ప్రవాస భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులకు గ్రీన్ కార్డ్స్ వల్ల సమస్య ఎదురవతోంది. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలంటే గ్రీన్ కార్డ్ తప్పనిసరి. అలాగని ఈ గ్రీన్ కార్డులను అక్కడి ప్రభుత్వం ఇష్టారీతిన మంజూరు చేయదు. కాబట్టి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కలలు కనే ప్రవాస భారతీయులకు నిరాశే ఎదురవుతోంది. కేవలం భారతీయులని మాత్రమే కాకుండా అనేక దేశాల వారు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ వారిలో చాలా మందికి నిరాశే ఎదురవుతూ […]

Share:

అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులకు గ్రీన్ కార్డ్స్ వల్ల సమస్య ఎదురవతోంది. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలంటే గ్రీన్ కార్డ్ తప్పనిసరి. అలాగని ఈ గ్రీన్ కార్డులను అక్కడి ప్రభుత్వం ఇష్టారీతిన మంజూరు చేయదు. కాబట్టి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కలలు కనే ప్రవాస భారతీయులకు నిరాశే ఎదురవుతోంది. కేవలం భారతీయులని మాత్రమే కాకుండా అనేక దేశాల వారు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ వారిలో చాలా మందికి నిరాశే ఎదురవుతూ ఉంటుంది. అటువంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. 

తల్లిదండ్రుల నుంచి దూరమయ్యే ప్రమాదం 

H-4 వీసా కేటగిరీ కింద USలో భారతదేశానికి చెందిన లక్ష మందికి పైగా పిల్లలు 21 ఏళ్లు నిండినప్పుడు వారి తల్లిదండ్రుల నుండి వేరు చేయబడే ప్రమాదం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. వీసా రకం అది కవర్ చేసే గరిష్ట వయస్సు మరియు గ్రీన్ కార్డుకు అప్లై చేసుకున్న తర్వాత అది ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండడం అనేది ఆందోళనకు గురి చేస్తోంది. గ్రీన్ కార్డ్‌ల మంజూరు ప్రక్రియలో ఆలస్యం కారణంగా యునైటెడ్ స్టేట్స్‌లో లక్ష మందికి పైగా భారతీయ పిల్లలు వారి తల్లిదండ్రుల నుండి వేరు చేయబడే ప్రమాదం ఉందట. ఈ నివేదిక అందర్నీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఇది చూసిన చాలా మంది ప్రవాసీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో చట్టపరమైన శాశ్వత నివాసాన్ని అందించే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌ల కోసం 10.7 లక్షల మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. 

135 సంవత్సరాలకు పైనే

గ్రీన్ కార్డులంటే అమెరికాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అనేక మంది గ్రీన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు. అందుకోసమే ఈ దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తుంటాయి. కానీ ఆ దరఖాస్తులను వెంటవెంటనే క్లియర్ చేయడం అక్కడి అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో వేల సంఖ్యలో అప్లికేషన్లు పెండింగ్ లో పడిపోతున్నాయి. అక్కడ పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లు పూర్తి కావడానికి దాదాపు 135 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. హెచ్-4 వీసా విధానంలో 21 ఏళ్లలోపు వ్యక్తులు USలో ఉండేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉంటుంది. ఇందుకు అనేక మంది దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. గ్రీన్ కార్డ్ దరఖాస్తులను ప్రాసెస్ చేసే సమయానికి, హెచ్-4 వీసా కింద ఉన్న 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు వయస్సు దాటిపోతారని కాటో ఇన్‌స్టిట్యూట్‌లోని ఇమ్మిగ్రేషన్ స్టడీస్ నిపుణుడు డేవిడ్ జే బీర్ ఇటీవల చేసిన అధ్యయనంలో తేలింది. ఇది వారి తల్లిదండ్రుల నుండి బలవంతంగా వారు విడిపోవడానికి దారి తీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుంచి USకి వెళ్లే పిల్లలు H-4 వీసా కింద అక్కడే ఉంటారు. ఇది H-1B వీసాదారుల జీవిత భాగస్వాములు మరియు పిల్లలకు వలసేతర వీసా. H1B వీసాలు అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులకు తాత్కాలిక ఉద్యోగ వీసాలుగా పని చేస్తాయి. ఈ వీసా ఉన్న వారు అక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకు అనుమతి ఉంటుంది. అక్కడి ప్రభుత్వం కూడా ఈ వీసా ఉంటే వారిని ఏమీ అనదు. అందుకోసం H1B వీసాలు లేకుండా అక్కడ ఉండేందుకు ఎక్కువగా మొగ్గు చూపరు. అంతే కాకుండా పిల్లలకు 21 ఏళ్లు వచ్చినప్పుడు, వారు ఇకపై హెచ్-4 వీసా కేటగిరీ కింద యునైటెడ్ స్టేట్స్‌లో ఉండడానికి అక్కడి చట్టాలు అనుమతించవు. ఈ నిబంధనే అక్కడి పిల్లలకు పెద్ద చిక్కును తీసుకొచ్చింది.