ఈ రకమైన ఉద్యోగాలు చేసే వారు సంతోషంగా లేరట.. హార్వర్డ్ సర్వే చెప్పిన నిజాలు..

మీ పని ఏది? మనం చేసే ఉద్యోగం మనకి సంతోషాన్ని ఇవ్వకపోతే.. ఆ డబ్బులు సంపాదించినా కూడా వంట బట్టదు..  ఇది ఇప్పటి మాట కాదు పెద్దలు నానాటి నుండి చెబుతున్న మాట.. ఇప్పుడు అదే విషయాన్ని తాజాగా పరిశోధనలు చేసి హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. ఎలాంటి ఉద్యోగాలు చేసేవారు వారి ఉద్యోగ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారో ఓ నివేదిక తెలిపింది.. ఏ ఉద్యోగాలు చేసే వాళ్ళు సంతోషంగా ఉండట్లేదో..?? ఆ వివరాలు చూద్దాం..  ప్రపంచ నలుమూలల […]

Share:

మీ పని ఏది?

మనం చేసే ఉద్యోగం మనకి సంతోషాన్ని ఇవ్వకపోతే.. ఆ డబ్బులు సంపాదించినా కూడా వంట బట్టదు..  ఇది ఇప్పటి మాట కాదు పెద్దలు నానాటి నుండి చెబుతున్న మాట.. ఇప్పుడు అదే విషయాన్ని తాజాగా పరిశోధనలు చేసి హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. ఎలాంటి ఉద్యోగాలు చేసేవారు వారి ఉద్యోగ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారో ఓ నివేదిక తెలిపింది.. ఏ ఉద్యోగాలు చేసే వాళ్ళు సంతోషంగా ఉండట్లేదో..?? ఆ వివరాలు చూద్దాం.. 

ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 85 ఏళ్లుగా హార్వర్డ్ స్టడీ చేసి.. ప్రజలు సంతోషంగా ఉండని ఉద్యోగాలపై సర్వే చేసింది. ఇందులో సుమారు 700 మందికి పైగా పాల్గొనగా.. ఇందులో కొత్త విషయం తెలిసింది. సాధారణంగా ఈ విషయాన్ని అంతా భావించి ఉండకపోవచ్చు. సంతోషంగా, ఆరోగ్యకరంగా, సుదీర్ఘకాలం జీవించేందుకు సీక్రెట్.. ఎక్కువ కారణం డబ్బు, ప్రొఫెషనల్ సక్సెస్, ఎక్సర్‌సైజ్, హెల్తీ డైట్ ఇలా ఏదో అనుకుంటారు కాదట. పాజిటివ్ రిలేషన్‌ షిప్స్ అని తెలిసింది. ఇందులో పాల్గొన్న వారిని ప్రతీ రెండేళ్లకు ఒకసారి వారి జీవితం గురించి ప్రశ్నలు అడిగింది హార్వర్డ్ స్టడీ..  ఇందులోనే ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఇంకా సంతోషం కలిగించని, అసంతృప్తిగా ఉండే ఉద్యోగాలపైనా సర్వే చేయగా ఏం తేలిందో తెలుసా.?

ఒంటరి ఉద్యోగాలు వ్యర్థం.. 

సాధారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు, తక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు, ఒత్తిడి ఉన్న జాబ్స్ వంటివి అసంతృప్తి కలిగించే ఉద్యోగాలు అని మనం అనుకుంటాం. కానీ.. మనుషులతో ఎక్కువగా మాట్లాడే అవకాశం లేని ఉద్యోగాలు, సహోద్యోగులతో పరిచయాలు పెంపొందించుకోవడం అవసరమే లేని ఉద్యోగాలు సాటిస్ఫాక్షన్ ఇవ్వడం లేదని   ఈ హార్వర్డ్ సర్వేలో తేలింది. ఈ కోవకి వచ్చేవే ఇవి ఒంటరి ఉద్యోగాలు..

నలుగురితోనే ఉద్యోగం ఆనందం..

నలుగురితో మాట్లాడుతూ సంతోషంగా చేసుకునే పని ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తుందట.  పనిచేసే చోట ఇతరులతో కనెక్ట్ కలిసి మాట్లాడుకుంటూ ఆ పనిని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని.. అప్పుడే సంతోషంగా ఉండి ఎక్కువ పనిచేసేందుకు అవకాశం ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల కంటే కూడా ఆఫీసులకు వెళ్లి నలుగురితో కలిసి కలివిడిగా చేసే ఉద్యోగాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఈ ఉద్యోగాలు చేసే వారికి అసంతృప్తి..

ఒంటరి ఉద్యోగాలు అంటే ఏంటో అనుకుంటారేమో.. ఆ ఉద్యోగాలు ఇవే నంటూ కూడా ఈ సర్వే తెలిపింది.  ఎక్కువగా ప్యాకేజీ, ఫుడ్ డెలివరీ సర్వీసుల్లో పనిచేసేవారి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వీళ్ళకి ఇతరులతో కలిసి, మాట్లాడి వారి బాగోగులను పంచుకునే అవకాశం పెద్దగా ఉండదు. ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆన్‌లైన్ రిటైల్‌లో కూడా ఇలాగే షిఫ్టుల్లో ఒక్కొక్కరిగా చేస్తుంటారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. అంతేకాదండోయ్.. నైట్ సెక్యూరిటీ ఉద్యోగాలు, ట్రక్కు డ్రైవర్ ఉద్యోగాలు, ఓవర్ నైట్ షిఫ్టులు ఇలా ఇవన్నీ కూడా ఒంటరి ఉద్యోగాల కిందికే వస్తాయి. ఇక్కడే ఇతరులతో పెద్దగా మాట్లాడే అవకాశాలు ఉండవు. ఇలాంటి ఉద్యోగాల వలన ఉద్యోగాలు చేసే వారికి సంతోషం ఉండటం లేదని హార్డ్ వర్క్ సర్వే తేల్చి చెప్పింది.