అంతరిక్షంలో ప్రతి 10వేల ఏళ్లకోసారి గామా కిరణాల పేలుడు: ఖగోళ శాస్త్రవేత్తల వెల్లడి

ప్రతి 10,000 సంవత్సరాలకు ఒకసారి అంతరిక్షంలో ప్రకాశవంతమైన గామా కిరణాల పేలుడు సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటి వరకు సంభవించిన ఇతర విస్ఫోటనాల కంటే ఎక్స్‌ట్రా గాలాక్టిక్ విస్ఫోటనం 70 రెట్లు ప్రకాశవంతంగా ఉందని NASA తెలిపింది. ఇక గత ఏడాది అక్టోబరులో నమోదైన గామా కిరణాల పేలుడు అత్యంత ప్రకాశవంతమైనదని నాసాకు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్తలు వెల్లడించారు. గామా కిరణాల పేలుడు (gamma-ray burst-GRB)), విశ్వంలోని అత్యంత శక్తివంతమైన పేలుళ్లకు సంబంధించిన ఒక విభాగమని నాసా […]

Share:

ప్రతి 10,000 సంవత్సరాలకు ఒకసారి అంతరిక్షంలో ప్రకాశవంతమైన గామా కిరణాల పేలుడు సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటి వరకు సంభవించిన ఇతర విస్ఫోటనాల కంటే ఎక్స్‌ట్రా గాలాక్టిక్ విస్ఫోటనం 70 రెట్లు ప్రకాశవంతంగా ఉందని NASA తెలిపింది.

ఇక గత ఏడాది అక్టోబరులో నమోదైన గామా కిరణాల పేలుడు అత్యంత ప్రకాశవంతమైనదని నాసాకు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్తలు వెల్లడించారు. గామా కిరణాల పేలుడు (gamma-ray burst-GRB)), విశ్వంలోని అత్యంత శక్తివంతమైన పేలుళ్లకు సంబంధించిన ఒక విభాగమని నాసా తెలిపింది. కాగా.. ఈ సంఘటన భూమికి రెండు బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. దీంతో గెలాక్సీలో ఎక్కువ భాగం మెరుపు సంభవించిందని తెలిపింది. మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి.. ఇంత పెద్ద పేలుడు సంభవించడం ఇదే మొదటిసారని NASA తెలిపింది.

ఈ విశ్వంలో ఇప్పటి వరకు ఏర్పడిన ఇతర విస్ఫోటనాల కంటే ఈ ఎక్స్‌ట్రా గాలాక్టిక్ విస్ఫోటనం వల్ల 70 రెట్లు ఎక్కువ మెరుపు ఏర్పడిందని నాసా తెలిపింది.. నాసా ఇచ్చిన ఒక పత్రికా ప్రకటనలో, ఈ పేలుడు వల్ల అనేక అంతరిక్ష నౌకల డిటెక్టర్లపై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబ్జర్వేటరీలపై ప్రభావం పడిందని నాసా తెలిపింది. ఈ ప్రభావం పడిన డేటా మొత్తాన్ని అనుసరించి ఖగోళ శాస్త్రవేత్తలు అప్పుడు అది ఎంత ప్రకాశవంతంగా ఉందో వివరించగలిగారు, అదే విధంగా దాని శాస్త్రీయ ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోగలిగారు.

ఈ GRB 221009A అనేది మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి సంభవించిన X- రే గామా-కిరణాల శక్తులలోకెల్లా అత్యంత ప్రకాశవంతమైన పేలుడు కావచ్చునని బాటన్ రూజ్‌లోని లూసియానా స్టేట్ యూనివర్శిటీలో భౌతిక శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ఎరిక్ బర్న్స్ అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రతి 10,000 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని  ఎరిక్ బర్న్స్ వివరించారు.

ఈ పేలుడు అత్యంత ప్రకాశవంతంగా ఉందని, ఇది అంతరిక్షంలో ఉన్న అనేక గామా కిరణాల పరికరాలను నాశనం చేసిందని.. అంటే అవి ఉద్గారాల వాస్తవ తీవ్రతను నేరుగా రికార్డ్ చేయలేవని ఎరిక్  వెల్లడించారు. కాగా.. అమెరికా శాస్త్రవేత్తలు ఫెర్మి డేటా నుండి ఈ సమాచారాన్ని తీసుకోగలిగారు. 

వారు కోనస్ డేటాపై పని చేస్తున్న రష్యన్ బృందం, చైనీస్ బృందాలు వారి SATech-01 ఉపగ్రహం, వారి ఇన్‌సైట్- HXMT అబ్జర్వేటరీలోని పరికరాలపై GECAM-C డిటెక్టర్ నుండి పరిశీలనలను విశ్లేషిస్తూ ఫలితాలను రాబట్టారు. మొత్తానికి.. ఇప్పటి వరకు చూసిన వాటన్నింటి కంటే ఈ పేలుడు 70 రెట్లు ప్రకాశవంతంగా ఉందని నాసా సదరు ఆధారాలతో నిరూపించింది.

“ఇది అతి భయంకరమైన విస్ఫోటనం. ఇది చాలా అసాధారణమైనది, మేము రిమోట్‌ ద్వారా కూడా దానికి దగ్గరగా ఉన్న వాటిని చూడలేకపోయామని బర్న్స్ తెలిపారు.

“అత్యంత దగ్గరగా,  ప్రకాశవంతంగా ఉండటం వలన, విద్యుదయస్కాంత వర్ణపటం అంతటా ఆఫ్టర్‌గ్లో పరిశీలనలను సేకరించడానికి, GRB జెట్‌లలో నిజంగా ఏమి జరుగుతుందో, మా నమూనాలు ఎంత వరకు ప్రతిబింబిస్తాయో పరీక్షించడానికి ఈ పేలుడు మాకు అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చింది” అని టక్సన్‌లోని అరిజోనా విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కేట్ అలెగ్జాండర్ చెప్పారు. 

“గత ఇరవై ఐదు సంవత్సరాలుగా  చాలా బాగా పనిచేసిన ఆఫ్టర్‌గ్లో మోడల్‌లు ఈ  పేలుడును పూర్తిగా వివరించలేవు” అని  అలెగ్జాండర్ పేర్కొన్నారు.  మేము ఈ పేలుడును పూర్తిగా అర్థం చేసుకోని కొత్త రేడియో కాంపోనెంట్‌ను కనుగొన్నాము.  GRB జెట్‌లు వాటి పరిసరాలతో ఎలా సంకర్షణ చెందుతాయో సూచిస్తాయని అలెగ్జాండర్ అన్నారు.

చివరగా.. ఈ విస్ఫోటనం.. తమకు అతి పెద్ద ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించడానికి అవకాశాన్ని ఇచ్చిందని నాసా తెలిపింది.