పఠాన్‌కోట్ దాడి సూత్రధారి మృత్యువాత

మొన్న కెనడాలో జరిగిన ఒక టెర్రరిస్ట్ మృత్యువాత పడిన సంఘటన విధంగానే మరొక సంఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది.  పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన షాహిద్ లతీఫ్‌ను బుధవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.  పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి మృత్యువాత:  ఫజర్ ప్రార్థన అనంతరం పంజాబ్‌లోని దస్కాలోని నూర్ మదీనా మసీదు సమీపంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు, లతీఫ్‌తో పాటు అతని ఇద్దరు సహచరులను కాల్చిచంపారు. […]

Share:

మొన్న కెనడాలో జరిగిన ఒక టెర్రరిస్ట్ మృత్యువాత పడిన సంఘటన విధంగానే మరొక సంఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది.  పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన షాహిద్ లతీఫ్‌ను బుధవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 

పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి మృత్యువాత: 

ఫజర్ ప్రార్థన అనంతరం పంజాబ్‌లోని దస్కాలోని నూర్ మదీనా మసీదు సమీపంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు, లతీఫ్‌తో పాటు అతని ఇద్దరు సహచరులను కాల్చిచంపారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.41 ఏళ్ల షాహిద్ లతీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (జెఇఎం) సభ్యుడు. అంతేకాకుండా మరి ముఖ్యంగా జనవరి 2, 2016 న ప్రారంభించిన పఠాన్‌కోట్ దాడి వెనుక ప్రధాన సూత్రధారి షాహిద్ లతీఫ్.

అతను సియాల్‌కోట్ అన్ని విషయాలను వెనుక నుంచి నడిపించాడు. మరి ముఖ్యంగా దానిని అమలు చేయడానికి నలుగురు జెఎమ్ ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌కు పంపాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాలచట్టం (UAPA) కింద తీవ్రవాద ఆరోపణలపై నవంబర్ 1994లో లతీఫ్ భారతదేశంలో అరెస్టు అరెస్ట్ అయ్యాడు. అయితే ఆయన మీద నేరారూపణ ఉన్న క్రమంలో విచారణ జరపగా చివరికి జైలు పాలయ్యాడు. అతను మసూద్ అజార్‌తో కలిసి జమ్మూలోని కోట్ బల్వాల్‌లో 16 సంవత్సరాలు గడిపాడు. 2010లో విడుదలైన తర్వాత లతీఫ్ పాకిస్తాన్‌లోని జిహాదీ ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లాడని, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ తెలిపింది. అతన్ని వాంటెడ్ టెర్రరిస్టుగా భారత ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అంతేకాకుండా, 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన కేసులో కూడా లతీఫ్‌పై ఆరోపణలు ఉన్నాయి. 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ హత్య: 

గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలియజేశారు. ఇప్పుడు కెనడా దేశానికి చెందిన పోలీసులు సర్రేలో ISI ప్లాంట్ కి సంబంధించిన రాహత్ రావ్ ఆఫీసులను సోదాలు చేయడమే కాకుండా.. రాహత్ రావ్ని రెండు గంటలు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఒక బ్లాగర్ ఇదంతా చైనా చేస్తున్న కుట్ర అంటూ పలు ఆధారాలతో బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు, ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. 

అయితే దేశ పరువు తీయడానికి ట్రూడో చేసిన ప్రయత్నంపై భారత రాజకీయ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. బెదిరింపులకు దిగడమే కాకుండా, ప్రస్తుతం కెనడా, భారతదేశానికి ఒక వైపు నుంచి హాని కలిగించాలి అనుకునే కొన్ని దేశాలు చైనా, రష్యా, టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలతో జతకట్టడానికి ప్రయత్నిస్తుంది. ఒబామా పరిపాలనలో 2013 చట్టం ప్రకారం US కూడా అదే ప్రింప్షన్ సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది.

ఏది ఏమైనప్పటికీ, ట్రూడో ఆరోపణలకు ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పడం జరిగింది భారత జాతీయ భద్రతా స్థాపన. అంతర్జాతీయ చట్టాల పరిధిలో ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటుందని స్పష్టంగా తెలుస్తోంది. నిజ్జర్‌ను కాల్చిచంపడంతో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, ఖలిస్తానీ రాడికల్‌లు విదేశాల్లో లేదా భారతదేశంలోని భారతీయ ఆస్తులకు ముప్పు కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవడం కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. అంతేకాకుండా నిజానికి భారతదేశం వెనక్కి తగ్గడం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీయనివ్వదని స్పష్టమవుతోంది.