్వడార్‌లోని అహుచాపన్‌లోని ఆల్ఫా మరియు ఒమేగా ఫ్యూనరల్ హోమ్, అండర్‌టేకర్ ఐజాక్ విల్లెగాస్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది, సుమారు ఒక సంవత్సరం పాటు బార్బీ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ లో ఉండే శవపేటికలను అందిస్తోంది. 

పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, “విల్లెగాస్ ఫునరల్ హోమ్” అనే అంత్యక్రియల శవపేటికలు అందించే కంపెనీ ఈ ప్రత్యేకమైన శవపేటికలపై 30% తగ్గింపును అందించింది. శవపేటిక రూపకల్పన గురించి దాదాపు 40 మంది టీం ప్రత్యేకించి తయారు చేయడం జరుగుతుంది. ఫలితంగా, వారు ఇప్పటికే కనీసం 10 మంది కొత్త క్లయింట్‌లతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు సమాచారం. 

అధిక డిమాండ్, ప్రస్తుతం ఉన్న స్టాక్ అయిపోవడానికి దారితీసింది. బార్బీ చిత్రంలో మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్‌కిన్నన్, సిము లియు, ఇస్సా రే, అమెరికా ఫెర్రెరా మరియు విల్ ఫెర్రెల్ వంటి స్టార్-స్టడెడ్ పెద్ద పెద్ద తారలు నటించిన ఒక ప్రత్యేకమైన సినిమా. అయితే మరి కొంతమంది నేటిజన్లో శవపేటికల విషయంలో బార్బీ ట్రెండ్ ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం చాలామంది ఈ ట్రెండ్ ఫాలో అవుతూ తమ కావాల్సిన వారి అంత్యక్రియల సమయంలో వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్రెండ్ సృష్టిస్తున్న సినిమాని ఇంకా మీరు చూడకపోతే, ఓ లుక్ వెయ్యండి.