పాక్ మాజీ ప్రధానికి మరో బెంగ

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ కోర్టు షాక్ ఇచ్చింది. అతడి మీద నమోదైన కేసుకు సంబంధించి కీలకమైన తీర్పును ఆ దేశ రాజధానిలోని కోర్టు ఒక రోజు ఆలస్యంగా విననుందని అతని తరఫు న్యాయవాదులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఖాన్ ప్రస్తుతం జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసు విచారణ ఆలస్యం కావడంతో అతడికి ఇది మరింత షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇటీవల తోషఖానా కేసులో దోషిగా […]

Share:

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ కోర్టు షాక్ ఇచ్చింది. అతడి మీద నమోదైన కేసుకు సంబంధించి కీలకమైన తీర్పును ఆ దేశ రాజధానిలోని కోర్టు ఒక రోజు ఆలస్యంగా విననుందని అతని తరఫు న్యాయవాదులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఖాన్ ప్రస్తుతం జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసు విచారణ ఆలస్యం కావడంతో అతడికి ఇది మరింత షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇటీవల తోషఖానా కేసులో దోషిగా తేలాడు. దీంతో కోర్టు అతడికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో అధికారులు అతడిని ఓ జైలుకు తరలించారు. ఈ కేసు మీద పున: విచారణ చేయాలని మాజీ ప్రధాని ఖాన్ అప్పీల్‌ చేసుకున్నాడు. దీంతో ఇతడి అప్పీల్ పై ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం విచారణను పునఃప్రారంభించనుందని అతని న్యాయవాదులు మీడియాకు తెలిపారు.

ఆ కేసులోనే దోషిగా… 

పాక్ క్రికెట్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం తోషఖానా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కొన్ని రోజుల పాటు ప్రధానిగా సేవలందించిన ఇమ్రాన్ ఖాన్ కొన్ని రోజుల క్రితమే తన అధికారం కోల్పోయాడు. దీంతో అతడికి సమస్యలు చుట్టు ముట్టాయి. అతడు ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న బహుమతులకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. దీంతో కోర్టు ఈ కేసులో అతడిని దోషిగా తేలుస్తూ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో కోర్టు అతనికి మొన్నా మధ్యే శిక్షను ఖరారు చేసింది. కానీ ట్రయల్ కోర్టు తన వాదనను వినకుండా శిక్షను విధించిందని ఇమ్రాన్ ఖాన్ తన న్యాయ బృందం ద్వారా అప్పీల్ చేశాడు. తనని విడుదల చేయాలని కోరాడు. కోర్టు అతనికి శిక్ష విధించిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లోని హై-సెక్యూరిటీ జైలులో ఉన్నారు. ఈ జైలులో సరైన వసతులు లేవంటూ అతడి న్యాయవాదులు ఆరోపించారు. అతడిని తక్షణమే ఆ జైలు నుంచి వేరే జైలుకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 

తాను నిబంధనలు ఉల్లంఘించలేదు

ఇమ్రాన్ ఖాన్ బహుమతుల విషయంలో పలు నిబంధనలు ఉల్లంఘించాడనే అవినీతి ఆరోపణలను అతడు ఖండించాడు. అతడు మాట్లాడుతూ.. తాను ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపాడు. విచారణ సందర్భంగా, బాబర్ అవాన్, లతీఫ్ ఖోసా మరియు నయీమ్ హైదర్ పంజుతాతో కూడిన ఖాన్ న్యాయవాద బృందం తమ వాదనలను వినిపించింది. ఇమ్రాన్ ఖాన్ అప్పీల్ తరఫున వ్యతిరేఖంగా వాదించేందుకు తమకు మూడు గంటల సమయం కావాలని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది అమ్జద్ పర్వేజ్ చెప్పడంతో కోర్టు విచారణ వాయిదా పడింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ తరఫు లాయర్లతో పాటు అతడు కూడా నిరాశ చెందాడు.

విడుదలైతే తప్ప.. 

ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయితే తప్ప వచ్చే పాక్ ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఇది తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పార్టీకి పెద్ద దెబ్బే అని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇమ్రాన్ కు శిక్ష పడడం వలన అతని పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని అంతా కామెంట్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది పంజుత ఖాన్ మాత్రం ఇమ్రాన్ ఖాన్ విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా లాయర్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఇమ్రాన్ ఖాన్ విడుదల అయితే తప్ప అతడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అతడి మీద ఎన్నో కేసులు ఉన్నప్పటికీ కూడా పాక్ లో ఇమ్రాన్ ఖాన్ చాలా ఫేమస్ అయ్యాడు. కేవలం రాజకీయాల్లో వచ్చిన తర్వాత మాత్రమే కాకుండా ముందు నుంచే ఇమ్రాన్ అక్కడ ఫేమస్. పాక్ కు వరల్డ్ కప్ అందించిన క్రికెట్ కెప్టెన్ గా ఇమ్రాన్ అందరికీ సుపరిచుతుడే. ఇక ఇమ్రాన్ కనుక జైలు నుంచి విడుదలయితే రాజకీయ ప్రత్యర్థులకు ఇక పెద్ద పోటీ తప్పదని, ఇమ్రాన్ పార్టీ ఫుల్ స్వింగ్ లో ఎన్నికల్లో పాల్గొంటుందని పలువురు చెబుతున్నారు. 

అనర్హత వేటు వేసిన కమిషన్

మన దేశంలో కూడా చాలా మంది నాయకుల మీద కేసులు ఉన్నాయని కేసులుంటే ఎన్నికల్లో పోటీ చేయరాదా అని చాలా  మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆగస్టులో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించి శిక్షను బట్టి ఐదేళ్లపాటు పదవికి పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. పాకిస్తాన్ చట్టాల ప్రకారం, దోషిగా తేలిన ఏ వ్యక్తి కూడా పార్టీకి నాయకత్వం వహించడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదా ప్రభుత్వ పదవిని నిర్వహించడానికి అర్హుడు కాడు. ఈ కారణం చేతే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

అప్పుడే విచారిస్తాం.. 

ఇమ్రాన్ ఖాన్ అప్పీల్ పై సుప్రీం కోర్టు స్పందించింది. ఇస్లామాబాద్ హై కోర్టు తమ తీర్పును వెలువరించిన తర్వాతనే ఈ కేసు విచారణను తాము చేపడతామని తెలిపింది. ఇక మరో పక్క ఆ దేశంలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు వాయిదా వేయాలని ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు కోరుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన సరిగా లేదని వారు ఆరోపిస్తున్నారు. మరి ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్ పార్టీ అభ్యర్థనను లెక్కలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. రాజ్యాంగం ప్రకారం, అక్టోబర్ లేదా నవంబర్‌లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధానిగా అన్వర్-ఉల్-హక్ కాకర్ వ్యవహరిస్తున్నారు. అతడే రోజువారీ వ్యవహారాలను నడుపుతున్నారు.