కెన‌డాలో ఇండియ‌న్ విద్యార్థులు.. ఆందోళ‌న‌లో త‌ల్లిదండ్రులు

ఇండియా కెన‌డాల మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య వాతావరణం మరీ దారుణంగా తయారయింది. ప్రపంచంలోనే గొప్ప శక్తిగా ఎదుగుతున్న భారత్ తో ఇలా కయ్యం పెట్టుకోవడం కెనడాకు అంత మంచిది కాదని అనేక మంది దేశాధినేతలు అంటున్నారు. అయినా కానీ కెనడా మాత్రం తన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఖలిస్థానీ విషయంలో కెనడా భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసింది. తమకు ఎంత బలం ఉన్నా కానీ […]

Share:

ఇండియా కెన‌డాల మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య వాతావరణం మరీ దారుణంగా తయారయింది. ప్రపంచంలోనే గొప్ప శక్తిగా ఎదుగుతున్న భారత్ తో ఇలా కయ్యం పెట్టుకోవడం కెనడాకు అంత మంచిది కాదని అనేక మంది దేశాధినేతలు అంటున్నారు. అయినా కానీ కెనడా మాత్రం తన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఖలిస్థానీ విషయంలో కెనడా భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసింది. తమకు ఎంత బలం ఉన్నా కానీ బలహీనుల మీద ఆ బలాన్ని ప్రదర్శింపొద్దని భారతదేశం సైలెంట్ గా ఉంటే మనతో పోరాడే బలం లేని కెనడా దేశం మిడిసిపడుతోంది. 

దాంతోనే రచ్చ మొదలు

ఖలిస్థానీలు ఎన్నో రోజుల నుంచి మన భారతదేశాన్ని అతలాకుతలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ లోని ఒక ప్రాంతానికి చెందిన వారు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నారు. వారి కోరికలో నిజాయతీ ఉంటే వారు దేశంలో ఉండి పోరాడాలి కానీ దేశాన్ని విడిచి పెట్టి పోరాటం పేరిట భారత్ మీద తమ అక్కసును వెళ్లగక్కుతూ వస్తున్నారు. ఇటువంటి దుష్ట శక్తులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయి. కెనడాలో ఈ మధ్య ఖలిస్థానీ వేర్పాటు వాద నేత ఇండియాకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఒక ఉగ్రవాదిని ఎవరో చంపేశారు. అతడిని ఎవరో దుండగులు కెనడాలో కాల్చి చంపేశారు. అతడిని కెనడాలో చంపేస్తే కెనడా పోలీసుల వైఫల్యం అవుతుంది కానీ మన భారతదేశం అతడిని ఎలా చంపిందని కెనడా వాదిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. స్వయానా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోనే ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. అతడు కేవలం ఆరోపణలు చేయడం మాత్రమే కాదు.. కెనడాలో ఉన్న ఇండియన్ రాయబారిని కూడా అతడు సస్పెండ్ చేశాడు. దీంతో భారత్ కూడా తమ దేశంలో కెనడా తరఫున సేవలందిస్తున్న రాయబారిని సస్పెండ్ చేసి కెనడాకు గట్టి సంకేతాలు పంపింది. సైలెంట్ గా ఉన్న భారత్ వంటి స్ట్రాంగ్ కంట్రీని అనవసరంగా రెచ్చగొట్టారని కెనడా ప్రధాని మీద అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. 

గాబరా పడుతున్న తల్లిదండ్రులు… 

కెనడాలో మన దేశానికి చెందిన చాలా మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో వారంతా గాబరా పడుతున్నారు. తమ పిల్లలకు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో అని గాబరాపడుతున్నారు.  తమ పిల్లలు తమ జాతీయత ఆధారంగా వివక్ష లేదా పక్షపాతాన్ని అనుభవించవచ్చని వారు ఆందోళన చెందుతున్నారు. కెనడాలో ఉంటున్న ఒక విద్యార్థి తండ్రి మాట్లాడుతూ… నా కుమార్తె ఏడు నెలల క్రితం చదువుకోవడానికి కెనడాకు వెళ్లిందని, నా బిడ్డ కూడా అక్కడ ఆందోళన చెందుతోందని తెలిపాడు. ఆమె తన చదువుపై దృష్టి పెట్టలేకపోతోందని వాపోయాడు. ఇక మరో తల్లి కుల్దీప్ కౌర్ మాట్లాడుతూ… నా ఇద్దరు కుమార్తెలు కెనడాలో ఉన్నారని, ఈ పరిణామాల వల్ల వారు మాత్రమే కాదు  తాను కూడా టెన్షన్‌ గా ఉన్నానని తెలిపారు. ఈ సమస్యను రెండు దేశాలు వీలైనంత త్వరగా ముగించాలని ఆమె కోరారు. ఇరు దేశాల ప్రభుత్వాలు ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలని ఆమె విన్నవించారు. 

ప్రధాని జోక్యం చేసుకోవాలి: ఎంపీ

ఈ వివాదంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టు స్పందించారు. ఆయన మాట్లాడుతూ… దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. అలాగే కెనడాలో చదువుతున్న ఇండియన్ విద్యార్థుల శ్రేయస్సును ప్రధాని కాపాడాలని కోరారు. రెండు దేశాల మధ్య ఈ గొడవలు మొదలయి దాదాపు వారం దాటుతోంది. కెనడా కాలు దువ్వుతుంటే భారత ప్రభుత్వం మాత్రం పెద్దగా ఈ సమస్య మీద కాన్సంట్రేట్ చేసినట్లు అనిపించడం లేదు. ఇక కెనడా దేశంలో ఉన్న ట్రూడో పార్టీ ఎంపీలు కూడా తమ నేత చేసింది తప్పు అని బహిరంగంగా విమర్శిస్తున్నారు. అయినా కానీ అక్కడి ప్రధాని మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. ఎవరు ఎన్ని రకాలుగా వాదించినా కానీ తాను మాత్రం వెనక్కు తగ్గనని ఆయన చెప్పకనే చెబుతున్నారు. కెనడా విషయంలో ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఆ దేశ తీరును తప్పు పడుతున్నాయి.