నౌరూజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు? ఈ పండుగప్రత్యేకత ఏమిటి?

నౌరూజ్ ప్రత్యేకత.. నౌరోజ్ లేదా నౌరుజ్ అంటే  “కొత్త రోజు”.. నౌరూజ్ అనేది ఇరానియన్ నూతన సంవత్సరం పేరు. దీనిని పెర్షియన్  నూతన సంవత్సరం అని కూడా పిలుస్తారు. దీనిని ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ఇరానియన్ లు జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ప్రత్యేకంగా ఇరాన్,ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్, కుర్దిస్తాన్లలో జరుపుకునే సాంస్కృతిక, సాంప్రదాయ పండుగ. నౌరుజ్  అనే పదానికి ఫర్సియన్ భాషలో కొత్త రోజు అని అర్థం., ఇది ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం యొక్క […]

Share:

నౌరూజ్ ప్రత్యేకత..

నౌరోజ్ లేదా నౌరుజ్ అంటే  “కొత్త రోజు”.. నౌరూజ్ అనేది ఇరానియన్ నూతన సంవత్సరం పేరు. దీనిని పెర్షియన్  నూతన సంవత్సరం అని కూడా పిలుస్తారు. దీనిని ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ఇరానియన్ లు జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ప్రత్యేకంగా ఇరాన్,ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్, కుర్దిస్తాన్లలో జరుపుకునే సాంస్కృతిక, సాంప్రదాయ పండుగ. నౌరుజ్  అనే పదానికి ఫర్సియన్ భాషలో కొత్త రోజు అని అర్థం., ఇది ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం యొక్క మొదటి రోజున సూచిస్తుంది.

నౌరూజ్ రోజున సాధారణంగా మార్చి 20 లేదా 21 లేదా 22న జరుపుకుంటారు. ఇది వసంత విషవత్తు రోజు యొక్క ఖచ్చితమైన క్షణం ఆధారంగా ఇది ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. భూమి యొక్క కక్షా, ఇతర ఖగోళ కారకాల కారణంగా వసంత విశ్వతు యొక్క ఖచ్చితమైన సమయం, సంవత్సరానికి కొద్దిగా మారుతుంది. కాబట్టి నౌరూజ్ తేదీ కూడా ప్రధాన గణంగా మార్చవచ్చు. అయితే మార్చి 20 లేదా 21 నౌరూజ్ వేడుకలకు అత్యంత సాధారణ తేదీలు.  అనేక దేశాలలో అధికారిక సెలవుదినంగా కూడా గుర్తించబడింది. ఇది 13 రోజులపాటు కొనసాగుతుంది. ఈ పండుగ 3000 సంవత్సరాల కంటే పూర్వకాలం నాటిది. అంతేకాకుండా   పురాతన ఫర్షియన్ మతమైన జొరాసియానిజంలో మూలాలను కలిగి ఉంది.

ఇది పచ్చిమ ఆసియా,  మధ్య ఆసియా, కాకసస్, నల్ల సముద్రం, బేసిన్, బాల్కండ్లలో 3000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచే జరుపుకుంటున్నారు.ఇది ఇరానియం క్యాలెండర్లో మొదటి నెల, మొదటి రోజు కూడా.  ఈ పండుగ మనిషి యొక్క పునర్జన్మను, స్పృహ, శుద్ధీకరణతో ప్రకృతి యొక్క స్వచ్ఛమైన ఆత్మలు హృదయం యొక్క పరివర్తనను నొక్కి చెబుతాయి. ఈ పండుగ సమాజానికి ప్రత్యేక వాతావరణాన్ని అందిస్తుంది.ఎందుకంటే నూతన సంవత్సర సెలవులు ప్రారంభంతో ప్రజలు చూపించే ఆనందం, ఉత్సాహం ఏడాది పొడవునా కనిపించదు.

ప్రకృతి పండగ..

భారతదేశంలో కూడా అఖండ భారత దేశంలో చైత్రమాసం తొలిరోజు లేదా చైత్ర శుద్ధ పాడ్యమి ఇదే. ఉగాది లేదా యుగాది పండుగ రోజు. దీనిని హిందూ నూతన సంవత్సరం అంటారు. ప్రాథమికంగా ప్రకృతి ప్రేమకు సంబంధించిన వేడుక ప్రకృతి ఎదుగుదల ఉల్లాసం తాజాదనం పచ్చదనం,ఉత్సాహం యొక్క విశాల దృశ్యాన్ని అందిస్తోంది. పురాతన సంప్రదాయాలు, ఆచారాలతో నౌరూజ్ ఇరాన్లలోనే కాకుండా కొన్ని పొరుగు దేశంలో కూడా జరుపుకుంటున్నారు.

 అంతేకాకుండా భారతదేశంలోని ఫార్సి కమ్యూనిటీ వంటి కొన్ని ఇతర జాతి- భాషా సమూహాలు కూడా దీనిని కొత్త సంవత్సరం ప్రారంభంగా జరుపుకుంటారు. నౌరూజ్ సమయంలో ప్రజలు తమ ఇళ్లను  శుభ్రపరుస్తారు. ప్రత్యేక ఆహారాన్ని తయారుచేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బంధువులు, స్నేహితులను సందర్శిస్తారు. దీనితోపాటు కొత్త బట్టలు కూడా కొనుగోలు చేస్తారు. ఇది  దాదాపు ఇరాన్ లోని ప్రతి ఇంటిలో జరుపుకుంటారు. ఇది ఒక విధంగా జాతీయ సాంప్రదాయ పండుగగా మారింది. ముఖ్యంగా ఈ పండుగరోజున ఎటువంటి బీదవారైనా కూడా  కనీసం ఒక జత బట్టలైనా కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రజలు గత సంవత్సరాన్ని ప్రతిబిం నుంచే సమయం కొత్త సంవత్సరం కోసం తీర్మానాలు చేయడం, కుటుంబం సంఘం,వ్యక్తిగత ఎదుగుదల పట్ల వారి నిబద్ధతను పునరుద్ధరించడం ఇది సంతోషకరమైన, అర్థవంతమైన వేడుక అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది వసంతకాలం యొక్క ఆశ, పునరుద్ధరణను స్వీకరించడానికి ప్రజలను ఒకచోట చేర్చుతుంది.

Tags :