మరింత పతనమైన పాక్ రూపాయి

గత కొద్ది రోజుల నుంచి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున నడుస్తోంది. అక్కడి ప్రభుత్వ విధానాలు మరియు కొన్ని చర్యల వల్ల ఆ దేశ ఎకానమీ ఘోరంగా పడిపోయింది. పడిపోయిన ఎకానమీని తిరిగా గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ అవి అంతగా సఫలీకృతం కావడం లేదు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రికార్డు స్థాయి పతనం కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ రూపాయి రికార్డు స్థాయిలో పతనం అవుతూనే […]

Share:

గత కొద్ది రోజుల నుంచి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున నడుస్తోంది. అక్కడి ప్రభుత్వ విధానాలు మరియు కొన్ని చర్యల వల్ల ఆ దేశ ఎకానమీ ఘోరంగా పడిపోయింది. పడిపోయిన ఎకానమీని తిరిగా గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ అవి అంతగా సఫలీకృతం కావడం లేదు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రికార్డు స్థాయి పతనం

కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ రూపాయి రికార్డు స్థాయిలో పతనం అవుతూనే ఉంది. కొద్ది రోజుల నుంచి మరింత ఘోరంగా పరిస్థితి మారింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఎన్ని నష్ట నివారణ చర్యలను ప్రారంభించినా కానీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అక్కడ నిత్యావసరాల ధరలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరలతో అక్కడి సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయినా కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో అనేక మంది ఇలా చేయమని అలా చేయమని సలహాలు ఇస్తున్నారు. కానీ ఈ సలహాలు కూడా పాక్ ప్రభుత్వానని గట్టెక్కించడం లేదు. ఇక రీసెంట్ గా పాక్ రూపాయి డాలర్ తో  పోల్చుకుంటే తీవ్రంగా పడిపోయింది. డాలర్ తో పోల్చుకుంటే పాక్ రూాపాయి విలువ ప్రస్తుతం 300.2 గా నమోదైంది. పాక్ రూపాయి చరిత్రలో ఇదే దారుణమైన పతనం.. పాక్ కు స్వాతంత్య్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇలా ఎప్పుడూ జరగలేదని నిపుణులు చెబుతున్నారు.

ఫలించని చర్యలు

ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కానీ అవి అంతగా ఫలించడం లేదు. ఈ చర్యలు ఉపశమనం ఇవ్వడం పక్కన పెడితే అక్కడి ప్రజలను మరింత  ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ చర్యలతో పాక్ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పాక్ ప్రజల మీద అందరూ జాలి చూపిస్తున్నారు. 

ఇండియా తో పోల్చుకుంటే పాక్ ఎక్కడ.. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో పాక్ పౌరుడికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ పౌరుడు మాట్లాడుతూ… మేము (పాక్ ప్రజలు) ఇప్పటికే చంద్రుడి మీద ఉన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ అన్ని ధరలు చుక్కలను అంటుతున్నాయి. కరెంట్ లేదు. ఇక్కడి ప్రజలకు ఏ సదుపాయాలు అందడం లేదని తెలిపారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇండియా చంద్రయాన్-3 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంటే పాక్ మాత్రం ఇలా ఆర్థిక కష్టాలతో పరిస్థితిని వెళ్లదీస్తోంది..

త్వరలోనే ఎన్నికలు

ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. మొన్నటి వరకు ప్రధానిగా సేవలందిచిన వ్యక్తి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్దమవుతున్నాడు. ఇక మరో పక్క చూసుకుంటే ఆ దేశ మాజీ ప్రధాని జైల్లో ముగ్గుతున్నాడు. అంతే కాకుండా పాక్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇవన్నీ కష్టాల మధ్య అక్కడి ఎలక్షన్ కమిషన్ సార్వత్రిక ఎన్నికలను నిర్వహిస్తుందా? లేదా ? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్ కు కూడా ఇంచు మించుగా మనతో పాటే ఫ్రీడమ్ వచ్చింది. కానీ ఇండియా ఎక్కడికో వెళ్తే పాక్ మాత్రం పాతాళానికి పడిపోయింది. ఇలా పాక్ కు ఈ దుస్థితి రావడానికి అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన పద్ధతులే కారణం అని పలువురు అంటున్నారు. పాక్ ఈ దుస్థితి నుంచి ఎన్ని రోజులకు గట్టెక్కుతుందో..