మెక్సికోలో తీవ్రమైన వడగాలులకు 100 మంది మృతి 

మూడు వారాలుగా మెక్సికో వేడిలో అతలాకుతలమవుతుంది. రికార్డ్ స్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి.ఈ నెలలో మూడు వారాల పాటు కొనసాగిన హీట్ వేవ్ అనేది రికార్డ్ స్థాయిలో ఎనర్జీ గ్రిడ్‌ను దెబ్బతీసింది, కొన్ని ప్రాంతాలలో స్కూళ్లకు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతానికి మెక్షిక ప్రజలు వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తుంది.  మెక్సికో లో వేడి కారణంగా సంభవించిన మరణాలలో 2/3 వంతు మరణాలు జూన్ 18-24 వారంలో సంభవించాయి, అయితే కొన్ని మరణాలు ముందు వారంలో సంభవించాయని, […]

Share:

మూడు వారాలుగా మెక్సికో వేడిలో అతలాకుతలమవుతుంది. రికార్డ్ స్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి.ఈ నెలలో మూడు వారాల పాటు కొనసాగిన హీట్ వేవ్ అనేది రికార్డ్ స్థాయిలో ఎనర్జీ గ్రిడ్‌ను దెబ్బతీసింది, కొన్ని ప్రాంతాలలో స్కూళ్లకు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతానికి మెక్షిక ప్రజలు వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తుంది. 

మెక్సికో లో వేడి కారణంగా సంభవించిన మరణాలలో 2/3 వంతు మరణాలు జూన్ 18-24 వారంలో సంభవించాయి, అయితే కొన్ని మరణాలు ముందు వారంలో సంభవించాయని, మంత్రిత్వ శాఖ తీవ్ర ఉష్ణోగ్రతలపై ఒక నివేదికలో తెలిపింది. గత ఏడాది ఎండాకాలంలో కేవలం ఒకే ఒక మరణం నమోదైనట్లు మెక్సికో తెలుపగా, ఈ సంవత్సరం అత్యధికంగా 100 మంది, అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వీస్తున్న వొడకాల్పులు కారణంగా మరణించారని తెలిపింది. 

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ (122 ఫారెన్‌హీట్)కి చేరుకోవడంతో వీస్తున్న వడగాల్పుల కారణంగా, మెక్సికోలో గత రెండు వారాల్లో కనీసం 100 మంది మరణించారని మెక్సికోలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. మూడు వారాలుగా మెక్సికో వేడిలో అతలాకుతలమవుతుంది. రికార్డ్ స్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి.ఈ నెలలో మూడు వారాల పాటు కొనసాగిన హీట్ వేవ్ అనేది రికార్డ్ స్థాయిలో ఎనర్జీ గ్రిడ్‌ను దెబ్బతీసింది. కొన్ని ప్రాంతాలలో స్కూళ్లకు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతానికి మెక్షిక ప్రజలు వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తుంది.

దాదాపు అన్ని మరణాలు హీట్ స్ట్రోక్‌ కారణంగా సంభవించినట్లు తెలుస్తుంది. కొంత మంది డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. దాదాపు 64% మరణాలు టెక్సాస్ సరిహద్దులోని ఉత్తర రాష్ట్రమైన న్యూవో లియోన్‌లో సంభవించాయి. మిగిలిన మరణాలలో ఎక్కువ భాగం గల్ఫ్ తీరం సమీపంలో ఉన్న తమౌలిపాస్ మరియు వెరాక్రూజ్‌లో సంభవించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అయితే, కొన్ని ఉత్తరాది నగరాల్లో ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోనోరా రాష్ట్రంలో, అకోంచి పట్టణంలో బుధవారం గరిష్టంగా 49 డిగ్రీల సెల్సియస్ (120 ఫారెన్‌హీట్) నమోదైంది. 

అధిక ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదు అవుతున్నాయి?: 

ఇప్పటివరకు చూసుకుంటే, అత్యధిక ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదు అవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అదే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ కు ముఖ్య కారణం ఎయిర్ పొల్యూషన్ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క దేశం ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మరో పక్కనుంచి ఎయిర్ పొల్యూషన్ తారాస్థాయికి చేరుతూనే ఉంది. సరైన నియమాలు పాటించకుండా ఎన్నో వ్యవస్థల ద్వారా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కానీ ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది కానీ, ఆ ప్రచారం అమల్లోకి రావడం మాత్రం కనిపించట్లేదు. 

నియమాలు పాటించకపోవడమే ఈ ఎయిర్ పొల్యూషన్ కి గల కారణాలు. ఇంకా చెప్పాలంటే డిఫారెస్ట్స్టేషన్, అంటే అడవులను అంతకంతకు అంతరింప చేస్తే, ప్రకృతి వైపరీత్యాలు కూడా అంతకంతకు ఎక్కువ అవుతూనే ఉంటాయి. దీనికి  నిదర్శనమే, ఇప్పుడు అకాల వర్షాలు, ఎక్కడబడితే అక్కడ పిడుగులు పాటుతో ప్రజలు మృతి చెందడం, తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా వీస్తున్న వడగాల్పుల వల్ల అతలాకుతలం అవడం. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే, ప్రతి ఒక్కరు కూడా, పొల్యూషన్ తగ్గించడంలో సహకారిగా మారాలి.